బతుకమ్మ..కబడ్డీ ఆటలు.. రాస్తారోకో
జోరు వానలో జనగామ జిల్లా కోసం నిరసనలు
జనగామ : జనగామ జిల్లా చేయాలనే ఆకాంక్ష ఎదుట జోరువాన సైతం అడ్డుకోలేకపోయింది. మహిళలు.. కుల సంఘాలతో హన్మకొండ-వరంగల్ జాతీయ రహదారి అట్టుడికిపోయింది. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యం లో బుధవారం జరిగిన నిరసన, ఆందోళన కా ర్యక్రమాలకు మహిళా సంఘాలతో పాటు రెడ్డి కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ము న్సిపల చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఎంపీ పీ యాదగిరిగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు బాల్నె సిద్దులు, బండ యాదగిరిరెడ్డి, కన్నారపు ఉపేం దర్, వంగ శ్రీకాంత్‌రెడ్డి, తిప్పారపు ఆనంద్, ఉ డుగుల నర్సిహులు, లెనిన్, రావెల రవిలు జేఏ సీ ఉద్యమంలో కలిసి జిల్లా ఏర్పాటుకు ముం దుకువచ్చారు. ఆర్‌ఈండ్‌బీ అతిథి గృహం నుం చి నెహ్రూ పార్కు మీదుగా భారీ ర్యాలీతో ఆర్టీ సీ చౌరస్తాకు చేరుకున్నారు.
మహిళలు బతుక మ్మ ఆటలు ఆడగా.. యువకులు కబడ్డీ ఆడి త మ జిల్లా ఆకాంక్షను తెలిపారు. సీఐలు చెన్నూరి శ్రీనివాస్, తిరుపతి, కరణాసాగర్‌రెడ్డితో పాటు సబ్‌డివిజన్‌లోని పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. జాతీయ రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో వాహనాలు ఎ క్కడికక్కడే నిలిచిపోయాయి. యువకులు తొడకొట్టి జిల్లా సాధిస్తామని శపథం చేశారు. పోలీస్ ఫోర్స్‌తో హైదరాబాద్ వైపు వెళుతున్న బస్సు ను అడ్డుకోవడంతో సీఐ వచ్చి పంపించారు. జ నగామ జిల్లా కాకుండా, యాదాద్రిలో కలిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.