న్యూఢిల్లీ: వివాదాస్పద రామ మందిర నిర్మాణంపై చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించాలని నిర్మోహి అఖాదా, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ధ్రువీకరిస్తూ, తాను కూడా ఇదే విషయమై అక్టోబర్ 20–15 మధ్య రవిశంకర్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌లో చేపట్టనుంది. చర్చలకు మధ్యవర్తిగా రవిశంకర్‌నే ఎంచుకోవడం ఎందుకని ప్రశ్నించగా...ఆయన జీవన విధానం, అన్ని మతాల పట్ల ఆయన అనుసరిస్తున్న ప్రేమపూరిత వైఖరే కారణమని స్వామి బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment