
ఆర్డినెన్స్ బైపాస్ కాదు: జైట్లీ
ఆర్డినెన్స్ అనేవి పార్లమెంటుకు బైపాస్లాంటివి కాదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వీటి విషయంలో తాము ఏ తప్పు చేయడం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో భూసేకరణ అంశంతోపాటు పలు ఆర్డినెన్స్పై చర్చకు వచ్చాయి.
బీజేపీ బైపాస్ ద్వారా ఆర్డినెన్స్ రూపంలో గట్టెక్కాలని చూస్తోందని విపక్షాలు తీవ్రంగా విమర్శించడంతో జైట్లీ జోక్యం చేసుకున్నారు. "గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా పలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదింపజేసుకున్నాయి. చట్టాలు చేశాయి. తమది బైపాస్ రూట్ అని ఆరోపణలు చేయడం తప్పు'' అని రాజ్యసభలో బదులిచ్చారు. ఆర్డినెన్స్పై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకీ లేదని చెప్పారు.