చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో.. కఠిన శిక్షల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నడుం బిగించింది. కఠువా, సూరత్‌ల్లో మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య.. ఉన్నావ్‌లో బాలికపై అత్యాచార ఘటనల నేపథ్యంలో 12 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టే వారికి మరణశిక్ష విధించేలా అత్యవసరంగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.