- రోడ్డుపై భైఠాయిస్తున్న ఉద్యమ కారులు
- పదికిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
జనగామ: వరంగల్ జిల్లా జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో అధికారపార్టీ నేతలతో పాటు విపక్షాల నేతలు. వ్యాపార వర్గాలు, కార్మిక, విద్యార్థివర్గాలతో పాటు పలు సంఘాలు పాల్గొన్నాయి. జిల్లా ప్రకటించాలని దాదాపు పదివేల మంది సకల జనులు భారీ ర్యాలీగా జనగామ చౌరస్తా వద్దకు వచ్చారు. క్రమ క్రమంగా పెద్ద ఎత్తున జనం రావడంతో జాతీయ రహదారిపై మూడు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు పది కిలో మీటర్ల మీర వాహనాలు నిలిచిపోయాయి. మాజీ టీసీసీపీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రోడ్డుపై బైటాయించారు. జనగామను జిల్లాగా ప్రకటించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మహాధర్నా భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు దశలవారీగా పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.