న్యూఢిల్లీ: బ్యాంక్‌ల విలీనంపై కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పది ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్రిల్ 1,2020 నుంచి నాలుగు మెగా బ్యాంక్‌లు తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాల నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
బ్యాంక్‌ల విలీనానికి సంబంధించి చట్టపరమైన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, అంతర్జాతీయ బ్యాంక్‌లతో పోటీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేవలం విలీన నిర్ణయంతోనే బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ట పరచడం సాధ్యం కాదని, ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి
Comments
Please login to add a commentAdd a comment