సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016కు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. మంత్రిమండలి ఆమోద ముద్ర లభించడంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే హోంమంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పౌరసత్వ బిల్లుపై హోంమంత్రి అమిత్ షా గత రెండు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులతో విస్తృతంగా సంప్రదింపులు చేపట్టారు. బిల్లుపై పలువురు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసే కసరత్తు సాగించారు. కాగా ఈ బిల్లును పొరుగు దేశాల నుంచి వలస వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించే దిశగా రూపొందించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పౌరసత్వ బిల్లు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌరసత్వ బిల్లుతో పాటు వచ్చే ఏడాది జనవరి 25తో ముగియనున్న చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లకు పొడిగించే నిర్ణయానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment