సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పౌరసత్వ వివాదంపై సర్వోన్నత న్యాయస్ధానంలో ఊరట కలిగింది. రాహుల్ స్వచ్ఛందంగా బ్రిటిష్ జాతీయతను కలిగి ఉన్నందున ఆయనను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు తిరస్కరించింది.
మరోవైపు వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో తన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వేటుకు గురైన బీఎస్‌ఎఫ్ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌నూ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇక త్రిపురలో 168 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని సీపీఐ(ఎం) దాఖలు చేసిన పిటిషన్‌పై సత్వర విచారణ చేపట్టాలన్న అప్పీల్‌నూ సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment