జనగామ: తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేయదలచిన నాయకులు అంతర్గతంగా కార్యాచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో బరిలో నిలబడటానికి నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనగామ నియోజక వర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతు తెలుపుదామని జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. పార్టీ జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి.. రెండు రోజుల క్రితం నర్మెట్ట జడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్ తో ఫోన్‌లో మాట్లాడారు. దాని సారాంశం ఏంటంటే..
జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలబడితే మద్దతు తెలుపుదామని సంపత్ రెడ్డి.. జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్‌తో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని స్థానికుడంటూ పేర్కొంటూ.. సపోర్టు చేద్దామని అనుకున్నారు. నియోజక వర్గంలో ఉన్న 8 మండలాల నుంచి జడ్పీటీసీ, ఎంపీపీలతో కలిసి ఓ రిప్రజెంటేషన్‌ని సీఎం కేసీఆర్‌కి పంపించాలని మాట్లాడుకున్నారు. చేర్యాల, మద్దురు, దులిమిట, కొమురవేల్లి నాలుగు మండలాల నుంచి అభ్యర్థులు రాకపోవచ్చని సంపత్ రెడ్డి ఫోన్‌లో శ్రీనివాస్‌కు చెప్పారు.
'ఒకవేళ జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాకుండా పోచంపల్లి శ్రీనివాస్‌కు సీటు ఇచ్చినా అభ్యంతరం లేదు. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డి సార్ కు ఇవ్వమని అడుగుదాం. నువు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ కు ఫోను చెయ్యి, మళ్ళీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు. సారు తోటి మంచిగా మాట్లాడు, మీకు అంతా అనుకూలంగా ఉంటది అందరూ ఒకే అంటారు అని చెప్పు. నేను నర్మెట ZPTC ఫోన్ చేస్తాడు అని చెప్పిన. మన తమ్ముడే, రాజేశ్వర్ రెడ్డి సార్ అంటే పడి చస్తాడు అని చెప్పిన, నువ్వు కూడా అదేవిధంగా మాట్లాడు' అని సంపత్ రెడ్డి నర్మెట్ట జడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్‌తో మాట్లాడారు.
ఇదీ చదవండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment