HDFC Bank CEO Sashidhar Jagdishan Salary: మెగా మెర్జర్ తరువాత ప్రైవేటు బ్యాంకింగ్‌దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ప్రపంచ బ్యాంకింగ్‌లో 7వ ర్యాంక్‌ను సాధించింది. అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మార్కెట్ అంచనాలను మించి తొలి త్రైమాసిక లాభంలో 30 శాతం పెరిగింది. ఈ సందర్బంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీఈవో శశిధర్ జగదీషన్ వార్షిక వేతనం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది
ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సీఈవో వార్షిక వేతనంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6.52 కోట్లతో పోలిస్తే, ఎఫ్‌వై23లో జగదీషన్ మొత్తం ఆదాయం రూ.10.55 కోట్లుగా ఉంది. రెమ్యునరేషన్ ప్యాకేజీలో రూ. 2.82 కోట్ల బేసిక్ జీతం, రూ. 3.31 కోట్ల అలవెన్సులు , పెర్క్విసైట్‌లు ఉండగా, రూ. 3.63 కోట్ల పనితీరు బోనస్ ఉన్నాయి.2021-2022కి, జగదీషన్‌కు మొత్తం రూ. 5.16 కోట్ల నగదు వేరియబుల్ పేను ఆర్‌బిఐ ఆమోదించింది, అందులో అతను రూ. 2.58 కోట్లు అందుకున్నారు. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో)
2020-2021లో క్యాష్ వేరియబుల్ పేలో భాగంగా రూ. 1.05 కోట్లు అందుకున్నారు. అదే సమయంలో, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కైజాద్ భారుచా మార్చి 31, 2023తో ముగిసే సంవత్సరానికి రూ. 10.03 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. ఇది మునుపటి వార్షిక వేతనం రూ. 10.64 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. (Infosys Q1 Results: అంచనాలు మిస్, రెవెన్యూ గైడెన్స్ కోత)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇప్పుడు సాంకేతిక పరివర్తన సాధనలో ఉందని, భవిష్యత్తులో బ్యాంకును నిర్మించడంతోపాటు, సమర్ధవంతంగా నడపడంపై దృష్టి సారిస్తుందని షేర్‌హోల్డర్‌లను ఉద్దేశించి జగదీషన్ పేర్కొన్నారు. 2022-23లో, బ్యాంక్ రికార్డు స్థాయిలో 1,479 శాఖలను జోడించిందని, వీటిలో ఎక్కువ భాగం సెమీ అర్బన్, రూరల్ (ఎస్‌యుఆర్‌యు) లో ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం మరో 675ని జోడించాలని యోచిస్తోందని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 5,000కి చేరుకుంటుందని వెల్లడించారు. మొత్తం మీద, ఏడాదిలో 1,500 నుండి 2,000 అదనపు శాఖలను జోడించాలని బ్యాంక్ యోచిస్తోందని శశిధర్ చెప్పారు.
కాగా ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1లో నికర లాభం 29 శాతం జంప్‌చేసి రూ. 12,370 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. అలాగే మెగా విలీనం తరువాత బ్యాంకు షేర్లు బాగా లాభపడింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. అలాగే డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్‌మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసి ఏడో స్థానాన్ని ఆక్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment