అయోధ్య: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.
నవరాత్రులలో మొదటి రోజున నవదుర్గలలో ఒకరైన శైలపుత్రిని పూజిస్తారు. అయోధ్యలో అన్ని దేవాలయాలు అమ్మవారి పూజలతో కళకళలాడుతున్నాయి. ఇక్కడి ఛోటీ దేవ్‌కాళి ఆలయంలో భక్తులు క్యూ కట్టి, అక్కడ కొలువైన సీతామాతను ఆరాధిస్తున్నారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని పలువురు నమ్ముతుంటారు.
అయోధ్యకు చెందిన పండితులు సత్యేంద్ర దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నవరాత్రులలో మొదటి రోజు. ఈ రోజున చాలామంది తమ ఇళ్లలో కలశాన్ని ప్రతిష్టించి, తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అయోధ్యకు వచ్చిన భక్తురాలు మీరా మాట్లాడుతూ, ఆలయంలో అమ్మవారి దర్శనం చక్కగా అయ్యిందని, అధికారులు భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేశారని అన్నారు. మరో భక్తుడు శైలేంద్ర మాట్లాడుతూ ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అన్నారు.
ఇది కూడా చదవండి: 4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment