prajab
-
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయం
న్యూఢిల్లీ: బడుగు, బలహీన వర్గాలకు, రైతులకు, మహిళలకు ప్రభుత్వం పాముఖ్యతనిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. వారి రక్షణకు, భద్రతకోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. సోమవారం ఆరంభమైన బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. 2022 కల్లా దేశంలో అందరికీ గృహవసతి కల్పిస్తామని రాష్ట్రపతి చెప్పారు. బాలికల విద్య, రక్షణ కోసం బేటీ బచావో.. బేటీ పఢావో, ఢిల్లీలో మహిళల రక్షణ కోసం హిమ్మత్ యాప్ ను ప్రకటించారు. 7.7 వృద్ధి రేటుతో భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో తగ్గిందన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. భారత అంతర్గత రక్షణకు పెనుసవాలుగా మారిన తీవ్రవాదాన్ని ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కొంటుందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఇంకా రాష్ట్రపతి ఏం మాట్లాడారంటే.. కశ్మీర్ లో నిర్వాసితులైన 60 వేల కశ్మీరీ పండిట్ల పునరావాసానికి కట్టుబడి ఉన్నాం, వారికనుకూలమైన వాతావరణాన్నికల్పించాడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆగష్టు 15కల్లా దేశంలోని ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం, విద్యుత్ సరఫరా , నదుల అనుసంధానం, బొగ్గు వేలం కేంద్రాల ఏర్పాటు తదితర కార్యక్రమాలుంటాయి. భారతదేశానికి పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగు పడుతున్నాయి. చైనా, రష్యా, అమెరికా దేశాలతో మన సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. పరమ పవిత్రమైన ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ఒక గర్భగుడి లాంటిది. దేశంలోని ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, తమ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుకోడానికి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. -
మహిళా భద్రతకోసం హిమ్మత్ యాప్
న్యూఢిల్లీ : ప్రతి భారతీయ పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందిస్తామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్...ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రణబ్ ప్రసంగపాఠంలో కొన్ని ముఖ్యాంశాలు *ప్రతీ పౌరుడికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి. *జనధన్ యోజనతో11 వేల కోట్లు జమయ్యాయి. *ఉపాధికల్పన, ఉత్పత్తి పెంపు మా ప్రభుత్వ లక్ష్యం. *పారిశుద్ధ్యం నుండి స్మార్ట్ సిటీల వరకు ప్రాధాన్యం *సబ్ కా సాథ్ , సబ్ కా వికాస్ మా లక్ష్యం *2022 నాటికి అందరికీ గృహ వసతి *ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతాలు *సమీకృత అభివృద్దికి కృషి..ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యత *దేశవ్యాప్తంగా దేశంలోని ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం.. *టీమిండియా స్పూర్తితో ముందు సాగుదాం. *ఆడపిల్లల,విద్య...రక్షణకోసం బేటీ బచావో.. బేటీ పఢావో పథకం ద్వారాకృషి . *టెక్నాలజీని వాడుకొని బ్లాక్ మనీ నిరోధానికి కృషి. చేస్తాం. *భూసేకరణలో పారదర్శకతను పాటిస్తాం. రైతులకు పెద్ద పీట వేస్తామంటూ అన్నదాత సుఖీభవ కు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. *మాగ్జిమమ్ గవర్నన్స్, మినిమిం గవర్నమెంట్.. *సకాలంలో ఉపకార వేతనాలు అందేలా చూస్తాం. *గిరిజన అభివృద్ధి వనబందు కళ్యాణ్ యోజన్ పథకం *మంచివైద్యంకోసం మిషన్ ఇంద్రధనుష్ *ఈశాన్యరాష్ట్రాల విద్యాభివృద్ధికి పాటుపడతాం. *ప్రధానమంత్రి నీటి పారుదల పథకం మొదలుపెడతాం *పాలనా పరమైన నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాం. *మహిళా సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది *న్యాయ సంస్కరణలకు పెద్ద పీట వేస్తాం. *పన్నుల విధానాన్ని సరళీకరణ చేస్తాం. *మారుమూల ప్రాంతాల్లోను మౌలిక వసతులు కల్పిస్తాం. *కరెంటు లోటుపైనా ప్రత్యేక దృష్టి పెడతాం. *పోర్టుల ద్వారా రవాణాను పెంచుతాం. *ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు చర్యలు చేపడతాం. -
ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగంలో ఆయన 'శ్యామ ప్రసాద్ ముఖర్జీ' వ్యాఖ్యలను కోట్ చేశారు. అంతకు ముందు రాష్ట్రపతిని పార్లమెంట్‌కు... ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తదితరులు స్వయంగా తోడ్కని వచ్చారు.