లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణం చిన్న స్టాక్‌లకు వరంగా మారింది. ఆలయ నిర్మాణంతో సంబంధం ఉన్న కంపెనీల షేర్లు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. అయోధ్య సమీపంలో లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసిన ప్రవేగ్ లిమిటెడ్, సీసీటీవీ నిఘా నెట్‌వర్క్ కోసం కాంట్రాక్ట్ పొందిన అలైడ్ డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ రెండు స్టాక్స్ గత నెలలో 55% కంటే ఎక్కువ పెరిగాయి. కామత్ హోటల్స్ ఇండియా లిమిటెడ్ కూడా దాదాపు 35% లాభపడింది.
అయోధ్య ప్రారంభోత్సవానికి ముందే అక్కడ భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ప్రవేగ్ లిమిటెడ్ తెలిపింది. స్థలం కోసం ఇప్పటికే అక్కడ ట్రావెల్ ఏజెంట్లు పోటీ పడుతున్నారని పేర్కొంది. అయోధ్యలో సీసీటీవీ ఒప్పందంతోనే అలైడ్ డిజిటల్ వెలుగులోకి వచ్చిందని బ్రోకరేజ్ బొనాంజా పోర్ట్‌ఫోలియో లిమిటెడ్ విశ్లేషకుడు వైభవ్ విద్వానీ తెలిపారు.
అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ పుణ్యక్షేత్రంతో పర్యాటకం అభివృద్ధి కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కొత్త విమానాశ్రయం, రైలు స్టేషన్ గత నెలలో ప్రారంభమైంది. హోటళ్ళు, రిటైలర్లు, బ్యాంకింగ్ సెక్టార్ కూడా విస్తరించడానికి పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
ఆలయం చుట్టూ మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంతో వేల సంఖ్యలో భక్తులు రానున్నారు. మౌలిక సదుపాయాల కల్పన ఎంతో ప్రాముఖ్యతగా మారనుంది. అయెధ్యలో స్థిరమైన వృద్ధి జరుగుతుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీలో పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ డైరెక్టర్ సుకుమార్ రాజా తెలిపారు. రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ ప్రధాన ప్రయాణ, వ్యాపార కార్యకలాపాల కేంద్రంగా అయోధ్య ఉద్భవించగలదని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Ayodhya Ram mandir: అయోధ్య భక్తజన సంద్రం
Comments
Please login to add a commentAdd a comment