
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌తో పాటు ఆమె ధరించిన చీరపై కూడా అందరి దృష్టి పడింది. ఎందుకంటే 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఈ ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడల్లా ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత చీరలతో దర్శమిస్తున్నారు.
ఈ ఏడాది చేతితో నేసిన ఇక్కత్ సిల్క్ ఎర్ర చీరను ధరించి ఆమె పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఇది భారతీయ సాంప్రదాయ వస్త్రాల పట్ల ఆమెకున్న ప్రేమను వ్యక్తపరుస్తోంది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ 2023 సమావేశానికి నిర్మలా సీతారామన్ చేతితో నేసిన నవలగుండ ఎంబ్రాయిడరీ ఎరుపు రంగు ఇక్కత్ సిల్క్ చీరను ఎంచుకున్నారు.
కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన ఈ చీరను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే నిర్మలమ్మ దగ్గర చీరల కలెక్షన్లు ఎక్కువే! ఆమెకు చేనేత చీరలంటే ఎక్కువ ఇష్టం. అంతేకాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రత్యేక చీరతో దర్శమమిస్తారు. అదే క్రమంలో నలుపును దూరం పెడుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment