ఢిల్లీ: అయోధ్య రామ మందిర వేడుకకు ఆఫ్ డే సెలవు ప్రకటనపై ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వెనక్కి తగ్గింది. మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని రేపు మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్ క్రిటికల్ సర్వీస్‌లను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఈరోజు వెనక్కి తీసుకుంది. నాన్-క్రిటికల్ సర్వీస్‌లలోని సిబ్బందికి రేపు సగం రోజు విరామం ప్రకటించడంపై నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే.
ఎయిమ్స్-ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్ రేపు ఆఫ్ డే సలవు అని పేర్కొంటూ మెమోరాండం జారీ చేశారు. రేపు ప్రభుత్వ సిబ్బందికి హాఫ్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. "22.01.2024న 14.30 గంటల వరకు ఎయిమ్స్ హాఫ్ డే సెలవు ఉంటుందని ఉద్యోగులందరి సమాచారం" అని మెమోరాండం పేర్కొంది. అయినప్పటికీ, "అన్ని క్రిటికల్ క్లినికల్ సేవలు" నడుస్తాయని పేర్కొన్నారు.
ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) సేవలు అందుబాటులో ఉంటాయో లేదో అధికారిక నోట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ఇలాంటి రోజుల్లో అవుట్‌డోర్ పేషెంట్లు వైద్యులను సంప్రదించలేమని భయపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రోగులు నెలల తరబడి వేచి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీడీ సేవలు నిలిపివేస్తే రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని మండిపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుంది.
ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..!
Comments
Please login to add a commentAdd a comment