అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న వైభవంగా జరిగిగే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ వేడుకకు 7000 మంది హాజరుకానున్నారు. తాజాగా రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ స్థలం విషయంలో నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇక్బాల్ అన్సారికి కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక ఆహ్వానం అందించింది.
రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరింది. బాబ్రీ మసీదుగా మద్దతుగా నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారికి 2020 ఆగస్టు 5న రామ మందిర భూమిపూజ కార్యక్రమానికి కూడా ఆహ్వానం పంపించిన విషయం గమనార్హం.
అయితే ఇటీవల అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఆ సమయంలో కూడా రోడ్డు షోలో పాల్గొన్న ప్రధానమంత్రికి ఇక్బాల్ అన్సారి పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంలో ఇక్బాల్ స్పందిస్తూ.. అతను(మోదీ) మా ప్రాంతానికి వచ్చారు. ఆయన మాకు అతిథి, మా ప్రధానమంత్రి కూడా’ అంటూ అందుకే స్వాగతం పలికానని వివరణ ఇచ్చారు.
కాగా.. ఇక్బాల్ అన్సారి తండ్రి కూడా రామజన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన 95 ఏళ్ల వయస్సులో 2016లో మృతి చెందారు. అనంతరం రామజన్మభూమి వివాదం కేసులో ఇక్బాల్ అన్సారీ కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కీలకంగా వ్యవహిరించారు. కాగా.. రామజన్మభూమి వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం 2019 నవంబర్ 9న కీలక తీర్పును వెలువరించింది. వివాదంలో ఉన్న స్థలాన్ని రామమందిర నిర్మాణానికి కేటాయిస్తూ.. దానికి దగ్గరలో మరోచోటు ముస్లింలకు 5ఎకరాలకు స్థలాన్ని కేటించిన విషయం తెలిసిందే.
చదవండి: జైల్లోని తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
Comments
Please login to add a commentAdd a comment