నూతన సంవత్సరం సందర్భంగా అయోధ్యలో రోజంతా భక్తుల సందడి కనిపించింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని, శ్రీరాముని దర్శించుకున్నారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం అయోధ్యను సుందరంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
నూతన సంవత్సరం సంద్భంగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో నాలుగు వేదాలలోని అన్ని శాఖల పారాయణం, యాగం నిరంతరం కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వేద పండితులు, యాగ్యాచార్యులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment