మహిళా భద్రతకోసం హిమ్మత్ యాప్ | President Pranab speech | Sakshi
Sakshi News home page

మహిళా భద్రతకోసం హిమ్మత్ యాప్

Published Mon, Feb 23 2015 11:23 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

President Pranab speech

న్యూఢిల్లీ :  ప్రతి భారతీయ పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందిస్తామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్...ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రణబ్ ప్రసంగపాఠంలో కొన్ని ముఖ్యాంశాలు
*ప్రతీ పౌరుడికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి.
*జనధన్ యోజనతో11  వేల కోట్లు  జమయ్యాయి.
*ఉపాధికల్పన, ఉత్పత్తి పెంపు మా  ప్రభుత్వ లక్ష్యం.
*పారిశుద్ధ్యం నుండి స్మార్ట్ సిటీల వరకు ప్రాధాన్యం  
*సబ్ కా  సాథ్ , సబ్ కా వికాస్  మా లక్ష్యం
*2022 నాటికి అందరికీ  గృహ వసతి
*ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతాలు
*సమీకృత అభివృద్దికి కృషి..ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యత
*దేశవ్యాప్తంగా దేశంలోని ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం..
*టీమిండియా స్పూర్తితో ముందు  సాగుదాం.
*ఆడపిల్లల,విద్య...రక్షణకోసం బేటీ బచావో.. బేటీ పఢావో పథకం ద్వారాకృషి .
*టెక్నాలజీని వాడుకొని బ్లాక్ మనీ నిరోధానికి కృషి. చేస్తాం.
*భూసేకరణలో పారదర్శకతను పాటిస్తాం. రైతులకు పెద్ద పీట వేస్తామంటూ  అన్నదాత సుఖీభవ కు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది.

*మాగ్జిమమ్ గవర్నన్స్, మినిమిం  గవర్నమెంట్..
*సకాలంలో ఉపకార వేతనాలు అందేలా చూస్తాం.
*గిరిజన అభివృద్ధి వనబందు  కళ్యాణ్ యోజన్  పథకం
*మంచివైద్యంకోసం  మిషన్ ఇంద్రధనుష్
*ఈశాన్యరాష్ట్రాల  విద్యాభివృద్ధికి పాటుపడతాం.
*ప్రధానమంత్రి నీటి పారుదల పథకం మొదలుపెడతాం
*పాలనా పరమైన నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాం.
*మహిళా సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
*న్యాయ సంస్కరణలకు పెద్ద పీట వేస్తాం.
*పన్నుల విధానాన్ని సరళీకరణ చేస్తాం.
*మారుమూల ప్రాంతాల్లోను  మౌలిక వసతులు  కల్పిస్తాం.
*కరెంటు లోటుపైనా  ప్రత్యేక దృష్టి పెడతాం.
*పోర్టుల ద్వారా  రవాణాను పెంచుతాం.
*ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు చర్యలు చేపడతాం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement