
న్యూఢిల్లీ: రెండేళ్ల పాటు అమలు చేయనున్న పునర్వ్యవస్థీకృత జాతీయ వెదురు మిషన్(ఎన్‌బీఎం)కు కేంద్ర కేబినెట్ బుధవారం పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి రూ.1,290 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్రమే రూ.950 కోట్లు భరిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో వెదురు చెట్ల పెంపకానికి ఇది ప్రోత్సాహకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.ముడి జనపనార కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.200 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో క్వింటాల్ ముడి జనపనార ధర రూ.3,700కు చేరింది.
► ఔషధ మొక్కల పెంపకంలో సహకారానికి ఆఫ్రికా దేశం సావో టోమ్‌తో కుదిరిన అవగాహన ఒప్పందానికి పచ్చజెండా.
► రాజస్తాన్‌లో గిరిజన ప్రాబల్య జిల్లాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment