సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాలను నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకుల విలీనంతో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలియక ఖాతాదారులు అయోమయంలో ఉన్నారు. బ్యాంకుల విలీనంతో ఖాతాదారులు పెద్దగా నష్టపోయేదేమి ఉండదు. కాకపొతే కొన్ని మార్పులు తప్పవు. అవేంటో గమనించండి.
మారేవి...
1. కొత్త చెక్‌బుక్, డెబిట్/క్రెడిట్ కార్డులు ఇస్తారు
2. అకౌంట్ నంబరు, కస్టమర్ ఐడీతో పాటు ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్ కూడా మారుతుంది
3. మారిన ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్ ఆదాయపన్ను శాఖ, బీమా కంపెనీ వద్ద అప్‌డేట్ చేసుకోవాలి
4. ఈఎంఐలు, సిప్‌లు చేసేవారు తాజాగా బ్యాంకుల నుంచి ఆమోదపత్రం ఇవాల్సి ఉంటుంది
5. బిల్ పేమెంట్లకు తాజాగా స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు
6. మీ బ్యాంకు బ్రాంచ్ మీకు దగ్గరగా లేదా దూరంగా మారొచ్చు
7. బ్యాంకు స్టేషనరీ కూడా మారిపోతుంది
8. సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేట్లు కూడా మారే అవకాశముంది.
మారనివి..
1. ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు యథాతథంగా ఉంటాయి
2. ఫిక్సిడ్ డిపాజిట్లను చివరి వరకు ఉంచితే ప్రస్తుతం వస్తున్న వడ్డీతో తీసుకోవచ్చు
3. రుణాల రేట్లు కూడా మారవు
4. ఎంసీఎల్‌ఆర్ రుణాలపై గడువు ఆధారంగా వడ్డీ రేట్లు మారతాయి.
సంబంధిత వార్తలు
బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు
భారీగా ప్రభుత్వ బ్యాంకుల విలీనం
షాకింగ్ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
Comments
Please login to add a commentAdd a comment