హైదరాబాద్: పేద, బలహీన వర్గాల వారందరికీ సొంతిళ్లను నిర్మించి ఇవ్వాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పానికి చేయూనివ్వడానికి ప్రముఖ రియల్టీ, ఆభరణాల వ్యాపార సంస్థ మలబార్ గ్రూప్ ఆర్థిక సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వపు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’, కేరళ ముఖ్యమంత్రి ప్రకటించిన ‘లైఫ్ మిషన్’ వంటి కార్యక్రమాలకు మద్దతు ప్రకటిస్తున్నామని గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తెలిపారు.
గృహ నిర్మాణ ప్రాజక్టులకు అవసరమైన పాక్షిక ఆర్థిక సాయం మలబార్ హౌసింగ్ చారిటబుల్ ట్రస్ట్, మలబార్ డెవలపర్స్ నుంచి అందుతుందని పేర్కొన్నారు. 4 సెంట్ల స్థలం కలిగి, 600 చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యంలో ఇల్లు నిర్మించుకోదలచిన వారు భూమి దస్తావేజుల నకలు, ఇంటి ప్లాన్ కాపీ, ఫోటో గుర్తింపు కార్డులను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను సమీపంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ లేదా మలబార్ డెవలపర్స్ కార్యాలయం లేదా మలబార్ హౌసింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్‌లలో ఈ మార్చి 10 లోగా అందజేయాలని పేర్కొన్నారు.