mega merger
-
హెచ్డీఎఫ్సీ సీఈవో శశిధర్ వార్షిక వేతనం ఎంతో తెలుసా?
HDFC Bank CEO Sashidhar Jagdishan Salary: మెగా మెర్జర్ తరువాత ప్రైవేటు బ్యాంకింగ్దిగ్గజం హెచ్డీఎఫ్సీ ప్రపంచ బ్యాంకింగ్‌లో 7వ ర్యాంక్‌ను సాధించింది. అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మార్కెట్ అంచనాలను మించి తొలి త్రైమాసిక లాభంలో 30 శాతం పెరిగింది. ఈ సందర్బంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీఈవో శశిధర్ జగదీషన్ వార్షిక వేతనం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సీఈవో వార్షిక వేతనంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6.52 కోట్లతో పోలిస్తే, ఎఫ్వై23లో జగదీషన్ మొత్తం ఆదాయం రూ.10.55 కోట్లుగా ఉంది. రెమ్యునరేషన్ ప్యాకేజీలో రూ. 2.82 కోట్ల బేసిక్ జీతం, రూ. 3.31 కోట్ల అలవెన్సులు , పెర్క్విసైట్‌లు ఉండగా, రూ. 3.63 కోట్ల పనితీరు బోనస్ ఉన్నాయి.2021-2022కి, జగదీషన్‌కు మొత్తం రూ. 5.16 కోట్ల నగదు వేరియబుల్ పేను ఆర్బిఐ ఆమోదించింది, అందులో అతను రూ. 2.58 కోట్లు అందుకున్నారు. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో) 2020-2021లో క్యాష్ వేరియబుల్ పేలో భాగంగా రూ. 1.05 కోట్లు అందుకున్నారు. అదే సమయంలో, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కైజాద్ భారుచా మార్చి 31, 2023తో ముగిసే సంవత్సరానికి రూ. 10.03 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. ఇది మునుపటి వార్షిక వేతనం రూ. 10.64 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. (Infosys Q1 Results: అంచనాలు మిస్, రెవెన్యూ గైడెన్స్ కోత) హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పుడు సాంకేతిక పరివర్తన సాధనలో ఉందని, భవిష్యత్తులో బ్యాంకును నిర్మించడంతోపాటు, సమర్ధవంతంగా నడపడంపై దృష్టి సారిస్తుందని షేర్హోల్డర్లను ఉద్దేశించి జగదీషన్ పేర్కొన్నారు. 2022-23లో, బ్యాంక్ రికార్డు స్థాయిలో 1,479 శాఖలను జోడించిందని, వీటిలో ఎక్కువ భాగం సెమీ అర్బన్, రూరల్ (ఎస్యుఆర్యు) లో ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం మరో 675ని జోడించాలని యోచిస్తోందని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 5,000కి చేరుకుంటుందని వెల్లడించారు. మొత్తం మీద, ఏడాదిలో 1,500 నుండి 2,000 అదనపు శాఖలను జోడించాలని బ్యాంక్ యోచిస్తోందని శశిధర్ చెప్పారు. కాగా ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1లో నికర లాభం 29 శాతం జంప్‌చేసి రూ. 12,370 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. అలాగే మెగా విలీనం తరువాత బ్యాంకు షేర్లు బాగా లాభపడింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. అలాగే డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్‌మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసి ఏడో స్థానాన్ని ఆక్రమించింది. -
మెటల్ దిగ్గజంగా టాటా స్టీల్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్ భారీ విలీనానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్‌లోని 7 మెటల్ అనుబంధ కంపెనీలను విలీనం చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది. ఇందుకు వీలుగా గతంలో ప్రతిపాదించిన టాటా మెటాలిక్స్, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ విలీనాన్ని విరమించుకుంది. వెరసి తాజాగా ఈ రెండు సంస్థలతోపాటు.. టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టీఆర్ఎఫ్ లిమిటెడ్, ఇండియన్ స్టీల్ – వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ను విలీనం చేసుకోనున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ఈ విలీనంతో సామర్థ్యాల పెంపు, వ్యయాల తగ్గింపునకు బాటలు వేసుకోనుంది. ఇందుకు షేర్ల మార్పిడి(స్వాప్) విధానాన్ని అవలంబించనుంది. ఈ ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. విలీనమిలా.. గ్రూప్‌లోని మెటల్ కంపెనీల విలీనానికి టాటా స్టీల్ షేర్ల మార్పిడి నిష్పత్తులను ప్రకటించింది. వీటి ప్రకారం ఆయా కంపెనీల వాటాదారుల వద్దగల ప్రతీ 10 షేర్లకుగాను టాటా స్టీల్ షేర్లను ఇలా కేటాయించనుంది. టీఆర్ఎఫ్ వాటాదారులకు 17, టీఎస్‌పీఎల్‌కు 67, టిన్ప్లేట్కు 33, టాటా మెటాలిక్స్కు 79 చొప్పున షేర్లను జారీ చేయనుంది. ఇండియన్ స్టీల్ – వైర్ ప్రొడక్ట్స్‌లో టాటా స్టీల్‌కు 95 శాతం వాటా ఉంది. టాటా స్టీల్ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్ పూర్తి అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. మిగిలిన మూడు కంపెనీలలో 75–60 శాతం మధ్య వాటాలను కలిగి ఉండగా.. టీఆర్ఎఫ్లో వాటా 34.11 శాతం మాత్రమే. అవకాశాలపై దృష్టి అనుబంధ సంస్థల శక్తిసామర్థ్యాలను ఏకీకృతం చేయడం ద్వారా వాటాదారుల విలువ పెంపునకు అవకాశాలను సృష్టించుకోనున్నట్లు విలీనంపై టాటా స్టీల్ స్పందించింది. కంపెనీలన్నిటి మధ్య సమన్వయం ద్వారా ఒక సంస్థ సౌకర్యాలను మరొక కంపెనీ వినియోగించుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది మరింత సమర్థవంత వినియోగానికి దారి చూపుతుందని వివరించింది. అంతేకాకుండా మార్కెటింగ్, పంపిణీ నెట్వర్క్ సైతం పరస్పరం సహకరించుకోనున్నట్లు తెలియజేసింది. కాగా.. చంద్రశేఖరన్ అధ్యక్షతన గ్రూప్‌లోని కంపెనీలు బిజినెస్‌లను ఒక్కటిగా చేయడం ద్వారా పరస్పర లబ్దిని పొందనున్నట్లు ఈ ఏడాది మొదట్లోనే టాటా గ్రూప్ పేర్కొంది. ఈ బాటలో టాటా కన్జూమర్, టాటా కాఫీ విలీనాన్ని ప్రకటించింది. ఇదే విధంగా 2024కల్లా ఎయిరేషియా, విస్తారాలను ఎయిరిండియా బ్రాండుకిందకు తీసుకురానున్నట్లు తెలియజేసింది. 2019 నుంచి టాటా స్టీల్ వివిధ రకాలుగా 116 సహచర కంపెనీల సంఖ్యను తగ్గించుకోవడం గమనార్హం. -
మార్చి 27న బ్యాంకుల సమ్మె
చెన్నై: బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు సంఘాలు మరోసారి సమ్మె చేపట్టనున్నాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మెగా బ్యాంక్ విలీనాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ రంగంలోని రెండు ప్రధాన యూనియన్లు (ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్) మార్చి 27 న సమ్మెకు దిగనున్నాయి. బ్యాడ్ లోన్ల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటచలం అన్నారు. చెడు రుణాల మొత్తం రూ. 216,000 కోట్లుగా వుండటంతో, 2019 మార్చి 31 తో ముగిసిన సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ .150,000 కోట్ల స్థూల లాభాలకు పరిమితమైనాయని తెలిపారు. దీంతో రూ .66,000 కోట్ల నికర నష్టం వాటిల్లిందని విమర్శించారు. తాజా బ్యాంకుల విలీనం వల్ల భారీ ఎత్తున పేరుకు పోయిన కార్పొరేట్ బ్యాడ్ లోన్లు తిరిగి వస్తాయని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు. దీనికి ఉదాహరణగా ఎస్బీఐ విలీనం విలీనం తరువాత ఈ బెడదమరింత పెరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు. కేవలం 323 మిలియన్ల జనాభా ఉన్న అమెరికాలో బ్యాంకుల సంఖ్య భారతదేశంలోని బ్యాంకుల కంటే ఎక్కువ ఉందని, అలాంటిది 1.35 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో మరిన్ని బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఏకీకరణ అవసరం లేదని వెంకటాచలం అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల విలీనంపై కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పది ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్రిల్ 1,2020 నుంచి నాలుగు మెగా బ్యాంక్‌లు తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాల నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంక్‌ల విలీనానికి సంబంధించి చట్టపరమైన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, అంతర్జాతీయ బ్యాంక్‌లతో పోటీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేవలం విలీన నిర్ణయంతోనే బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ట పరచడం సాధ్యం కాదని, ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి -
మరోసారి మోగనున్న బ్యాంకుల సమ్మె సైరన్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనంతో సహా పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతో బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపు నిచ్చాయి. అక్టోబర్ 22, మంగళవారం నిర్వహించనున్న ఈ సమ్మె కారణంగా తమ బ్యాంకింగ్‌కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. అక్టోబర్ 22న ట్రేడ్ యూనియన్ సంస్థలు ప్రతిపాదించిన సమ్మె కారణంగా బ్యాంక్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే హెచ్చరించింది. తమ శాఖల పనితీరు ప్రభావితం కావచ్చు లేదా స్తంభించిపోవచ్చు అని ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కార్యకలాపాలు సజావుగా పనిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ హామీ ఇచ్చింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) సంయుక్తంగా అక్టోబర్ 22 న అఖిల భారత బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) మద్దతు లభించిందని అసోసియేషన్ ప్రకటించింది. ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా ఏర్పరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంక్ విలీనాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమని విమర్శిస్తున్నాయి. గత నెలలో కూడా నాలుగు బ్యాంక్ యూనియన్లు, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీవోఏ)ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్బీవోసీ) నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్వోబీవో) , ఇలాంటి సమస్యలపై సమ్మెకు పిలుపునిచ్చారు. తరువాత, కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తమ డిమాండ్లను పరిశీలిస్తామని యూనియన్లకు హామీ ఇవ్వడంతో సెప్టెంబర్ 26-27 నిర్వహిచ తలపెట్టిన 48 గంటల సమ్మె వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
మెగా మెర్జర్ : ప్రభుత్వ బ్యాంకుల షేర్లు భారీ పతనం
సాక్షి, ముంబై : దలాల్ స్ట్రీట్‌మంగళవారం భారీ నష్టాలనుమూట గట్టుకుంది. ముఖ్యంగా జీడీపీ 5 శాతం ఆరేళ్ల కనిష్టానికి చేరడంతో పాటు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీనం భారీగా దెబ్బ తీసింది. శని, ఆది, సోమ (వినాయక చవితి) సెలవుల అనంతరం మంగళవారం ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లలో బ్యాంకుల షేర్లలో ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీ పతనానికి దారి తీసాయి. జీడీపీ ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి నీరసించడం, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడం వంటి ప్రతికూల అంశాలు మార్కెట్లను కుప్పకూల్చగా, బ్యాంకింగ్ షేర్లను బాగా ప్రభావితం చేసాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్, ఓరియంటల్ బ్యాంకు, కెనరా బ్యాంకు 5 నుంచి 12 శాతం కుప్పకూలాయి. పీఎన్బీ9 శాతం, ఇండియన్ బ్యాంకు 8 శాతం, కెనరా బ్యాంకు 8 శాతం నష్టపోయాయి. 10 ప్రభుత్వ బ్యాంకుల ఏకీకరణ ద్వారా నాలుగు బలమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏర్పాటు ప్రకటన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. విలీన నిష్పత్తిపై స్పష్టత లేకపోవడం ఇన్వెస్టర్ల అమ్మకాలకు దారి తీసిందని నిపుణులు తెలిపారు. ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, 12.5 శాతం కుప్పకూలింది. కెనరా బ్యాంక్ 11 శాతం నష్టపోయి 52 వారాల కనిష్టాన్నితాకింది. యూనియన్ బ్యాంక్ కూడా 9 శాతం కుప్పకూలి 52 వారాల కనిష్టానికి చేరింది. అలాగే ఓరియంటల్ బ్యాంకు 7 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 9 శాతం పతనమైంది. నిఫ్టీ బ్యాంకు 600 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 120 పాయింట్లు (5 శాతం) కుప్పకూలింది. విలీనంలో కీలకమైన నిష్పత్తి ప్రకటించకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలత కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ఎనలిస్ట్ వికాస్ జైన్ వ్యాఖ్యానించారు. జియోజిత్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ మాట్లాడుతూ, ఈ చర్య దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉన్నప్పటికీ, స్వల్ప కాలిక ఒడిదుడుకులు తప్పవని పేర్కొన్నారు. విలీన ప్రక్రియ పూర్తయ్యి, తిరిగి సాధారణ పరిస్థతి రావడానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుందన్నారు. మరోవైపు కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్)మెరుగుపడేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ తాజాగా రూ.9వేల కోట్లను అందించనుందనే వార్తలతో ఐడీబీఐ బ్యాంకు కౌంటర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఐడీబీఐ బ్యాంక్ షేరు 8.2 శాతం దూసుకెళ్లి చివరికి 6శాతం లాభాలతో ముగిసింది. -
బ్యాంకుల విలీనం; ఖాతాదారుల పరిస్థితేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాలను నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకుల విలీనంతో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలియక ఖాతాదారులు అయోమయంలో ఉన్నారు. బ్యాంకుల విలీనంతో ఖాతాదారులు పెద్దగా నష్టపోయేదేమి ఉండదు. కాకపొతే కొన్ని మార్పులు తప్పవు. అవేంటో గమనించండి. మారేవి... 1. కొత్త చెక్‌బుక్, డెబిట్/క్రెడిట్ కార్డులు ఇస్తారు 2. అకౌంట్ నంబరు, కస్టమర్ ఐడీతో పాటు ఐఎఫ్ఎస్ఈ కోడ్ కూడా మారుతుంది 3. మారిన ఐఎఫ్ఎస్ఈ కోడ్ ఆదాయపన్ను శాఖ, బీమా కంపెనీ వద్ద అప్డేట్ చేసుకోవాలి 4. ఈఎంఐలు, సిప్‌లు చేసేవారు తాజాగా బ్యాంకుల నుంచి ఆమోదపత్రం ఇవాల్సి ఉంటుంది 5. బిల్ పేమెంట్లకు తాజాగా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు 6. మీ బ్యాంకు బ్రాంచ్ మీకు దగ్గరగా లేదా దూరంగా మారొచ్చు 7. బ్యాంకు స్టేషనరీ కూడా మారిపోతుంది 8. సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేట్లు కూడా మారే అవకాశముంది. మారనివి.. 1. ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు యథాతథంగా ఉంటాయి 2. ఫిక్సిడ్ డిపాజిట్లను చివరి వరకు ఉంచితే ప్రస్తుతం వస్తున్న వడ్డీతో తీసుకోవచ్చు 3. రుణాల రేట్లు కూడా మారవు 4. ఎంసీఎల్ఆర్ రుణాలపై గడువు ఆధారంగా వడ్డీ రేట్లు మారతాయి. సంబంధిత వార్తలు బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు భారీగా ప్రభుత్వ బ్యాంకుల విలీనం షాకింగ్ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ -
బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కీలక బ్యాంకింగ్ రంగ సంస్కరణలు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకుల ఏకీకరణను వెల్లడించారు. బ్యాంకుల రీకాపిటలైజేషన్ (నిధులతో ఉద్దీపన) ద్వారా పలు బ్యాంకులు ఇప్పటికే రెపోరేట్ల ఆధారంగా వడ్డీ రేట్లు తగ్గించేందుకు పలు ప్రభుత్వ బ్యాంకుల నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా పేర్కొన్నారు. మొత్తం 10 బ్యాంకులను కలిపి 4 కొత్త అతిపెద్ద బ్యాంకులుగా రూపొందనున్నాయన్నారు. దీంతో మొత్తం పీఎస్‌యూల సంఖ్య 27 నుంచి 12కి తగ్గనుంది. అయితే ఈ విలీనం ప్రభావంతో ఎలాంటి తొలగింపులు వుండవని స్పష్టం చేశారు. నియామకాలు: నియమాక ప్రమాణాలను, పద్ధతులల్లో కూడా సంస్కరణ తీసుకొస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు బ్యాంకుల బోర్డులను బలోపేతం చేస్తామని, అలాగే బోర్డు సైజ్‌ను నిర్ణయించే అధికారం బ్యాంకులకే ఉంటుందని ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రతీ బ్యాంకులో స్పెషల్ రిస్క్ ఆఫసర్లను నియమిస్తామనీ, అయితే వీరికి జీతాలు ప్రభుత్వం చెల్లించదని చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీని వాడకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. బ్యాంకుల విలీనం: పంజాబ్ నేషనల్ బ్యాంకు, (పీఎన్బీ) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ విలీనం ద్వారా 11437 బ్రాంచిలతో రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా విలీన బ్యాంకు అవతరించనుంది. ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు ఇకపై కలిసి ఒకే బ్యాంకుగా కొనసాగనున్నాయి. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకుగా ఈ విలీన బ్యాంకు అవతరించనుంది. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ విలీనం ద్వారా నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అవతరించనుంది. కాగా మీడియా సమావేశానికి ముందే నిర్మలా సీతారామన్ పది ప్రభుత్వ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో మంత్రి భేటీ అయ్యారు ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మెగా మెర్జర్ : మూడు బ్యాంకులు విలీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఎనలిస్టులు అంచనా వేసినట్టుగానే మెగా మెర్జర్‌కు కీలక అడుగు పడింది. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన మేరకు దెనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు విలీనానికి సర్వం సిద్దమైంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ సోమవారం వెల్లడించారు. ఈ మూడు బ్యాంకుల విలీనం అనంతరం దేశంలోని మూడవ అతిపెద్ద బ్యాంక్‌గా విలీన బ్యాంకు అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ కార్యకలాపాల హేతుబద్ధత బాగా పుంజుకుందని చెప్పారు. బ్యాంకుల క్యాపిటల్ అవసరాలపై ప్రభుత్వం శ్రద్ధ వహించడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఈ విలీన ప్రక్రియలో ఈ మూడు బ్యాంకుల ఉద్యోగుల భద్రతను కాపాడతామన్నారు. ఈ సందర్భంగా ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం సందర్భంగా ఎలాంటి ఉద్యోగ నష్టం జరగ లేదని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా విలీన ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఈ మూడు బ్యాంకులు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతరం ఈ విలీన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. ఇప్పటికే బలహీనంగా ఉన్నబ్యాంకులను విలీనం చేయడం కాకుండా , రెండు విజయవంతమైన బ్యాంకుల విలీనం ద్వారా మరో దృఢమైన అతిపెద్ద బ్యాంకును అందుబాటులోకి తేనున్నామని, ఈ విలీన బ్యాంకుకు మూలధన మద్దతును కూడా అందిస్తామని తెలిపారు. దీనిపై ఆయా బ్యాంకుల బోర్డుల తుది ఆమోదం తర్వాత విలీనం అమల్లోకి వస్తుందని చెప్పారు. అలాగే మూడు బ్యాంకులకు చెందిన ఉద్యోగలు, ఖాతాదారుల భద్రతపై పూర్తి హామీ ఇచ్చారు. -
వొడాఫోన్, ఐడియా మెగా మెర్జర్?
న్యూఢిల్లీ: దేశ టెలికం రంగంలో భారీ విలీనం దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది.! అగ్రగామి కంపెనీలు ఐడియా సెల్యులర్, వొడాఫోన్ విలీనానికి ఉన్న అవకాశాలపై ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియా సంస్థ ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదే నిజమైతే ఐడియా, వొడాఫోన్ విలీనంతో మార్కెట్ పరంగా దేశ టెలికం రంగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భవించనుంది. ఒకపక్క సేవల పరంగా టెలికం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నడుస్తుండగా... మరోవైపు రిలయన్స్ జియో అత్యంత వేగంతో కూడిన 4జీ సేవలను అతి తక్కువ ధరలకే అందించడం ద్వారా మార్కెట్‌ను కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో తాజా విలీన వార్తలు రావడం ఆసక్తికి దారితీసింది. విలీనానికి అడ్డంకులు... వొడాఫోన్ ఐపీవోకు రావాలని గత కొంత కాలంగా ఆలోచన చేస్తోంది. ఈ సంస్థ విలువ 11 బిలియన్ డాలర్లుగా ఉంటుందని... ఐడియా సెల్యులర్ విలువ 5 బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. రెండు కంపెనీలు విలీనమైతే సంయుక్త సంస్థ మార్కెట్ విలువ 16 బిలియన్ డాలర్లు అవుతుందని తెలుస్తోంది. ఐడియా సెల్యులర్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉండడంతో వొడాఫోన్ ఐపీఓకు రావాల్సిన అవసరం తప్పుతుంది. అయితే, సంయుక్త కంపెనీ మార్కెట్ వాటా కొన్ని సర్కిళ్లలో 50 శాతానికి మించనుండడంతో నియంత్రణపరమైన అనుమతులు కష్టతరం కావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. వొడాఫోన్ గతంలో టాటా టెలీసర్వీసెస్ వంటి ఇతర సంస్థలతోనూ విలీనంపై చర్చలు సాగించినా కార్యరూపం దాల్చలేదు. కాగా, తాజా విలీన వార్తలపై స్పందించేందుకు వొడాఫోన్ నిరాకరించగా... ఐడియా మాత్రం ఆధార రహితం, తప్పుడు కథనంగా పేర్కొంది. మూడు సంస్థల వద్దే మూడొంతుల వాటా 2015-16 ఆర్థిక సంవత్సరాంతానికి భారతీ ఎయిర్టెల్ 31.7 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. వొడాఫోన్ 22.7 శాతం, ఐడియా 20.2 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ మూడు సంస్థల చేతుల్లోనే 74.6 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా టాటా టెలీ, ఎయిర్‌సెల్, టెలినార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ తదితర సంస్థలు పంచుకున్నాయి.