ప్రేమ వ్యవహారంలో వచ్చిన స్పర్థలు ఓ యువకుడిపై దాడికి దారితీశాయి. వరంగల్ జిల్లా జనగామ మండలం గానుగ పహాడ్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
జనగామ (వరంగల్) : ప్రేమ వ్యవహారంలో వచ్చిన స్పర్థలు ఓ యువకుడిపై దాడికి దారితీశాయి. వరంగల్ జిల్లా జనగామ మండలం గానుగ పహాడ్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దండ జలంధర్‌ను రాత్రి సమయంలో కరుణాకర్, మరికొందరు స్నేహితులు బయటకు తీసుకెళ్లారు. అక్కడ జలంధర్‌పై కరుణాకర్ కత్తితో దాడి చేశాడు. అనంతరం వారు పరారవ్వగా పేగులు బయటపడిన స్థితిలో తీవ్ర గాయాలతో కరుణాకర్ ఇంటికి చేరుకుని కుప్పకూలిపోయాడు.
కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కరుణాకర్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కాగా, జలంధర్ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. జలంధర్ చెల్లెల్ని కరుణాకర్ ప్రేమించాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవలు జరిగి దాడికి దారితీసినట్టు తెలుస్తోంది.