సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లిపాయల కొరత తీర్చడానికి ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి విడతలో జిల్లాకు 27 టన్నుల ఈజిప్టు ఉల్లి పాయలను కేటాయించారు. మంగళవారం విజయవాడలోని రైతు బజారుల్లో 15 టన్నుల ఉల్లిపాయలు విక్రయం జరిగింది. గుడివాడ, మచిలీపట్నం రైతు బజారుల్లో ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయని మార్కెటింగ్ శాఖ అధికారలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలోనూ కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment