సర్వీస్‌రూల్స్ సాధిస్తాం
-
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి
నిజామాబాద్‌అర్బన్:
సర్వీస్ రూల్స్ లేకపోవడంతో ఉపాధ్యాయులు పదోన్నతులు కోల్పోతున్నారని, త్వరలో వాటిని సాధిస్తామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరోత్తంరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశం హాలులో ఆదివారం నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, త్వరలో హెల్త్‌కార్డులు అందేలా చూస్తామన్నారు. దీని కోసం ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలు మాత్రమే పాటిస్తామన్నారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, కమలాకర్‌రావులు జిల్లాలో ఎస్‌ఎంస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మాణం చేశారు. మోడల్, కేజీబీవీ టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పడి సంఘం రెండుగా విడిపోయినప్పటికీ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు, మండలాల బాధ్యులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి..
సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆల్‌ఇండియా టీచర్స్ అసోసియేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్ విధానం అప్రజాస్వామికమని, దాన్ని రద్దు చేయాలని దశల వారీగా పోరాటాలు చేస్తామన్నారు. పీర్టీయూ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో డిప్యూటీ డీఈవోలకు పదోన్నతి కల్పించి డీఈవోలుగా నియమించాలన్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో కొనసాగేలా చూడాలన్నారు. తొమ్మిది నెలల పీఆర్‌సీ బకాయిలను దసరా, దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయలని, ఉపాధ్యాయుల జీపీఏకు సంబంధించి 100 కోట్ల వడ్డీని వెంటనే విడుదల చేయలన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా, రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.