
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రసంగంలో 26 రాష్ట్రాల ఊసే లేదని, అంత మాత్రాన ఆ రాష్ట్రాలకు కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2024 బడ్జెట్‌పై జరిగిన చర్చకు లోక్‌సభలో మంగళవారం(జులై 30) ఆమె సమాధానమిచ్చారు.
రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని చెప్పారు. గతంలో యూపీఏ పాలనలో రాష్ట్రాలకు కేటాయింపుల లెక్కలు వెల్లడించారు. వరుసగా మూడోసారి ఎన్డీయేకు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలని, ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారన్నారు.