న్యూఢిల్లీ: దేశీయంగా ఉన్న కొరత, పెరుగుతున్న ధరను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోనుంది. దీనిని కిలో రూ.52–60 స్థాయిలో రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సుమారు 1.2 లక్షల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని గత వారం కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ‘ఈజిప్టు నుంచి మొదటి విడతగా 6,090 టన్నుల ఉల్లి కొనుగోలు చేయాలని నిర్ణయించాం. కావాలనుకున్న రాష్ట్రాలు డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ స్టాకును తీసుకెళ్లవచ్చునన్నారు.
Comments
Please login to add a commentAdd a comment