citizenship row
-
వేములవాడకు త్వరలో ఉపఎన్నిక.. బీజేపీని నాలుగుసార్లు ఓడించా..
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. పౌరసత్వ వివాదంలో ఇరుక్కున్న రమేశ్‌బాబుకు పదవీ గండం ఉందని, త్వరలోనే వేములవాడకు ఉప ఎన్నిక వస్తుందని రఘునందన్‌రావు జోస్యం చెప్పారు. దీనిపై రమేశ్‌బాబు దీటుగా స్పందించారు. మునుగోడు నుంచి అసెంబ్లీకి మరో ‘ఆర్’ వేములవాడ: ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ తరఫున ట్రిపుల్ ‘ఆర్’ ఉందని, మునుగోడు ఎన్నికతో మరో ‘ఆర్’ అసెంబ్లీలోకి అడుగు పెడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకుడు తిరుపతిరావు, అర్చకుల బృందం స్వామివారి ప్రసాదం అందించి, సత్కరించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వం అంశంపై కోర్టు తీర్పు వస్తుందని, త్వరలోనే ఇక్కడ కూడా ఉపఎన్నిక జరుగుతుందని చెప్పారు. వేములవాడలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పేరు మార్చి, ఎంఐఎం అనుమతితో ప్రభుత్వం వేడుకలు నిర్వహించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది సెక్యులరిజమా లేక మతతత్వమా? సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని మాట తప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని తెలిసి, ఆయనకు నిద్ర పట్టడం లేదని పేర్కొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే 8 ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. కేవలం రంగురంగుల బ్రోచర్లు తప్ప నయాపైసా పని చేయలేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు సంతోష్‌బాబు, శ్రీనివాస్, సుదర్శన్‌యాదవ్, అన్నారం శ్రీనివాస్, కిష్టస్వామి, రమేశ్ తదితరులున్నారు. (క్లిక్ చేయండి: కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు) రాజన్న గుడికొచ్చి రాజకీయం చేయొద్దు వేములవాడ: నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను నాలుగుసార్లు ఓడించానని, సొంత బాబాయ్, బీజేపీ అభ్యర్థి సీహెచ్.విద్యాసాగర్‌రావుపై 20 వేల ఓట్లతో గెలిచానని ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పౌరసత్వ వివాదం కోర్టు పరిధిలో ఉందని, దానిపై నో కామెంట్ అన్నారు. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ చాలా సార్లు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారని, ఆయన వేసుకునే దుస్తులు ఆయన ఇష్టమని తెలిపారు. మంత్రి సారథ్యంలో జిల్లా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. రాజన్న గుడి చెరువులో 365 రోజులు గోదావరి జలాలు ఉండేలా చూస్తున్నామని, గుడికొచ్చిన మీకు ఇది కనిపించలేదా అని ప్రశ్నించారు. పోచమ్మ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించామన్నారు. మీరిప్పటి వరకు కేంద్రం నుంచి ఒక్క పైసానన్న రాజన్న ఆలయానికి తీసుకొచ్చారా అని మండిపడ్డారు. వేములవాడలో ఉపఎన్నిక అంటూ ఊదరగొడుతున్నారని అన్నారు. ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కౌన్సిలర్‌గా ఓడిపోయారని, ఇదీ వేములవాడలో ఆ పార్టీకి ఉన్న బలం అంటూ ఎద్దేవా చేశారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. (క్లిక్ చేయండి: టీఆర్ఎస్లో బయటపడ్డ అంతర్గత విభేదాలు) -
కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోవిడ్-19 టీకాల పంపిణీ పూర్తవగానే పౌరసత్వ చట్టం అమలు చేస్తామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో మంగళవారం పార్లమెంట్ హౌస్‌లో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. బెంగాల్లో బీజేపీ కార్యవర్గ సమస్యలపై చర్చించేందుకు ఇరువురు సమావేశమైనట్లు తెలిసింది. అనంతరం మాట్లాడిన సువేందు అధికారి సీఏఏ అంశాన్ని తెలిపారు. ‘కోవిడ్-19 మూడో డోసు పంపిణీ పూర్తవగానే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సీఏఏ అమలు చేస్తామని అమిత్ షా చెప్పారు.’ అని పేర్కొన్నారు అధికారి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో బుస్టర్ డోసుల పంపిణీని ప్రారంభించింది కేంద్రం. అది తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. మే నెలలో పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్గురిలో నిర్వహించి సభలో సీఏఏపై మాట్లాడారు అమిత్ షా. సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా సీఏఏ ప్రస్తావన తీసుకొచ్చారు కేంద్ర మంత్రి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన అక్కడి మైనారిటీ హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే.. 2014, డిసెంబర్ 31లోపు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం కల్పించాలని నిర్ణయించారు. 2019, డిసెంబర్లో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మతం పేరుతో వివక్ష, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. భారత్‌లోని ముస్లింలను లక్ష్యంగా చేసుకునే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్, సీఏఏలు ఉన్నాయని పేర్కొన్నారు నిరసనకారులు. ఆ వాదనలను తోసిపుచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిరసనలు రాజకీయంగా ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయుడు తన పౌరసత్వాన్ని కోల్పోడని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: భవిష్యత్‌లో చరిత్రను నిర్దేశించేది డేటానే - ప్రధాని మోదీ -
భగ్గుమంటున్న దేశ రాజధాని
-
భగ్గుమంటున్న దేశ రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కు చెందిన రెండు బస్సులను దగ్ధం చేశారు. భరత్ నగర్లో డీటీసీ బస్‌కు ఆందోళనకారులు నిప్పంటించగా ఆ ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. మరోవైపు ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుంటుండగా ఓ ఫైరింజన్‌ను జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులు అడ్డగించి ధ్వంసం చేశారని ఢిల్లీ ఫైర్ సర్వీసు అధికారులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న మధురా రోడ్డుకు వెళ్లకుండా ఆ మార్గాన్ని ఆందోళనకారులు దిగ్బంధించారు. ఫైరింజన్‌ను దగ్ధం చేసిన ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో సరితా విహార్‌కు వెళ్లే ఓఖ్లా అండర్‌పాస్‌పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రహదారి నిర్బంధంతో బదార్పూర్, ఆశ్రమ్ చౌక్ నుంచి వచ్చే వాహనాలను దారిమళ్లించారు. చదవండి: ‘పౌరసత్వం’ అపోహలు.. నిజాలు తెలుసుకోండి..! -
‘పౌర రగడ వెనుక విపక్షం’
-
పౌరసత్వ రగడ: మరో కశ్మీర్‌లా ఈశాన్యం!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన వారం రోజులుగా అస్సాంతో పాటు ఈశాన్యంలో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడి పరిస్థితులపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రశాంతంగా ఉండే అస్సాంను బీజేపీ ప్రభుత్వం మరో కశ్మీర్‌గా మార్చుతోందని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాదస్పద బిల్లుతో ఈశాన్య ప్రాంతమంతా రావణకాష్టంగా తయారైందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పౌరసత్వ బిల్లుతో బెంగాల్ కూడా హింసాత్మకంగా మారిందని కేంద్రంపై విమర్శలు చేశారు. బెంగాల్లో పరిస్థితిని సాధారణ స్థితికి చేర్చేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి లేఖ రాసినట్లు రంజన్ తెలిపారు. పౌరసత్వ వివాదానికి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరే కారణమని ఆరోపించారు. (ఇంటర్నెట్ నిలిపివేత) కాగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్యంలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు ఆందోళనకారులు మృతి చెందారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయడంలేదు.రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపడుతున్నారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఇదివరకే వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారు. -
‘పౌరసత్వ రగడ వెనుక విపక్షం’
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై హింసాత్మక నిరసనల వెనుక విపక్షాల ప్రమేయం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, దిక్కుతోచని స్ధితిలో హింసకు దిగుతున్నాయని ఆరోపించారు. ఆందోళనలు చేస్తున్న వారిని వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ వాదననే కాంగ్రెస్ ముందుకు తెస్తోందని ఎద్దేవా చేశారు. జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఆదివారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ పౌర బిల్లుపై రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన మైనారిటీ వర్గాలు శరణార్ధులుగా బతుకీడుస్తున్నారని, వారికి గౌరవప్రదమైన స్ధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభలూ ఆమోదించాయని గుర్తుచేశారు. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల నేపథ్యంలో బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. -
ఢిల్లీలోనూ పౌర బిల్లు ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విద్యార్ధులు చేపట్టిన నిరసన హింసాత్మకంగాఢి మారింది. నిరసన తెలుపుతున్న విద్యార్ధులు రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పౌర బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ తాము చేపట్టిన ఆందోళనను అడ్డుకున్నారంటూ జేఎంఐ విద్యార్ధులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వర్సిటీ క్యాంపస్ నుంచి పార్లమెంట్ వరకూ విద్యార్ధులు నిరసన ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. క్యాంపస్ వద్దనే పోలీసులు విద్యార్దులను అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. 50 మంది విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు తమపై బలప్రయోగం చేయడం సరికాదని విద్యార్ధులు ఆరోపించారు. -
పౌరసత్వ రగడ : ఇంటర్నెట్ నిలిపివేత
గువహటి : పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్యం భగ్గుమంటోంది. పలు ఈశాన్య రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో అసోంలో పెద్ద ఎత్తున హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. ఘర్షణలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి 24 గంటల పాటు పది జిల్లాల్లో ఇంటర్నెట్ను నిలిపివేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్లలో మతపరమైన వివక్షను ఎదుర్కొంటూ దేశానికి వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లుకు సవరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసోం అంతటా విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో హింసాత్మకనిరసనలు చోటుచేసుకున్నాయి. అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పిస్తే స్ధానికుల అవకాశాలు దెబ్బతింటాయని బిల్లును వ్యతిరేకిస్తున్న నిరసనకారులు అభ్యంతంర వ్యక్తం చేస్తున్నారు. కాగా నిరసనలను నియంత్రించేందుకు మొబైల్ డేటా, ఇంటర్నెట్ సేవలను 24 గంటల పాటు నిషేధిస్తున్నట్టు అసోం ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. -
పౌరసత్వ ప్రకంపనలు : ముస్లింలకు షా భరోసా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ముస్లింలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారంతా దేశ పౌరులుగానే కొనసాగుతారని హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. బుధవారం పౌరసత్వ సవరణ బిల్లును ఆయన రాజ్యసభలో ప్రవేశపెడుతూ ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమనే దుష్ర్పచారం సాగుతోందని, ఇది సత్యదూరమని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. భారత్‌లో ముస్లింలు ఎలాంటి అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదని, వారంతా ఇక ముందూ ఈ దేశంలో భద్రంగా జీవించవచ్చని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా భరోసాతో జీవించాలని, భయపడాల్సిన అవసరం లేదని అమిత్ షా కోరారు. పొరుగు దేశాల నుంచి వచ్చిన వారందరికీ పౌరసత్వం ఇవ్వాలని కొందరు చెబుతున్నారని..పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌లు ఇస్లాంకు అనుగుణంగా తమ రాజ్యాంగాలను రూపొందించుకున్న క్రమంలో ఆయా దేశాల్లో ఇతర మతస్తుల మాదిరి ముస్లింలు మతపరమైన వివక్షను ఎదుర్కోవడం లేదని ఈ దేశాల నుంచి వచ్చే ముస్లింలకు పౌరసత్వం ఎలా ఇస్తామని ప్రశ్నించారు. ప్రపంచ దేశాలకు చెందిన ముస్లింలను మన పౌరులుగా చేయగలమా..? ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి భారత్‌కు తరలివచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
అమెరికా అభ్యంతరాలు అర్థరహితం
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును ఖండిస్తూ అమెరికన్ కమిటీ యూఎస్సీఐఆర్ఎఫ్ ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుంది. కాగా ఈ బిల్లు తప్పుడు దిశగా పయనించే ప్రమాదకర మలుపుగా అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) అభివర్ణించింది. పార్లమెంట్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందితే బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా సహా ఇతర నేతలు, అధికారులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని వ్యాఖ్యానించింది. కాగా అమెరికన్ కమిటీ అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చుతూ మతపరమైన మైనారిటీ శరణార్ధుల కష్టాలను తొలగించడం, వారి కనీస మానవ హక్కులను గౌరవించేందుకే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేసింది. పౌరసత్వ బిల్లు, ఎన్ఆర్సీల ద్వారా ఏ ఒక్కరి పౌరసత్వానికి విఘాతం కలగదని తెలిపింది. పౌరసత్వ విధానాలను క్రమబద్ధీకరించే హక్కు అమెరికా సహా ప్రతి దేశానికీ ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. -
పౌరసత్వ బిల్లుకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. భారత్ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని అవి వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వలసలు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ ప్రతిపాదనపై ఆగ్రహంతో ఉన్నారు. మూడు ఇస్లామిక్ దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన వారిలో హిందువులే అత్యధికంగా ఉంటారు. ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి వారికి ఎన్నార్సీ నుంచి రక్షణ కల్పించాలని బీజేపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు వీలుగా జాతీయ పౌరపట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్–ఎన్నార్సీ)ను సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పౌరసత్వ బిల్లు రూపకల్పన సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లును నేడు కానీ, రేపు కానీ సభలో ప్రవేశపెట్టి, వచ్చే వారం సభ ఆమోదం పొందేలా చూడాలని కేంద్రం ఆలోచిస్తోంది. తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్, టీఎంసీ ఈ బిల్లున వ్యతిరేకిస్తున్నాయి. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం భారత లౌకిక భావనకు వ్యతిరేకమని కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ నేత, అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 12 మంది ఎంపీలు మోదీకి లేఖ రాశారు. లోక్‌సభలో బీజేపీకి ఉన్న మెజారిటీ దృష్ట్యా అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం సమస్య కాబోదుగానీ, రాజ్యసభలో విపక్షం ఈ బిల్లును అడ్డుకునే అవకాశముంది. గత ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు లోక్‌సభలో గట్టెక్కింది. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు చోటు చేసుకోవడంతో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టలేదు. ఆ తరువాత ఆ ప్రభుత్వ పదవీకాలం ముగిసింది. కేబినెట్ నిర్ణయాల్లో మరికొన్ని.. ► వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం. డేటా సేకరణ, నిల్వ, వినియోగం, సంబంధిత వ్యక్తుల ఆనుమతి, ఉల్లంఘనలకు జరిమానా, శిక్ష.. తదితరాలకు సంబంధించిన సమగ్ర విధి, విధానాలతో బిల్లును రూపొందించారు. ► కేంద్ర సంస్కృత యూనివర్సిటీల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం. మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్సిటీలను సెంట్రల్ యూనివర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ► ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 3.7 ఎకరాల స్థలాన్ని ఐటీడీసీ(ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్), ఐటీపీఓ(ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్)లకు రూ. 611 కోట్లకు 99 ఏళ్ల పాటు లీజుకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఈ స్థలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్, ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మిస్తారు. 2021లోగా ఈ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ► జమ్మూకశ్మీర్‌లో ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉపసంహరించేందుకు ఆమోదం. ఇటీవలి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ అంశం ఉండటంతో ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో రిజర్వేషన్ల పొడిగింపునకు ఆమోదం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగించేందుకు నిర్ణయించారు. అయితే, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతానికి వారికి రిజర్వేషన్లను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మీడియా ప్రశ్నించగా, బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎస్సీ సభ్యులు 84 మంది, ఎస్టీ సభ్యులు 47 మంది ఉన్నారని జవదేకర్ వెల్లడించారు. రాష్ట్రాల శాసనసభల్లో 614 ఎస్సీ, 554 ఎస్టీ సభ్యులున్నారన్నారు. ఏమిటీ బిల్లు? పౌరసత్వ చట్టం, 1955కి తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ కొత్త బిల్లు ప్రకారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నివసిస్తూ మత పరమైన హింస, వేధింపుల్ని ఎదుర్కొంటున్న ఆరు వర్గాలకు భారత పౌరసత్వాన్ని కల్పించడానికి వీలుగా చట్టానికి సవరణలు చేస్తున్నారు. హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు, జైనులు, బుద్ధులకు ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం మన దేశ పౌరసత్వం లభిస్తుంది. వీరంతా భారత్‌లో ఉంటూ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, ఆ పత్రాల గడువు తేదీ ముగిసిపోయినా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆరు వర్గాల్లో ముస్లింలు లేకపోవడం మైనారిటీల్లో అసంతృప్తి రాజేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో.. బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా దేశంలోని ఈశాన్యరాష్ట్రాల్లో ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇప్పటికే అసోం పౌర రిజిస్టర్ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాల్లో ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. పార్లమెంటులో బిల్లు గట్టెక్కుతుందా? లోక్‌సభలో ఈ బిల్లుని మొదట 2016లో ప్రవేశపెట్టారు. అధికార బీజేపీకి అసోంలో మిత్రపక్షమైన అసోం గణ పరిషత్(ఏజీపీ) అప్పట్లో దీనిని వ్యతిరేకించింది. కొన్ని సవరణలతో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నందున దీనిపై వ్యతిరేకత వచ్చినా ఆమోద ముద్ర పడుతుంది. ఇక రాజ్యసభలో మాత్రం జేడీ(యూ), అకాలీదళ్ వంటి పార్టీల మద్దతు లేకుండా బిల్లు గట్టెక్కలేదు. రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకునేందుకు హోంమంత్రి అమిత్ పలు పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. బిల్లుకు అనుకూలం బీజేపీ, అకాలీదళ్, ఏఐఏడీఎంకే బిల్లుకి ప్రతికూలం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు -
పౌరసత్వ బిల్లుకు మంత్రిమండలి ఓకే..
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016కు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. మంత్రిమండలి ఆమోద ముద్ర లభించడంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే హోంమంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పౌరసత్వ బిల్లుపై హోంమంత్రి అమిత్ షా గత రెండు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులతో విస్తృతంగా సంప్రదింపులు చేపట్టారు. బిల్లుపై పలువురు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసే కసరత్తు సాగించారు. కాగా ఈ బిల్లును పొరుగు దేశాల నుంచి వలస వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించే దిశగా రూపొందించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పౌరసత్వ బిల్లు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌరసత్వ బిల్లుతో పాటు వచ్చే ఏడాది జనవరి 25తో ముగియనున్న చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లకు పొడిగించే నిర్ణయానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. -
పౌరసత్వం రద్దుపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాలపై టీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్పందించారు. భారతీయ పౌరుడిగా తన పౌరసత్వ పరిరక్షణకు మళ్ళి హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. ద్వంద్వ పౌరసత్వ వివాదంలో జూలై 15, 2019న హైకోర్టు తీర్పు కచ్చితమైన ఆదేశాలను ఇచ్చిందని, ఈ ఆదేశాలను కేంద్ర హోంశాఖ పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నా పౌరసత్వాన్ని 2017లో కేంద్ర హోంశాఖ రద్దు చేయడంతో దీనిపై హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. అనంతరం సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం గత జూలై 15న నా పౌరసత్వ రద్దును కొట్టివేసింది. పౌరసత్వ చట్టం నియమ నిబంధనల ప్రకారం నా దరఖాస్తులను సమగ్రంగా, హేతుబధ్ధంగా, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్ 10.3) చూడాలే తప్ప సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయంలో మా రీ-అప్పీలుపై హైకోర్టు స్పందిస్తూ ఒక వేళ సెక్షన్ 10.3ను పరిగణించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా.. న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని తేల్చిచెప్పింది. ఈ ఆదేశాల మేరకే గత నెల 31న ఢిల్లీలో మరోసారి వాదనలు జరిగాయి. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం’ అని అన్నారు. తన పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని, తనకు తప్పక న్యాయం జరుగుతుందని చెన్నమనేని రమేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ ఎదురుదెబ్బ!
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వం విషయంలో టీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దయింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తమ అభ్యంతరాలను కేంద్ర హోంశాఖకు మూడు వారాల్లోగా చెప్పాలని చెన్నమనేనికి, పిటిషనర్‌కు సూచనలు చేసింది. దీనిపై పునఃసమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ చెన్నమనేని మోసపూరితంగా భారత పౌరసత్వాన్ని పొందారని తేల్చింది. అనేక వాస్తవాలు దాచి తప్పుడు మార్గాలలో పౌరసత్వం కలిగి ఉన్నారని నిర్థారించింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయన జర్మనీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో ద్వంద్వ పౌరసత్వం అంశం తెరపైకి వచ్చింది. నేను చెప్పిందే నిజమైంది! చెన్నమనేని రమేష్ బాబు భారతీయుడు కాదని తాను చెప్పింది నిజమైందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తప్పుడు పత్రాలతో భారతదేశ పౌరసత్వం పొంది, మరో భారత పౌరుడికి చెన్నమనేని అన్యాయం చేశారని, కాలయాపన కోసమే రమేష్ బాబు తిరిగారే తప్ప ఆయన వాదనలో నిజం లేదని తేలిందని అన్నారు. -
పౌరసత్వ రగడ : రాహుల్‌కు సుప్రీం ఊరట
-
పౌరసత్వ రగడ : రాహుల్‌కు సుప్రీం ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పౌరసత్వ వివాదంపై సర్వోన్నత న్యాయస్ధానంలో ఊరట కలిగింది. రాహుల్ స్వచ్ఛందంగా బ్రిటిష్ జాతీయతను కలిగి ఉన్నందున ఆయనను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. మరోవైపు వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో తన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వేటుకు గురైన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌నూ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇక త్రిపురలో 168 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని సీపీఐ(ఎం) దాఖలు చేసిన పిటిషన్‌పై సత్వర విచారణ చేపట్టాలన్న అప్పీల్‌నూ సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. -
‘అక్షయ్ దేశభక్తిని శంకించాల్సిన పని లేదు’
గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పౌరసత్వం గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అక్షయ్ ఓటు వేయకపోవడంతో ఈ వివాదం తెరమీదకు వచ్చింది. దీనిపై స్పందించిన అక్షయ్.. తన పౌరసత్వం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. దేశం పట్ల తనకు ఉన్న ప్రేమను ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. తాజాగా ఈ వివాదంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజ్జూ అక్షయ్‌కు మద్దతుగా నిలిచారు. అక్షయ్ దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదన్నారు కిరెన్. ఈ మేరకు ‘అక్షయ్.. మీ దేశ భక్తిని ఎవరూ శంకించలేరు. సాయుధ దళాల సిబ్బంది చనిపోయినప్పుడు మీరు స్పందించిన తీరు.. వారిని ఆదుకోవడం కోసం ‘భారత్‌కేవీర్’ కార్యక్రమం ద్వారా మీరు విరాళాలు సేకరించిన విధానం దేశభక్తి కలిగిన ఓ భారతీయుడికి అసలైన ఉదాహరణగా నిలుస్తుందం’టూ కిరెన్ రిజ్జూ ట్వీట్ చేశారు. దాంతో అక్షయ్ ట్విటర్ ద్వారా కిరెన్ రిజ్జూకు ధన్యవాదాలు తెలిపారు. ‘మీకు ధన్యవాదాలు తెలపడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి కిరెన్ రిజ్జూ సర్. నా పట్ల మీరు చూపిన అభిమానానికి ధన్యవాదాలు. భారత ఆర్మీ పట్ల, ‘భారత్‌కేవీర్’ కార్యక్రమం పట్ల నా బాధ్యత ఎప్పటికి స్థిరంగా నిలిచి ఉంటుందం’టూ అక్షయ్ రీట్వీట్ చేశారు. Thank you so much @KirenRijiju Sir, and I apologise for the delayed response. I am grateful for your kind words. Please be assured, my commitment to #BharatKeVeer and to the Indian armed forces would remain steady, no matter what 🙏🏻 https://t.co/W1298prsEQ — Akshay Kumar (@akshaykumar) May 7, 2019 బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా పౌరసత్వం విషయంలో అక్షయ్‌కు మద్దతుగా నిలిచారు. తన పౌరసత్వం వివాదం గుర్చి స్పందిస్తూ అక్షయ్ తన దగ్గర కెనడా పాస్‌పోర్ట్ ఉందన్నారు. కానీ గత ఏడేళ్లగా ఒక్కసారి కూడా కెనడా వెళ్లలేదని తెలిపారు. ఇండియా ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు అక్షయ్. -
రాహుల్ మిత్రుడికి రక్షణ కాంట్రాక్టు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వ అంశంపై కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్న సమయంలో.. రాహుల్ గతంలో బ్రిటన్‌లో ఉల్రిక్ మెక్నైట్ అనే వ్యక్తి భాగస్వామిగా బ్యాకాప్స్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు మెక్నైట్ యూపీఏ ప్రభుత్వ హయాంలో విదేశీ భాగస్వామిగా రక్షణ పరికరాల కాంట్రాక్టులు పొందిన విషయం కూడా బయటపడింది. కంపెనీ మూతపడటానికి ముందు 2005 జూన్ 5 నాటికి బ్యాకాప్స్ కంపెనీలో రాహుల్‌కు 65 శాతం, మెక్‌నైట్‌కు 35 శాతం వాటా ఉంది. ఆ తర్వాత 2011లో కూడా ఫ్రెంచి సంస్థ నావల్ గ్రూప్ నుంచి (స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధించి) మెక్నైట్ కాంట్రాక్టులు పొందారు. యూపీఏ హయాంలో నావల్ గ్రూప్ విదేశీ భాగస్వామిగా.. రాహుల్ మాజీ వ్యాపార భాగస్వామికి చెందిన అనుబంధ సంస్థలు డిఫెన్సు కాంట్రాక్టులు పొందినట్లు ‘ఇండియా టుడే’కి లభించిన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాకాప్స్ కంపెనీ పేర్కొంటున్న దాని ప్రకారం.. రాహుల్, మెక్‌నైట్‌లు ఇద్దరూ ఆ కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్లు. కాగా 2004లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో బ్యాకాప్స్ కంపెనీకి చెందిన మూడు ఖాతాల్లోని నగదుతో పాటు దాని చరాస్తుల వివరాలను కూడా రాహుల్ పొందుపరిచారు. కాగా ఈ కంపెనీ 2009లో మూతపడింది. కాగా దాదాపు ఇదేవిధమైన పేరుకలిగిన బ్యాకాప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో కూడా రాహుల్‌కు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ భారతీయ కంపెనీలో తనకు 83 శాతం వాటా ఉన్నట్లు రాహుల్ 2004 ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. రూ.2.5 లక్షల మూలధన పెట్టుబడి కూడా ఉందన్నారు. 2002లో మొదలైన ఈ కంపెనీ కూడా తర్వాత మూతపడింది. చివరిసారిగా 2010 జూన్‌లో ఈ సంస్థ రిటర్న్స్ దాఖలు చేసింది. అయితే రాహుల్ మాజీ వ్యాపార భాగస్వామి, అతని కంపెనీలు ఫ్రెంచి కంపెనీ ఇచ్చిన ఆఫ్సెట్ కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందుతూ వచ్చాయి. విశాఖ సంస్థల్లో డైరెక్టర్‌గా మెక్నైట్ ముంబయిలోని మాజగాంవ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్) వద్ద తయారయ్యే స్కార్పీన్ జలాంతర్గాములకు అవసరమైన కీలక విడిభాగాలు సప్లై చేసేందుకు ఫ్రెంచి సంస్థ నావల్ గ్రూప్ 2011లో విశాఖపట్నంకు చెందిన ఫ్లాష్ ఫోర్జ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించిన రూ.20 వేల కోట్ల ఒప్పందంలో భాగంగా ఎండీఎల్‌తో నావల్ గ్రూప్ కలసి పనిచేయాల్సి ఉంది. కాగా అదే ఆర్థిక సంవత్సరంలో ఫ్లాష్ ఫోర్జ్ యూకేకి చెందిన ఆప్టికల్ ఆర్మోవర్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. 2012 నవంబర్‌లో ఇద్దరు ఫ్లాష్ ఫోర్జ్ డైరెక్టర్లను ఆ సంస్థలో డైరెక్టర్లుగా చేశారు. వీరు ఆ సంస్థ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన 2012 నవంబర్ 8నే ఉల్రిక్ మెక్‌నైట్‌ను కూడా ఆ సంస్థ డైరెక్టర్‌గా చేర్చారు. అంతేకాదు ఆ సంస్థలో మెక్‌నైట్‌కు సంస్థ 4.9 శాతం వాటా కేటాయించినట్లు ఆప్టికల్ ఆర్మోవర్ 2014లో దాఖలు చేసిన పత్రాలను బట్టి తెలుస్తోంది. కాగా ఫ్లాష్ ఫోర్జ్ 2013లో యూకేకి చెందిన మరో కంపెనీ కాంపోజిట్ రెసిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీని కూడా కొనుగోలు చేసింది. అదే సంవత్సరంలో ఫ్లాష్ ఫోర్జ్ ఇద్దరు డైరెక్టర్లతో పాటు మెక్నైట్ కూడా ఆ సంస్థలో డైరెక్టర్‌గా చేరారు. నావల్ గ్రూపు వెబ్సైట్లు పేర్కొంటున్నదాని ప్రకారం..దాని భారతీయ భాగస్వాముల్లో ఫ్లాష్ ఫోర్జ్, సీఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్లాష్ ఫోర్జ్, మరో ఫ్రెంచి గ్రూప్ కోయార్డ్ల జాయింట్ వెంచర్) ఉన్నాయి. దీనిపై ఇండియా టుడే మెక్‌నైట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. నావల్ గ్రూపుతో ఫ్లాష్ ఫోర్జ్ ఒప్పందం కుదుర్చుకోక ముందే రాహుల్ గాంధీకి చెందిన భారత, యూకే కంపెనీలు మూతపడినా.. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాలతో ఆయన మాజీ వ్యాపార భాగస్వామి.. భారత విదేశీ భాగస్వామిగా యూరప్ సంస్థల ద్వారా లబ్ధి పొందినట్లు స్పష్టమవుతోంది. రాహుల్ రక్షణ డీలర్‌గా బెటర్! కాంగ్రెస్ స్పందించాలన్న కేంద్రమంత్రి జైట్లీ రాహుల్æ గాంధీ సన్నిహితుడికి యూపీఏ హయాంలో రక్షణ శాఖ కాంట్రాక్టు కట్టబెట్టారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ‘బాకాప్స్ నుంచి రాహుల్ 2009లో బయటకు రాగా, భారత్‌లోని బాకాప్స్ 2010లో మూతబడింది. అయితే, మెక్నైట్, రాహుల్ సంబంధాలు కొనసాగాయి. యూపీఏ హయాంలో ఫ్రాన్సు సహకారంతో జలాంతర్గాములను నిర్మించే రక్షణ శాఖ కాంట్రాక్టు మెక్‌నైట్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టింది’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రధాని కావాలనుకుంటున్న వ్యక్తి అసలు కథ ఇది అని పేర్కొన్నారు. ‘ఇందులో రాహుల్ పాత్ర ఏమిటి? రక్షణ సామగ్రి డీలర్ అవుదామనుకున్నారా? కాంగ్రెస్ దీనిపై సత్వరం స్పందించాలి. రాజకీయాల్లో రావడం కంటే కూడా ఆయన రక్షణ రంగంలో డీలర్ అయితే బాగుండేది’ అని అన్నారు. -
పౌరసత్వ వివాదం: అక్షయ్ షాకింగ్ వీడియో!
బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన అక్షయ్‌కుమార్‌కు దేశమంటే ఎనలేని ప్రేమ. ఒకవైపు దేశభక్తి చిత్రాల్లో నటించడమే కాదు.. మరోవైపు జవాన్లకు ఆర్థిక సాయం అందజేయడం.. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేపట్టారు. భారత్ అంటే తనకు ఎంతో ప్రేమ అని చాటారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన చుట్టు పౌరసత్వ వివాదం ముసురుకుంటోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం.. భారత్‌కు బదులు కెనడా దేశ పౌరసత్వం ఆయన కలిగి ఉండటం అందుకు కారణం. ఎట్టకేలకు పౌరసత్వ వివాదంపై అక్షయ్‌కుమార్ స్పందించారు. తనకు కెనడా పాస్‌పోర్టు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన.. అదే సమయంలో మాతృదేశమైన భారత్ అంటే తనకు ఎనలేని మక్కువ అని పేర్కొన్నారు. కెనడా పౌరసత్వం విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, గత ఏడేళ్లలో తాను ఎన్నడూ కెనడా వెళ్లలేదని, ఇక్కడే ఉంటూ.. ఇక్కడే అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ క్రమంలోనే ఆయన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో కెనడా టోరంటోలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్‌కుమార్.. ‘మీకో విషయం తప్పకుండా చెప్పాలి. టోరంటో నా సొంతూరు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రిటైరయ్యాక నేను ఇక్కడికే వచ్చి స్థిరపడతాను’ అని పేర్కొంటున్న వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. దేశం మీద ప్రేమ ఉందంటూనే.. అక్షయ్‌కుమార్ ద్వంద్వ వైఖరిని చాటుతున్నారని ఈ వీడియోపై కొందరు విమర్శలు చేస్తుండగా.. గతంలో ఎప్పుడూ అన్న మాటలను వెలుగులోకి తెచ్చి.. అక్షయ్ దేశభక్తిని శంకించడం సరికాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
పౌరసత్వ బిల్లుపై భగ్గుమన్న ఈశాన్యం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు 2016ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెడుతుండటంతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించేలా చేపట్టిన ఈ సవరణ బిల్లును అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీకి చెందిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌లు సైతం బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2014, డిసెంబర్ 31లోగా భారత్‌లో ప్రవేశించిన పొరుగు దేశాలకు చెందిన ముస్లింలు కాకుండా హిందువులు, పార్శీలు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, జైన్లకు భారత పౌరసత్వం ఇచ్చేలా ఈ బిల్లును సవరించారు. వలసదారుల పట్ల వివక్ష తగదని, దేశంలోకి తరలిచ్చిన ప్రతిఒక్కరికీ వారి మతంతో సంబంధం లేకుండా పౌరసత్వ హక్కు కల్పించాలని ఈశాన్య రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి 1971 మార్చి తర్వాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన హిందూ వలసదారులకు పౌరసత్వం కల్పించేలా రూపొందిన ఈ బిల్లు 1985 అసోం ఒప్పందానికి విరుద్ధమని నిరసనకారులు పేర్కొంటున్నారు. కాగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ భారతరత్నను వెనక్కిఇవ్వాలని అస్సామీ గాయకుడు భూపేన్ హజారికా కుటుంబం యోచిస్తోంది. మరోవైపు పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఇటీవల ప్రధాని మోదీ గౌహతి పర్యటనలో నిరసనకారులు నల్లజెండాలు ప్రదర్శించారు. -
నిరసనల మధ్యే వివాదాస్పద బిల్లుకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కాంగ్రెస్ సహా ప్రధాన విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా.. సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉండడంతో బిల్లుకు ఆమోదం లభించింది. సిటిజన్‌షిప్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పౌరసత్వ సవరణ బిల్లు కేవలం అసోం రాష్ట్రం కోసం కాదని... పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చే శరణార్థులందరి కోసమని స్పష్టంచేశారు. ఈ బిల్లుతో ఎవరూ వివక్షకు గురికారని తెలిపారు. ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అసోం ప్రజల హక్కులను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ సవరణ వల్ల అసోంలో పెద్దఎత్తున అల్లర్లు జరుగుతాయని, దీన్ని మరోసారి సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఇందుకు స్పీకర్ సుమిత్రా మహజన్ నిరాకరించారు. దీంతో ప్రభుత్వం తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించింది. బిల్లు ఆమోదం పొందితే అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటాయని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ హెచ్చరించారు. అయితే, విపక్షాల ఆందోళన మధ్యే పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ఈశాన్యరాష్ట్రాల్లో ఆందోళనలు భగ్గుమన్నాయి. -
ఫక్రుద్దీన్ ఫ్యామిలీ కూడా పరాయివారేనా!
సాక్షి, న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి పరాయివారై పోవడమంటే ఇదే! అస్సాం జనాభాకు సంబంధించి ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ జూలై 30వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేసిన జాబితాలో గల్లంతైన 40 లక్షల మందిలో భారత ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సమీప బంధువులు కూడా ఉన్నారు. దివంగత రాష్ట్రపతికి స్వయాన తమ్ముడి కొడుకైన జియావుద్దీన్ అలీ అహ్మద్ కుటుంబానికి జాతీయ పౌరసత్వ జాబితాలో చోటు లభించలేదు. 1951లో మొదటిసారి విడుదల చేసిన పౌరసత్వ జాబితా నుంచి 1971 వరకున్న అన్ని ఓటర్ల జాబితాలను తనిఖీ చేసినా తమ పూర్వికుల పేర్లు లేవని జియావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఢిల్లీలో పుట్టి ఢిల్లీలో స్థిరపడినందున ఆయన పేరు అస్సాం పౌరుల జాబితాలో ఉండకపోవచ్చుగానీ భారత సైన్యంలో పనిచేసిన ఆయన తండ్రి కల్నల్ జల్నూర్ అస్సాంలో పుట్టి పెరిగారు. ఆయన పేరు కూడా లేకపోవడం ఆశ్చర్యం. ఈ దేశ పౌరులమని నిరూపించుకునేందుకు ఓ భూమి కాగితాలు తప్ప అవసరమైన డాక్యుమెంట్లేవి జియావుద్దీన్ కుటుంబం వద్ద లేవు. భూమి కాగితాలు తీసుకెళ్లి స్థానిక ఎన్ఆర్సీ అధికారులకు చూపించగా గడువు ముగిశాక వచ్చావంటూ తిప్పి పంపించారట. 2015, ఆగస్టు 31వ తేదీలోగానే భారత పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ గడువు విధించిన విషయం తెల్సిందే. జియావుద్దీన్ అస్సాంలోని కామ్రూప్ జిల్లా, రంగియా గ్రామంలో నివసిస్తోంది. ఆయన తన పూర్వికులు 1971, మార్చి 24వ తేదీ కన్నా ముందు నుంచే భారత్‌లో నివసిస్తున్నట్లు రుజువు చేయడానికిగాను తన పూర్వికులున్న ఓటర్ల జాబితా కోసం అనేక ఊర్లు తిరిగారు. చివరకు తన తండ్రి పుట్టిన గోలాఘాట్‌కు కూడా వెళ్లారు. లాభం లేకపోయింది. ఆధారాలు సేకరించలేక పోయారు. జియావుద్దీన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తమ్ముడు ఎంత్రాముద్దీన్ కుమారుడు. ఎంత్రాముద్దీన్, ఫక్రుద్దీన్‌ల తండ్రి జల్నూర్ అలీ అహ్మద్. అసలైన అస్సాం మూలవాసి. ఆయన మెడిసిన్ చదవి భారత సైన్యంలో కల్నల్‌గా రిటైర్ అయ్యారు. ఫక్రుద్దీన్ నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఢిల్లీలో నివసిస్తున్నందున వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఓ కూతురు పాకిస్థాన్‌ను పెళ్లి చేసుకొని ఆ దేశం వెళ్లిపోయింది. మరొకరు అస్సాంలోనే చనిపోయినట్లు జియాఉద్దీన్ తెలిపారు. జియాఉద్దీన్ తండ్రి ఎంత్రాముద్దీన్ ఇంజనీరు. పెళ్లి అనంతరం ఎంత్రాముద్దీన్ రంగియా గ్రామానికి మారారట. కానీ ఆయన వృత్తిరీత్యా ఎక్కువగా గువాహటిలోనే ఉండే వారట. అయితే తన పూర్వికులతో తనకున్న సంబంధాన్ని రుజువు చేసుకునే డాక్యుమెంట్లు జియాఉద్దీన్ సంపాదించలేక పోయారు. ఇదే విషయమై ఎన్ఆర్సీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలాను మీడియా సంప్రతించగా.. భూములు, లేదా భూమికి సంబంధించిన టెనెన్సీ రికార్డులు, సిటిజెన్షిప్ సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువపత్రం, శరణార్థులుగా నమోదు సర్టిఫికెట్, పాస్‌పోర్టు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రికార్డులు, ప్రభుత్వం జారీ చేసిన ఏవైన లైసెన్సులు, ప్రభుత్వ ఉద్యోగ రికార్డులు, పుట్టిన సర్టిఫికెట్, బోర్డు లేదా యూనివర్శిటీ జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు, తపాలా శాఖలో ఖాతాలు తదితర సర్టిఫికెట్లలో వేటిని రుజువుగా చూపించినా సరేనని, ఇంతకన్నా ఇంకేమి వెసులుబాటు కల్పించగలమని ఆయన అన్నారు. వీటిలో తన తండ్రి పేరుతో ఉన్న ఒక్క భూమి కాగితాలు మినహా మరేమీ లేవని జియావుద్దీన్ అన్నారు. భూమి కాగితాలు తీసుకెళితే ఆలస్యమైందంటూ తీసుకోలేదని చెప్పారు. ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారుగదా, జియాఉద్దీన్ లాంటి వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చా? అంటూ ఎన్ఆర్సీ అధికారులను మీడియా ప్రశ్నించగా, ఇప్పటికే దరఖాస్తు చేసుకొని తిరస్కరణకు గురయిన వారికే ఫిర్యాదు అవకాశం ఉంటుందని వారు చెప్పారు. ఇంతకుముందే దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురయిందా? అని జియావుద్దీన్‌ను ప్రశ్నించగా, ఏ సర్టిఫికెట్ లేనందున దరఖాస్తు స్వీకరించేందుకే అధికారులు తిరస్కరించారని ఆయన చెప్పారు. 40 లక్షల మందిలో జియావుద్దీన్ లాంటి వాళ్లు ఎందరున్నారో! -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవి కల్లాస్!
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మళ్లీ చుక్కెదురైంది. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ ఝలక్ ఇచ్చింది. తన పౌరసత్వంపై వేసుకున్న రివ్యూ పిటిషన్‌ను హోంశాఖ కొట్టి వేసింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హోం శాఖలో రమేష్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెన్నమనేని రమేష్, 2014లో కూడా టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. వేములవాడ నుంచి చెన్నమనేని శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల నామినేషన్ సందర్భంగా చెన్నమనేని సమర్పించిన అఫిడవిట్లో భారత పౌరసత్వం లేదని స్పష్టమైంది. ఈ విషయంపై గతంలో 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. జర్మనీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన చెన్నమనేని, 1993లోనే తన భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ నెల 13నే హోం శాఖలో చెన్నమనేని పౌరసత్వానికి సంబంధించిన విచారణ జరగగా ఆయన పౌరసత్వం చెల్లదని తాజాగా హోం శాఖ ప్రకటించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి గండం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. చెన్నమనేనిపై చర్యలు తీసుకోవాలి : ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీనిపై కేసీఆర్ వెంటనే స్పందించి టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. -
రాహుల్‌గాంధీకి ఊరట!
న్యూఢిల్లీ: పౌరసత్వ వివాదంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బ్రిటన్‌లోని కంపెనీ లా అధికారుల ముందు తాను ఆ దేశ పౌరుడిగా రాహుల్‌గాంధీ పేర్కొన్నారని, ఆయన పౌరసత్వ వివాదంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ అమితావ్ రాయ్ ధర్మాసనం ఈ పిల్‌ను కొట్టివేసింది. రాహుల్ బ్రిటన్ పౌరసత్వంపై పిల్‌తోపాటు జతచేసిన పత్రం ప్రామాణికతను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తాము తిరుగుతూ విచారణ జరపాలా? అని పిటిషనర్‌ను కోర్టు నిలదీసింది. ఇది అల్పమైన పిటిషన్ అని పేర్కొంటూ కొట్టివేసింది. రాహుల్ పౌరసత్వ వివాదంపై అత్యవసరంగా విచారణ జరపులంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ గతంలో చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఓ కార్పొరేట్ సంస్థకు సంబంధించి తాను బ్రిటన్ జాతీయుడినని రాహుల్ ఆ దేశ అధికారుల ముందు చెప్పినట్టు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే.