లింగాలఘణపురం: జనగామ జిల్లా సాధన కోసం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారంతా రాజీనామాలు చేసి ఉద్యమ కా ర్యచరణ ప్రకటిస్తామని టీఆర్‌ఎస్ నాయకులు ప్రకటించారు. ఆదివారం మండల కేంద్రంలో ని గౌడ సంఘం భవనంలో జే ఏసీ నాయకుడు బోయిని రా జు, సర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి శ్రీనువాసు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మధు విలేకరులతో మాట్లాడారు. జనగామ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే సాగుతున్న ఉద్యమంలో తాము కూడా భాగస్వాములమవుతామన్నారు. సమావేశంలో సర్పంచులు విజయ్‌భాస్కర్, మ దార్, మల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రేగు అంజయ్య,తదితరులు పాల్గొన్నారు.
పటేల్‌గూడెంలో రాస్తారోకో
జనగామ జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జనగామ - సూర్యాపేట రోడ్డులో పటేల్‌గూడెం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కార్యక్రమం లో బీజేపీ మండలాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, జేఏసీ నాయకుడు రాజు పాల్గొన్నారు.