pandit
-
నలుగురిని కనండి.. లక్ష పట్టుకెళ్లండి
ఇండోర్: సమాజంలో బ్రాహ్మణుల జనాభా తగ్గిపోతోందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి బ్రాహ్మణ జంట నలుగురిని కనాలని, నలుగురిని కన్న జంటలకు రూ.1 లక్ష బహుమతి ఇస్తానని మధ్యప్రదేశ్ పరశురామ్ కళ్యాణ్ బోర్డు చీఫ్ పండిత్ విష్ణు రాజోరియా వ్యాఖ్యానించారు. ఆదివారం ఇండోర్‌లో సనాధ్య బ్రాహ్మణ వర్గాల్లో పెళ్లీడు యువతీయువకుల పరిచయ సమ్మేళనం, వివాహ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘బ్రాహ్మణ యువ జంటలు చక్కటి సంపాదన, ఉద్యోగం ఉండి కూడా కేవలం ఒక సంతానంతో సరిపెట్టేస్తున్నారు. ఈ పద్ధతి మంచి కాదు. సమాజంలో బ్రాహ్మణుల జనాభా తగ్గుతోంది. స్వాతంత్య్ర వచ్చినప్పటితో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. హిందూయేతర జనాభా అమాంతం పెరుగుతోంటే మన వర్గీయులు జనాభా వ్యవహారాలపై దృష్టిపెట్టడమే మానేశారు. ఇకనైనా ప్రతి బ్రాహ్మణ జంట కనీసం నలుగురిని కనాలి. అలా నలుగురు సంతానం ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు తలో లక్ష రూపాయలు నగదు బహుమతిగా ఇస్తా. నేను పదవి నుంచి దిగిపోయాక కూడా ఇదే నజరానా కొనసాగేలా చూస్తా’’అని రాజోరియా అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘పరశురామ్ కళ్యాణ్ బోర్డ్‌తో దీనికి సంబంధం లేదు. నా స్వంత ఖర్చులతో, సమాజంలోని కొన్ని వర్గాల మద్దతుతో నగదు బహుమతి అందిస్తా. ఇలాంటి పథకంతో మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదు’’అని చెప్పారు. -
ప్రముఖ నిర్మాత ఆనంద్ పండిట్ కూతురి పెళ్లి.. మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
-
ప్రాయశ్చిత్త పూజ ఏమిటి? అయోధ్యలో ఎందుకు చేస్తున్నారు?
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముందుగా నేడు (మంగళవారం)ప్రాయశ్చిత్త పూజలు చేస్తున్నారు. ఇంతకీ ప్రాయశ్చిత్త పూజ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ప్రతీఒక్కరూ తెలిసో, తెలియకో తప్పులు చేస్తుంటారు. చేసిన తప్పులకు ఆ తరువాత పశ్చాత్తాప పడుతుంటారు. హిందూ ధర్మంలో వైదిక సంప్రదాయం ప్రకారం భగవంతుని పూజించడానికి ప్రత్యేక నియమాలు, విధానాలు ఉన్నాయి. ఏదైనా మతపరమైన ఆచారాన్ని నిర్వహించే ముందు వాటిని పాటించడం తప్పనిసరి అని భావిస్తారు. అయితే పూజా విధానంలో పొరపాటున ఏవైనా నియమాలను తప్పితే, తప్పు జరిగిందని బాధపడుతుంటారు. అందుకే దోష పరిహారం కోసం ముందుగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ తరహా పూజలతో భౌతిక, మానసిక, అంతర్గత ప్రాయశ్చిత్తం జరుగుతుందని పండితులు చెబుతారు. ప్రాయశ్చిత్త పూజలో భాగంగా 10సార్లు పుణ్య స్నానాలు చేస్తారు. బూడిదతో సహా వివిధ వస్తువులతో స్నానం చేస్తారు. ఈ పూజలో గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. బంగారం, వెండి, నగలు మొదలైనవి కూడా దానం చేస్తారు. ప్రాయశ్చిత్త పూజలు చేయడం వలన ఎటువంటి దోషాలు అంటుకోవని చెబుతారు. అందుకే దేవాలయాలు నిర్మించినప్పుడు లేదా విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు తప్పనిసరిగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. ఫలితంగా పూజల నిర్వహణలో ఎటువంటి పొరపాటు జరిగినా దోషం తగలదని అంటారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి! -
ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత?
సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులకు ఈ జనవరి చాలా ప్రత్యేకమైనది. ఈ నెల చారిత్రాత్మకం కానుంది. ఈ నెలలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు. అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకే ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఇందులోని విశిష్టత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠ తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైనా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ‘ప్రాణ్’ అనే పదానికి ప్రాణశక్తి అని, ‘ప్రతిష్ఠ’ అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా చూసుకుంటే ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడం అని అర్థం. ప్రాణ ప్రతిష్టకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతిష్ఠాపన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యాడని చెబుతారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభ ముహూర్తాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం తగదని పండితులు చెబుతుంటారు. ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ విగ్రహానికి గంగాజలం లేదా వివిధ పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి, నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం ఆ విగ్రహాన్ని స్వచ్ఛమైన, శుభ్రమైన ప్రదేశంలో ఉంచి గంధంపూస్తారు. తరువాత బీజాక్షర మంత్రాలు పఠిస్తూ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠగావిస్తారు. ఈ సమయంలో పంచోపచారాలు నిర్వహిస్తూ, పూజలు చేస్తారు. చివరిగా ఆ దేవతా స్వరూపానికి హారతి ఇస్తారు. ఇదే సమయంలో భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఇది కూడా చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ.. -
శ్రీరాముని దర్శనం కోసం భక్తులు బారులు
నూతన సంవత్సరం సందర్భంగా అయోధ్యలో రోజంతా భక్తుల సందడి కనిపించింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని, శ్రీరాముని దర్శించుకున్నారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం అయోధ్యను సుందరంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. నూతన సంవత్సరం సంద్భంగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో నాలుగు వేదాలలోని అన్ని శాఖల పారాయణం, యాగం నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వేద పండితులు, యాగ్యాచార్యులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. -
బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు 84 సెకెన్ల సూక్ష్మ ముహూర్తం!
రాబోయే జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. 84 సెకన్ల సూక్ష్మ ముహూర్తంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నూతన రామాలయంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు ఐదు ముహూర్తాలు ప్రతిపాదించారు. అయితే రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంతిమ నిర్ణయాన్ని గీర్వాణవాగ్వర్ధిని సభకు, కాశీ పండితులకు వదిలివేసింది. జనవరి 22న అత్యంత శుభ ముహూర్తంగా వారు నిర్ణయించారు. జనవరి 17, 21, 24, 25 తేదీలలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన శుభ ముహూర్తాన్ని దేశంలోని నలుమూలలకు చెందిన పండితులు అందించారు. వారిలో కాశీకి చెందిన పండితుతు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అందించిన ముహూర్తాన్ని ఎంపిక చేశారు. అభిజిత్ ముహూర్తంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి చాలా సూక్ష్మమైన శుభ సమయం ఉందని గణేశ్వర్ శాస్త్రి తెలిపారు. జనవరి 22న మేష రాశిలో వృశ్చిక నవాంశ వేళ.. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 వరకు 84 సెకన్ల సమయం కలిగిన ఈ ముహూర్తాన బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కాశీలోని వైదిక బ్రాహ్మణులు పర్యవేక్షించనున్నారు. కాశీ నుండే పూజలకు కావాలసిన సామగ్రిని తరలించనున్నారు. కాశీ నుండి పండితుల మొదటి బ్యాచ్ డిసెంబర్ 26న అయోధ్యకు బయలుదేరనుంది. వీరు యాగశాల, పూజా మండపం పనులు చేపట్టనున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 51 మంది వేద పండితులు పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆ పదుగురు... 2023లో రాజకీయాలన్నీ వీరివైపే.. -
శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు
అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరడానికి ఇక 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2024 జనవరి 22న శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. కాశీకి చెందిన పండితులు లక్ష్మీకాంత దీక్షిత్ నేతృత్వంలో 121 మందికి పైగా వేద పండితుల బృందం జనవరి 16 నుండి 22 వరకు రామాలయంలో పూజలు నిర్వహించనుంది. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందు యాగంతో పాటు నాలుగు వేదాల పఠనం.. ఇలా మొత్తం 60 గంటల పాటు వివిధ పూజాది కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీరామునికి 56 రకాల ప్రసాదాలు సమర్పించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీరామునికి ఘనమైన హారతినివ్వనున్నారు. జనవరి 17న ఉదయం ఎనిమిది గంటలకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమై, మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు వివిధ పూజలు తిరిగి ప్రారంభమై రాత్రి 9.30 గంటల వరకు కొనసాగనున్నాయి. అంటే జనవరి 16 నుండి 22 వరకు ప్రతిరోజూ దాదాపు 10 నుండి 12 గంటల పాటు రామాలయంలో పూజలు జరగనున్నాయి. జనవరి 22న బాల శ్రీరాముడు గర్భగుడిలో కొలువుదీరనున్నాడు. ఈ పూజాదికాల కోసం ఆలయ ప్రాంగణంలో పలు మండపాలు, హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన సాయుధ బృందం అయోధ్యలో త్వరలో ప్రారంభంకానున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి భద్రతను అందించనుంది. డిసెంబర్ నెలాఖరులోగా విమానాశ్రయం మొదటి దశ పూర్తవుతుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఇది కూడా చదవండి: రాజస్థాన్ సీఎం ఎంపికకు ఛత్తీస్‌గఢ్ ఫార్ములా? -
మూత్రవిసర్జన ఘటన.. ఊహించని ట్విస్ట్
ఇవాళ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది. సంతోషం.. కానీ కొన్నాళ్ల పోయాక ఈ ఘటన నుంచి మీడియా, పోలీసులు, ప్రజలందరి దృష్టి మళ్లిపోతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి.. భయంతో బతకాల్సిందేనా?.. అంటూ తన పూరి గుడిసె ముందు కూర్చుని కళ్లలో భయంతో ప్రశ్నిస్తున్నాడు 35 ఏళ్ల దశ్మత్ రావత్. మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో చోటుచేసుకున్న హేయనీయమైన ఘటన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుబ్రి గ్రామానికి చెందిన గిరిజనుడైన దశ్మత్ రావత్‌పై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేయడం.. ఆ వీడియో కాస్త విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. ఈ ఘటన పెనుదుమారం రేపగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితుడి ఇంటికి సంబంధించి కొంత పోర్షన్‌ను అక్రమ కట్టడంగా పేర్కొంటూ బుల్డోజర్ కూల్చేయించింది. ప్రవేశ్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టింది కూడా. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ కోరడంతో ఈ ఘటన ఇంకా హైలెట్ చర్చగా మారింది. అయితే ఈ ఘటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు ప్రవేశ్ శుక్లాను విడిచిపెట్టాలంటూ దశ్మత్ రావత్.. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ‘జరిగిందేదో జరిగింది. అతను తన తప్పు తెలుసుకున్నాడు. ఇకనైనా అతన్ని క్షమించి వదిలిపెట్టాలి అని మీడియా ద్వారా రావత్ ప్రభుత్వాన్ని కోరాడు. అతను చేసింది తప్పే కదా అని మీడియా అడగ్గా.. ‘‘అవునూ.. అతను చేసింది ముమ్మాటికీ తప్పే. అది నేనూ ఒప్పుకుంటా. అతను మా ఊరి పూజారి. అందుకే అతన్ని విడుదల చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని రావత్ చెబుతున్నాడు. పైగా ఆ ఘటన ఈ మధ్య జరిగింది కాదని.. ఎప్పుడో 2020లో జరిగిందని చెప్పాడను. అది 2020లో. ఓ రాత్రిపూట పదిగంటల సమయంలో ఓ దుకాణం వద్ద నేను కూర్చున్నా. అతను నా దగ్గరకు వచ్చి నాపై మూత్రం పోశాడు. ఆ సమయంలో నేను అతని ముఖం కూడా చూడలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. తన తప్పు తాను తెలుసుకున్నాడతను. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటోంది ఒక్కటే.. అతన్ని విడిచిపెట్టి మా ఊరికి మంచి రోడ్డు వేయమని అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడతను. ఇప్పుడంటే ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, మీడియా తనకు ధైర్యం చెబుతుందని, కొన్నాళ్లకు అందరూ విషయం మర్చిపోయిన తర్వాత వాళ్లు మామీద కక్ష సాధిస్తే ఎవరు బాధ్యులని ఆందోళన వ్యక్తం చేశాడు. తాము, తమ పిల్లలు సంతోషంగా ఉండాలంటే మాకు ఎవరితో గొడవలు వద్దని అన్నాడు. అందుకే జరిగిందేదో జరిగింది నిందితుడిని వదిలేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపాడు. మరోవైపు రోజు 100, 200 రూపాయలు సంపాదిస్తేనేగానీ తమ కుటుంబం గడవదని.. అలాంటిది ఊరిలో ఎవరితో తమకు శత్రుత్వం వద్దని భార్య ఆశా సైతం వాపోతోంది. ऐसे पापी दुनिया में बहुत हैं मुख्यमंत्री शिवराज सिंह चौहान किसका _ किसका पैर धोएंगे !#ArrestGoluGurjar#GoluGurjar #MPNews #SidhiUrineCase #SidhiMP #Gwalior #शिवराज pic.twitter.com/vdkrDzO890 — Viral Notebook (@NotebookVi42149) July 8, 2023 ఇదిలా ఉంటే.. మూత్ర విసర్జన ఘటన పెనుదుమారం రేపడం వెనుక రాజకీయ విమర్శలు కారణం అయ్యాయి. నిందితుడు బీజేపీకి చెందిన వ్యక్తి అంటూ కాంగ్రెస్.. కాదు కాంగ్రెస్‌వి ఉత్త ఆరోపణలే అని బీజేపీ పరస్పరం విమర్శించుకున్నాయి. ఇక బాధితుడు రావత్ కాళ్లను సీఎం చౌహాన్ కడగడాన్ని కూడా కాంగ్రెస్ డ్రామాగా అభివర్ణించింది. ప్రభుత్వంపై బ్రహ్మణ సంఘాల మండిపాటు నిందితుడు శుక్లా ఇంటి పోర్షన్‌ను అక్రమ భాగమంటూ కూల్చివేయడంపై బ్రహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. శుక్లా చేసింది పాపపు పనే అయినప్పటికీ.. ఆయన కుటుంబ సభ్యులను శికక్షించాల్సిన అవసరం ఏముందంటూ నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఐపీసీ సెక్షన్లతో పాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు నేషనల్ సెక్యూరిటీ చట్టం కింద ప్రవేశ్ శుక్లాపై కఠినమైన నేరారోపణలు నమోదు అయ్యాయి. आदिवासी व्यक्ति की सरकार से अपील गांव के ब्राह्मण हैं छोड़ दीजिए जो हुआ सो हुआ...#news #news14today #news #ShivrajSinghChouhan #mutrakand #aadiwasi pic.twitter.com/La1cijtI1b — NEWS14TODAY (@news14_today) July 8, 2023 -
Tejaswini Pandit: ఆదిపురుష్‌లో శూర్పనఖ.. రియల్ లైఫ్‌లో ఎలా ఉందంటే? (ఫొటోలు)
-
పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది
పురుషులతోపాటు మహిళలు దాదాపు అన్నిరంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా నిత్య పూజల నుంచి కైంకర్యాల దాకా అంతా మగ పూజారులు, పండితులు మాత్రమే చూసుకోవడం చూస్తున్నాం. కానీ అమెరికాలో పండితుల పీటమీద సుష్మా ద్వివేది కూర్చుని పెళ్లిళ్లు జరిపిస్తూ కొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. కుల, మత భేదం లేకుండా పెళ్లిళ్లు చేయడమే గాక, పూజలు, వ్రతాలు కూడా నిర్వహిస్తోంది. భారత సంతతికి చెందిన సుష్మ కెనడాలో పెరిగిన అమ్మాయి. 2013లో వివేక్ జిందాల్‌తో పెళ్లి జరిగింది. వీరి పెళ్లితోపాటు వివేక్ జిందాల్ తోబుట్టువు ఒకరి పెళ్లికూడా అదే సమయంలో ఏర్పాటు చేశారు. కానీ అది ఒక ట్రాన్స్‌జెండర్ పెళ్లి. దీంతో సుష్మా వాళ్ల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగినప్పటికీ తోబుట్టువు పెళ్లి అలా జరగలేదు. అప్పుడు అంతా బాధపడ్డారు. ఆ పెళ్లి కూడా సంప్రదాయబద్ధంగా జరిగితే బావుండును అని సుష్మకు అనిపించింది. కానీ అలా జరగలేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటోన్న వారికి పరిష్కారం చూపాలని అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించింది సుష్మ. తొలి బిడ్డ ప్రసవ సమయంలో... నెలలు నిండిన సుష్మ ఆసుపత్రిలో చేరింది. అక్కడ కాన్పు సవ్యంగా జరగడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ఓ జంటకు పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎనస్థీషియా డాక్టర్ ద్వారా తెలిసింది. ఆ జంట పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణమని ఆమె చెప్పడంతో సుష్మ మరోసారి ఆలోచనలో పడింది. అరగంట ఆలోచించి ఆ జంటకు తానే పెళ్లిచే యిస్తానని చెప్పింది. ప్రసవం అయ్యి బెడ్‌మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న సుష్మ గదిలోకి ఆ జంట రాగా అక్కడ ఉన్న నర్సులు పాట పాడగా ఆ జంటకు పెళ్లి తంతుని ముగించింది సుష్మ. ఈ కార్యక్రమం మొత్తాన్ని వివేక్ ఐఫోన్లో వీడియో తీశారు. ఆ తరువాత ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా సుష్మ పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో ఉన్న పెళ్లిమంత్రాలను నేర్చుకుని పెళ్లిళ్లు చేయడం ప్రారంభించింది. బామ్మ దగ్గర నేర్చుకుని.. ప్రారంభంలో అంతా సుష్మను వ్యతిరేకించినప్పటికీ వాటన్నింటి దాటుకుని ముందుకు సాగుతూ అమెరికాలోనే తొలి మహిళా పురోహితురాలిగా నిలిచింది. ఇదే రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాత హిందూ సంప్రదాయాల గురించి లోతుగా తెలిసిన బామ్మతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుంది. అంతేగాక బామ్మతో కలిసి... పూజలు, పెళ్లికి ఏయేమంత్రాలు చదువుతారు? వాటిని ఎలా ఉచ్చరించాలి? సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన క్రతువుల గురించి వివిధ గ్రంథాలను చదివి పెళ్లిమంత్రాలను ఆపోశన పట్టింది. అంతేగాక 88 ఏళ్ల బామ్మ ఇచ్చిన ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని అనేక పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటిదాకా దాదాపు యాభై పెళ్లిళ్లు చేసింది. అరగంట పెళ్లి.. ఎంతో చక్కగా పెళ్లిళ్లు చేస్తోన్నసుష్మా.. మరింతమందికి తన సేవలు అందించేందుకు 2016లో ‘పర్పుల్ పండిట్ ప్రాజెక్ట్’ పేరిట న్యూయార్క్‌లో సంస్థను ప్రారంభించింది. దీనిద్వారా పెళ్లితోపాటు అనేక మతపరమైన సేవలను అందిస్తోంది. దక్షిణాసియాలోని ‘గే’ కమ్యూనిటీ వాళ్లకు అరగంటలో పెళ్లి చేస్తుంది. సంప్రదాయ హిందూ పెళ్లిళ్లను మూడుగంటల్లో పూర్తి చేస్తోంది. అంతేగాక తన భర్త నిర్వహిస్తోన్న ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ ‘డెయిలీ హార్వెస్ట్’కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి ఒకపక్క సంసారాన్ని, మరోపక్క కంపెనీ బాధ్యతలనూ నిర్వర్తిస్తూనే పౌరోహిత్యం కూడా అంతే సజావుగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని కామెంట్లు వస్తున్నాయి. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుష్మ మరిన్ని పెళ్లిళ్లతో ముందుకు సాగాలని కోరుకుందాం. బాలింతగా ఆస్పత్రి బెడ్‌పైన ఉండి మరీ పెళ్లి జరిపిస్తున్న సుష్మ -
యామునాచార్యుని రాజనీతి
యామునాచార్యుడు విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రవర్తక ఆచార్యులలో ముఖ్యుడైన నాథమునికి మనుమడు. గొప్ప పండితుడు. చోళదేశంలోని వీరనారాయణపురంలో నివసించేవాడు. తండ్రిపేరు ఈశ్వరముని. యామునాచార్యుడు ఒకసారి తన గురువు దగ్గర చదువుకుంటుండగా, రాజపురోహితుడు అక్కడకు వచ్చి, తనకు చెల్లించవలసిన రుణాన్ని వెంటనే చెల్లించమని లేఖ పంపాడు. గురువు కడు పేదవాడు. విషయం తెలుసుకున్న యామునాచార్యుడు ఆ లేఖను చింపాడు. మరొక పత్రం తీసుకుని దానిమీద ఒక శ్లోకం రాసి, దూతకి ఇచ్చి పంపాడు. రాజపురోహితుడు ఆ శ్లోకాన్ని రాజుకు చూపించాడు. రాజు, తన పురోహితునితో శాస్త్రవాదనకు రమ్మని యామునని పిలిపించాడు. ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వాదనలో యామునాచార్యుడు గెలిచాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజు తన రాజ్యంలోని అర్ధభాగాన్ని కానుకగా ఇచ్చాడు. అధిక సంపద చేతికి అందటంతో, యామునాచార్యుడు భోగలాలసుడయ్యాడు. అతడిని అర్ధకామాల నుంచి తప్పించి, భగవంతుని వైపు ధ్యాస మళ్లించాలని యామునాచార్యుని తాతగారి ప్రశిష్యుడైన శ్రీరామమిశ్రుడు ఉపాయం ఆలోచించాడు. యామునుడికి ఇష్టమైన ముండ్లముస్తె కూరను ప్రతిరోజూ అందచేయడం ప్రారంభించాడు. ఇలా ఆరుమాసాలు గడిచింది. తరవాత ఒకనాడు యామునాచార్యుడు భోజన సమయానికి ఆ కూర లేకపోవటంతో, వంటవానిని అడిగాడు. అందుకు అతడు, ‘‘ఎవరో ఒక వృద్ధుడు ఆ కూరను ఇన్ని రోజులు తీసుకువచ్చాడు. ఎందుచేతనో నాలుగు రోజులుగా తీసుకురావట్లేదు’’ అన్నాడు. యామునాచార్యుని ఆజ్ఞ మేరకు శ్రీరామమిశ్రుడు వచ్చి, ‘మీ తాతగారైన నాథముని మీ కోసం ఒక నిక్షేపాన్ని నాకు ఇచ్చి, మీకు అందచేయమన్నారు, మీరు నా వెంట శ్రీరంగానికి రావాలి’ అన్నాడు. యామునాచార్యుడు శ్రీరామమిశ్రుని వెంట శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడకు రాగానే, ‘ఇదే మీ తాతగారు మీకు ఇమ్మని చెప్పిన నిక్షేపం’ అని శ్రీరంగనాథుని రెండు పాదాలను చూపాడు. యామునాచార్యుడికి కళ్లు తెరుచుకున్నాయి. కుమారుడికి రాజ్యం అప్పచెప్పి, రాజనీతి బోధించి, సన్యసించాడు. (యామునాచార్యుడు బోధించిన రాజనీతి ఇకపై వారం వారం) -
అపార క్షమాగుణ సంపన్నుడు
పూర్వం సుఫ్యాన్ సూరి అనే ఒక గొప్ప ధార్మిక పండితుడు ఉండేవారు. అతని పొరుగున ఓ కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని పెద్ద తాగుబోతు. ఎప్పుడూ నిషాలోనే ఉండేవాడు. ఇస్లామ్‌లో మద్యపాన సేవనం నిషిధ్ధం. కాని ఆవ్యక్తి అదేమీ పట్టించుకునేవాడు కాదు. కొన్నాళ్ళకు ఆవ్యక్తి చని పోయాడు. అందుకని అతని జనాజా నమాజు చేయించడానికి ఎవరూ ముందుకు రాలేదు. సుఫ్యాన్ సూరీ కూడా వెళ్ళలేదు. ఒక విశ్వాసికి ఇలాంటి దుర్గతి పట్టిందే అని బాధ పడ్డారు. అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకున్నారు. అప్పుడాయనకు ఒక కల వచ్చింది. పొరుగు వ్యక్తి జనాజా నమాజు చేయించాలన్నది కల సారాంశం. మెలకువ వచ్చిన వెంటనే సుఫ్యాన్ సూరీ ఆలోచనలో పడ్డారు. చివరికి ఈ కలలో ఏదో పరమార్ధం ఉండి ఉంటుందని భావిస్తూ, పొరుగింటికి వెళ్ళారు. కుటుంబ సభ్యుల్ని విచారించారు. ఈ మనిషి ఎప్పుడూ తాగుతూ..తిరుగుతూ.. ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడు కదా.. అసలు ఇతని ఆచరణ ఏమిటి.. మరణ సమయాన ఇతని పరిస్థితి ఏమిటి..? అని ఆరాతీశారు. అప్పుడు కుటుంబ సభ్యులు, ‘అవునండీ.. ఇతనెప్పుడూ తాగుతూనే ఉండేవాడు. ఎంత వారించినా వినేవాడుకాదు. పైగా, ఎదురు తిరిగి మమ్మల్నే తిట్టిపోసేవాడు. కాని చివరి రోజుల్లో తప్పు తెలుసుకున్నాడు. తాగుడు మానేసి పశ్చాత్తాప పడేవాడు. చేసిన పాపాల పట్ల సిగ్గు పడుతూ లోలోన కుమిలిపోయేవాడు. అంతిమ సమయం లో బాగా ఏడ్చాడు. తన ప్రభువు ముందు సాగిలపడి క్షమించమని మొర పెట్టుకున్నాడు. పరివర్తిత హృదయంతో కడుదీనంగా దైవాన్ని వేడుకున్నాడు. అదే స్థితిలో అతను అంతిమశ్వాస విడిచాడు’. అని చెప్పారు కుటుంబ సభ్యులు. ఈ సంఘటనను ఉటంకిస్తూ సుఫ్యాన్ సూరీ ఇలా అన్నారు. దైవ కారుణ్యం అనంతం. దానికి పరిమితులు లేవు. మానవుడు ఎప్పుడు, ఏ సమయంలో తన వైపుకు మరలినా అక్కున చేర్చుకోడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన కారుణ్యం సంకుచితమైనదికాదు. బహు విశాలమైనది. దానికి ఎల్లలు, పరిధులు లేవు. ఇన్నాళ్ళుగా తప్పులు చేశామే.. పాప కార్యాలకు ఒడిగట్టామే.. జీవితమంతా తప్పుడు మార్గంలో గడిపి, ఇప్పుడు చివరిరోజుల్లో మంచి మార్గంలో నడిచినా ప్రయోజనమేమిటి? అని చాలామంది అనుకుంటారు. కాని ఈ భావన పూర్తిగా తప్పు. కేవలం ఈ కారణంగానే సన్మార్గానికి దూరంగా ఉండిపోయేవారు ఎంతోమంది. కాని ఇది సరైన విధానం కాదు. తెలిసో, తెలియకో జరిగిన తప్పులు, పాపాల పట్ల పశ్చాత్తాపం చెంది, ఇకనుండి అలాంటి దుర్నడతకు దూరంగా ఉంటామని ప్రతిన బూనాలి. దేవుని ముందు తప్పుల్ని అంగీకరించి, ఇకనుండి పరిశుధ్ధ జీవితం గడుపుతాము క్షమించమని వేడుకోవాలి. చిత్తశుధ్ధితో క్షమాపణ వేడుకునే వారి గత పాపాలన్నిటినీ దైవం క్షమిస్తాడు. పర్వతమంత ఎత్తు పేరుకు పోయిన పాపాలైనా, సముద్ర నురగకు సమానమైన పాపాలైనా సరే.. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కారుణ్య ద్వారాలు అనునిత్యం తెరుచుకునే ఉంటాయి. తన దాసుల్ని శిక్షించాలన్నది ఆయన ఉద్దేశ్యం కానే కాదు. నిజానికి ఆయన కరుణ తన దాసులను క్షమించడానికి సాకులు వెదుకుతుంది. ఎందుకంటే ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వైకుంఠానికేగిన వేదాంతి
హన్మకొండ కల్చరల్: ఉభయ వేదాంత ప్రవీణకవిశాబ్ది కేసరి, మహా మహోపాధ్యాయ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి(93) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస వదిలారు. ఆయనకు భార్య సీతమ్మ(88), కుమార్తెలు శేషమ్మ(70), శ్రీదేవి(63), నీలాదేవి(62), గోదాదేవి(61) మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వరంగల్ కరీమాబాద్‌లోని ఎస్ఆర్ఆర్ తోటలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమ యాత్రలో పండితులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. 1926 మే 1న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మోటూరులో జన్మించిన రఘునాథాచార్యులు, పండితులైన తన తండ్రి తాతాచార్యుల వద్ద సంస్కృత దివ్యప్రబంధ సంప్రదాయక విషయాలు అధ్యయనం చేశారు. విద్యాభ్యాసం.. ఉద్యోగం 1942 నుంచి హైదరాబాద్ సీతారాంబాగ్‌లోని వేదాంతవర్ధినీ సంస్కృత విద్యాలయంలో శ్రీమాన్ శఠగోపారామానుజాచార్య స్వామి, శ్రీమాన్ వేదాంతచార్య స్వామి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. 1944–66 వరకు వరంగల్‌లోని వైదిక కళాశాలలో ప్రధాన అధ్యాపకులుగా, 1966–88 వరకు వరంగల్‌లోని శ్రీ విశ్వేశ్వరయ్య సంస్కృతాంధ్ర కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత వరంగల్‌లోనే ఉంటూ సత్సంప్రదాయ పరిరక్షణ సభ ఏర్పాటు చేశారు. దాని ద్వారా శ్రీ భాష్య, భగవద్విషయ, గీతాభాష్య విషయాలను ఉపదేశిస్తూ ఎందరినో వేదాంత పండితులుగా తీర్చిదిద్దారు. రచనలు.. పురస్కారాలు ఆచార్యుల వారు శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రం, శ్రీభాష్యము కఠోపనిషత్, ఈశావ్యాసోపనిషత్ వ్యాఖ్యా నాలు, కురంగీపంచకం తదితర యాభైకి పైగా ఉభయ వేదాంత గ్రంథాలను ప్రచురించారు. దీంతో పాటు ఉత్తరరామ చరిత్రకు శ్రీకుమార తాతాచార్య సంస్కృత వ్యాఖ్య, వేంకటాధ్వరి లక్ష్మీసహస్రమునకు శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాల మునీంద్రుని అముద్రిత సంస్కృతవ్యాఖ్య, శ్రీవాధూల వీరరాఘవాచార్యస్వామి విరచిత సూక్తిసాధుత్వమాలికా, రసోదారభాణ తదితర అమూల్య గ్రంథాలను రాశారు. 1989–91వరకు కర్ణాటక మేల్కోటలోని సంస్కృత పరిశోధనా సంసత్, వారి ఉపనిషత్ ప్రణాళికకు వీరు ప్రధాన పరిశోధకులుగా పనిచేశారు. ‘కవిశాబ్దికేసరి’, ‘ఉభయవేదాంత ఆచార్య’, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, గోపాలోపాయన ప్రథమ పురస్కారం, మహా మహోపాధ్యాయ, తులాభారం–కనకాభి షేకం, తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం అందుకున్నారు. సర్వవైదిక సంస్థాన్ ‘శాస్త్రరత్నాకర ’బిరుదు, శ్రీ అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌స్వామి వారిచే గజారోహణ సన్మానం, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొం దారు. శ్రీ శ్రీరామచంద్రరామానుజ జీయర్‌స్వామి వారిచే బ్రహ్మరథోత్సవ సన్మానం, అ.జో–వి.భో కం దాళం ఫౌండేషన్ విశిష్ట పురస్కారం, తెలంగాణ తొలి అవతరణ దినోత్సవం సన్మానం, మరింగంటి శ్రీరంగాచార్య స్మారక పురస్కారం, పెద్ద జీయర్‌స్వామి చేతుల మీదుగా ఉభయవేదాంత మహోదధి పురస్కారం, సర్వార్థ సంక్షేమ సమితి స్థితప్రజ్ఞ బిరుదు, శ్రీరామానుజ రామచంద్ర జీయర్‌స్వామి చేతుల మీదుగా గోపాలదేశిక పురస్కారం, కవిరత్న ఫౌండేషన్ కవిరత్న పురస్కారం పొందారు. చెన్నై యూనివర్సిటీ జీవిత సాఫల్య పురస్కారం, శలాకవిద్వత్సమర్చన పురస్కారం అందుకున్నారు. సంస్కృత విజ్ఞానవర్ధినీ పరిషత్ స్థాపించి పరిషత్, సత్సంప్రదాయ పరిరక్షణ సభను భగవత్కైంకర్యనిధి స్థాపించి శ్రీపాంచ రాత్రాగమ పాఠశాలను స్థాపించి శ్రీరామక్రతువు నిర్వహణ, పుస్తక ప్రచురణ చేశారు. ఆలయాలకు జీర్ణోద్ధరణ: హన్మకొండలో చిన్న కోవెల, కృష్ణాజిల్లా మోటూరులో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ జరిపారు. శ్రీ తిరుమలాచార్య రామానుజ కూటమును నిర్మించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వీరి స్ఫూర్తి, ప్రోత్సాహం తో ఎన్నో దేవాలయాల నిర్మాణం, ప్రతిష్టలు జరిగాయి. చారిత్రక శ్రీ వేయిస్తంభాల త్రికూటాలయం లోని కేశవస్వామి గర్భగుడిలో కాకతీయుల కాలంలో ఉన్నట్లుగానే విగ్రహ ప్రతిష్టకు కృషి చేశారు. శ్రీ రఘునాథదేశిక విశిష్ట పురస్కార ప్రదానం తన తిరునక్షత్రోత్సవ సభల ద్వారా 13సంవత్సరాలుగా 52 మంది పండితులకు ‘శ్రీరఘునాథదేశిక విశిష్ట పురస్కారం ప్రదానం’చేశారు. శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి, భీమవరానికి చెందిన భాష్యకారసిద్ధాంతపీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ రామచంద్ర రామానుజ జీయర్‌స్వామి, శ్రీ శ్రీ రంగరామానుజ జీయర్‌స్వామి, శ్రీ అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జీయర్‌స్వామి, శ్రీ అహోబిలం జీయర్‌స్వామి, శ్రీదేవనాథ్ జీయర్‌స్వామి వంటి ఎందరో ఆచార్యులకే ఆచార్యులుగా గౌరవం అందుకున్నారు. కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంస్కృత పండితులు కవిశాబ్దిక కేసరి మహామహోపాధ్యాయ రఘునాథాచార్య స్వామి వారి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనమని, జీయర్ స్వాములతో పాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆచార్యులు సత్సంప్రదాయ పరిరక్షణకు అహర్నిశలూ కృషిచేశారన్నారు. ఆజన్మాంతం తన ప్రవచన పరంపరతో ప్రతిఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనీషి రఘునాథాచార్య స్వామి అని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సర్వీస్‌రూల్స్ సాధిస్తాం
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి నిజామాబాద్‌అర్బన్: సర్వీస్ రూల్స్ లేకపోవడంతో ఉపాధ్యాయులు పదోన్నతులు కోల్పోతున్నారని, త్వరలో వాటిని సాధిస్తామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరోత్తంరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశం హాలులో ఆదివారం నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, త్వరలో హెల్త్‌కార్డులు అందేలా చూస్తామన్నారు. దీని కోసం ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలు మాత్రమే పాటిస్తామన్నారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, కమలాకర్‌రావులు జిల్లాలో ఎస్ఎంస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మాణం చేశారు. మోడల్, కేజీబీవీ టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పడి సంఘం రెండుగా విడిపోయినప్పటికీ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు, మండలాల బాధ్యులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి.. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆల్ఇండియా టీచర్స్ అసోసియేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్ విధానం అప్రజాస్వామికమని, దాన్ని రద్దు చేయాలని దశల వారీగా పోరాటాలు చేస్తామన్నారు. పీర్టీయూ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో డిప్యూటీ డీఈవోలకు పదోన్నతి కల్పించి డీఈవోలుగా నియమించాలన్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో కొనసాగేలా చూడాలన్నారు. తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిలను దసరా, దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయలని, ఉపాధ్యాయుల జీపీఏకు సంబంధించి 100 కోట్ల వడ్డీని వెంటనే విడుదల చేయలన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా, రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
సమాన పనికి.. సమాన హోదా, వేతనం
విద్యారణ్యపురి : పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ సమాన పనికి సమాన వేతనం, హోదా ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరా ట కమిటీ నేతలు డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్, టీఎస్‌యూటీఎఫ్, డీటీఎఫ్, పీటీఈ, టీఎస్పీటీఏ, టీజీ పీఈటీఏ, డీజీటీయూ, బీటీఈ, టీయూటీఏల ఆధ్వర్యాన ఉపాధ్యాయ సంఘా ల పోరాట కమిటీగా హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపక జ్వాల సంపాదకుడు ఎం.గంగాధర్ మాట్లాడుతూ 1983 సంవత్సరంలో కల్పించిన అప్‌గ్రెడేషన్‌ను 2005లో రద్దు చేశారన్నారు. ఈ మేరకు పోస్టుల అప్‌గ్రేడ్ సాధన కోసం ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులతో పాటు అన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఉండాలని నిబంధనలు చెబుతున్నా భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులనే కొనసాగిస్తూ వారికి పదోన్నతులు ఇవ్వకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కా ర్యదర్శి ఎస్.సదానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మద్దతుతో విస్తృతంగా ఆందోళనలు చేపడితేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెలంగాణ వ్యాయామ ఉపా«ధ్యాయ సంఘం(టీజీపీఈటీఏ) అధ్యక్షులు ఎం.శ్రీరాంరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అనుసరించటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా చొరవచూపి పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ రమేష్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.రాంచందర్, టి.సుదర్శనం, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సోమశేఖర్, బి.వెంకటరెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.అశోక్‌తో పాటు రమేష్, ఎం.ఏ.బాసిత్, బి.సుధాకర్, ఎం.సదాశివరెడ్డి, కె.సునంద, పర్వీన్, బైరి స్వామి, టి.లింగారెడ్డి, జి.నటరాజ్, సీహెచ్.రవీందర్‌రాజు, పెండెం రాజు పాల్గొన్నారు. -
పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి
రాంనగర్: భాషా పండిట్, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేయాలని టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్ నాయకులు సీహె చ్. రాములు, పి. గోపాల్‌రెడ్డి, ఎం. సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడ్ విషయంలో నిర్లక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, రవికుమార్, విద్యాసాగర్‌రెడ్డి, సుందరయ్య, వెంకులు, వెంకటేశ్వర్లు, రామనర్సయ్య, దశరథరామారావు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
భద్రాచలంలో పురోహితుల ఆందోళన
ఖమ్మం : ఖమ్మం జిల్లా భద్రాచలం పుష్కర ఘాట్ వద్ద పురోహితులు గురువారం ఆందోళనకు దిగారు. ఘాట్ల వద్ద తమను పోలీసులు పిండప్రదానం చేయనీయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుమారు రెండు గంటల నుంచి పిండ ప్రదానం కార్యక్రమం ఆగిపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా భద్రతా కారణాల వల్ల పురోహితులు.. వేరేప్రాంతంలో పిండప్రదానం చేయాలని పోలీసులు సూచించటంతో ...వివాదం నెలకొంది. దాంతో తమను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పురోహితులు ...పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద నిరసనకు దిగారు. తమకు ప్రత్యేకంగా ఏదైనా ప్రాంతం చూపిస్తే, అక్కడకు వెళ్లడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఇప్పటికిప్పుడు తమను అడ్డుకోవటం సరికాదన్నారు. దీంతో పోలీసులకు, పురోహితులకు మధ్య సమన్వయం కొరవడటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ సునీతా మోహన్ ...పురోహితులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకూ ఈ వ్యహారంపై జోక్యం చేసుకోలేదు.