foundations
-
పునాదుల్లేని ఊరు.. ఎక్కడ ఉందో తెలుసా?
దేవనకొండ(కర్నూలు జిల్లా): పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించడం సాధ్యమేనా? అవి నిలబడతాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు కరిడికొండ గ్రామస్తులు. ఈ ఊరిలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. దశాబ్దాలుగా అవి చెక్కుచెదరకుండా ఉన్నాయి. గ్రామ సమీపంలోని బొమ్మదేవత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో ఏనుగుల సంచారం ఉన్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం.. చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు మండల కేంద్రమైన దేవనకొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో కరిడికొండ గ్రామం ఉంది. కొండల మధ్య చదును ప్రాంతంలో 1952 వరకు పాత ఊరు ఉండేది. ప్రజలు పూరి గుడిసెలు వేసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కొండల మధ్య కుంట ప్రాంతంలో ఊరు ఉండడంతో కన్నపుకుంటగా పిలిచేవారు. అయితే కుంటలో నీరు తాగేందుకు ఏనుగులు వచ్చేవి. దీంతో కాలక్రమేణా ఈ ఊరికి ‘కరి’డికొండ అనే పేరొచ్చిందని పెద్దలు పేర్కొంటున్నారు. గ్రామంలో ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలు ఉండేవి. చిన్నరాళ్లపై నిలబడిన పెద్దరాయిని గ్రామస్తులు బొమ్మ దేవతగా కొలుస్తున్నారు. ప్లేగు వ్యాధి రావడంతో పాత ఊరంతా ఖాళీ చేసి కొందరు పక్క గ్రామాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన తిమ్మప్ప, రామప్ప అనే కుటుంబాలకు చెందిన వారు కొండపైకి వెళ్లి పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. వారిని చూసి మిగతా వారు కూడా అక్కడే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొండలో బండలను తొలుస్తూ, రాళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. బొమ్మదేవత ఊరిని కాపాడుకుంటూ వస్తోందని గ్రామస్తుల నమ్మకం. శ్రావణమాసంలో ఆ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కనిపించని పూరి గుడిసె గ్రామంలో ప్రస్తుతం 2,450 మంది నివసిస్తున్నారు. 1,619 ఎకరాల్లో ఉల్లి, పత్తి, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. పచ్చని పైర్లతో, చుట్టుతా చిన్న చిన్న కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పునాదులు లేకుండా ఇల్లు నిర్మించుకోవడంతో రూ.3 లక్షల వరకు ఆదా అవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎక్కడా పూరిగుడిసె లేదు. కొండపై తిమ్మప్పస్వామి దేవాలయం ఉంది. గ్రామ సమీపంలోని కొండల నుంచి రాళ్ల తొలచి, ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు. గ్రామంలో గతంలో 80 గృహాలు ఉండగా..ప్రస్తుతం వాటి సంఖ్య 210కి చేరుకుంది. ఎలాంటి ఇబ్బందులూ లేవు కరిడికొండలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. కొండ ప్రాంతం కావడంతో ఇళ్లు కూలే అవకాశమే లేదు. నేరుగా నిర్మాణాలను చేపట్టవచ్చు. – అవినిధ్, హౌసింగ్ ఏఈ ఇల్లు కట్టుకోవడం చాలా సులభం కొన్నేళ్ల నుంచి మేం ఇక్కడే నివాసం ఉంటున్నాం. పునాది తీయకుండా ఇల్లు కట్టుకున్నాం. గ్రామంలో డ్రెయినేజీ సమస్య లేదు. మా ఊళ్లో ఇల్లు కట్టుకోవాలంటే చాలా సులభంగా. పక్కనే రాళ్లు కూడా దొరుకుతాయి. – పీరా, కరిడికొండ గ్రామస్తుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం సీసీ రోడ్లు నిర్మించింది. గ్రామస్తులు సమీప కొండల్లో కారి్మకులుగా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నారు. మా గ్రామం ఎత్తైన కొండపై ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవనకొండ మండలంలోని చాలా గ్రామాల్లో గృహ నిర్మాణాలకు కరిడికొండ నుంచే రాళ్లు తరలిస్తున్నాం. – నాగేష్, కరిడికొండ గ్రామస్తుడు -
రేపే రామమందిరానికి పునాది
అయోధ్య: అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యింది. రామమందిరానికి జూన్10వ తేదీన పునాదులు వేస్తున్నట్టు గుడి ట్రస్ట్ అధికార ప్రతినిధి ప్రకటించారు. గత నవంబర్‌లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు నేపథ్యంలో అయోధ్యలోని రామజన్మభూమిలో కోర్టు కేటాయించిన స్థలంలోని కుబేర్ మందిరంలో శివుడి ప్రార్థనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. లంకపై దాడికి వెళ్ళేముందు రాముడు అనుసరించిన శివుడి ప్రార్థనల ‘రుద్రాభిషేకం’’తోనే రామమందిర నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నట్టు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ వెల్లడించారు. జూన్ 10న, బుధవారం ఉదయం 8 గంటలకు ట్రస్ట్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్, ఇతర పౌరోహితుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం రామాలయానికి పునాదులు వేయడం ప్రారంభం అవుతుంది. -
ఆపన్నహస్తం అందిస్తున్న అభయం పౌండేషన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో దాని కట్టడి కోసం భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో రోజు వారీ కూలీలు, వలస కూలీలు, పేదలకు ఆహారం లభించక, నిత్యవసరాలు అందుబాటులో లేక పూటగడవని పరిస్థితి ఏర్పడింది. అయితే వారికి సాయంగా అనేక మంది వారి ఆపన్న హస్తాలను అందిస్తున్నారు. అనేక స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్టులు అన్నదానం, నిత్యవసరసరుకులు అందిస్తూ సాయాన్ని చేస్తున్నాయి. ఈ సేవ కార్యక్రమంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్న 30 వృధాశ్రమాలు మరియు అనాదాశ్రమాల్లో 21 రోజులు సరిపడా నిత్యావసరాలు పంపిణీని 'లిటిల్ హ్యాండ్స్ ట్రస్ట్', 'అభయం ఫౌండేషన్' సభ్యులు అందించారు. అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న పోలీసులుకు, ప్రభుత్వ అధికారులుకు, సానిటరీ కార్మికులకు, నిత్యవసర సామాగ్రి అందించే వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు మాస్క్‌లు అందించారు. దాదాపు 5500 మాస్క్‌లను పశ్చిమగోదావరి, కృష్ణా, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో అందించారు. వీటితో పాటు హైదరాబాద్ లో 150 రోజు కూలి కుటుంబాలకు 10 రోజులకు సరిపడా నిత్యావసరాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అభయం పౌండేషన్ ద్వారా మీరు కూడా సాయం అందించాలనుకుంటే 6303251670 నంబర్‌కి కాల్ చేయండి https://www.facebook.com/groups/Abhayam.Group/?ref=bookmarks https://m.facebook.com/story.php?story_fbid=1279274842278130&id=411726419032981 -
ప్రభుత్వ పునాదులు కదలాలి
5న ధర్నాకు వైఎస్ఆర్ సీపీ పిలుపు అనంతపురం అర్బన్ : మోస పూరిత హామీలతో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబునాయుడుని ప్రజలు విశ్వసించడం లేదని, ప్రభుత్వం పునాదులు కదిలేలా డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద తలపెట్టినా మహాధర్నాను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ సీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ మాట్లాడుతూ... అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ప్రజా సంక్షేమానికి చంద్రబాబు నాయుడు తిలోదకాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురి చేశారని అన్నారు. మహాధర్నాకు పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చేలా క్షేత్ర స్థాయిలో ముమ్మర ప్రచారం చేయాలని సూచించారు. డిసెంబర్ 1న ప్రతి మండల కేంద్రంలోనూ సమీక్ష సమావేశాలు నిర్వహించి మహాధర్నాపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. బైక్ ర్యాలీలు విృస్తతంగా చేపట్టలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీడీపీ ప్రభుత్వం మెడలు వంచాల్సిన తరుణమిదేనని ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. జిల్లాలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఇలాంటి తరుణంలో రుణమాఫీ అందకపోవడంతో మరింత అప్పుల ఊబిలో అన్నదాతలు కూరుకుపోయారని అన్నారు. వేధింపులు తాళలేక జిల్లా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాక ముందు టీడీపీ ఇచ్చిన మోసపూరిత హామీలపై క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు బి.గురునాథరెడ్డి అన్నారు. జిల్లాలో ఇప్పటికే 50 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. మహాధర్నా అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సూచించారు. ఈ ప్రభుత్వానికి రైతాంగంపై కనికరం లేదని మండిపడ్డారు. బాబు ఇచ్చిన హామీల వల్ల జిల్లాలో 75 శాతం డ్వాక్రా మహిళలు డిఫాల్టర్లుగా ముద్రించబడ్డారని తెలిపారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మహా ధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి, నియోకవర్గాల సమన్వయ కర్తలు నవీన్ నిశ్చల్, కె.సోమశేఖరరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ృష్ణవేణి, ట్రేడ్ యూనియన్ జిల్లా అబ్జర్వర్ కె.హుసేన్‌పీరా, మైనారిటీ సెల్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కెప్టన్ షెక్షా, మైనారిటీ నాయకులు నదీమ్ అహమ్మద్, గౌస్‌బేగ్, బోరంపల్లి ఆంజనేయులు, సీపీ వీరన్న, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, మరుట్ల మారుతినాయుడు, బండి పరుశురాం, చింతా సోమశేఖర్‌రెడ్డి, మారుతిప్రసాద్, ప్రకాష్‌రెడ్డి, పీరా, కసునూరు రఘునాథరెడ్డి, చింతకుంట మధు కనేకల్లు రామలింగారెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.