పౌరసత్వ సవరణ బిల్లుపై హింసాత్మక నిరసనల వెనుక విపక్షాల ప్రమేయం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, దిక్కుతోచని స్ధితిలో హింసకు దిగుతున్నాయని ఆరోపించారు. ఆందోళనలు చేస్తున్న వారిని వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ వాదననే కాంగ్రెస్ ముందుకు తెస్తోందని ఎద్దేవా చేశారు.