Sampath Reddy
-
అతని మృతికి కడియం శ్రీహరే కారణం : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
హనమకొండ: జనగామ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, చిల్పూరు జెడ్పీటీసీ పాగాల సంపత్‌రెడ్డి మృతికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరే కారణమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పలు ఆరోపణలు చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ విజయోత్సవ సభలో కడియం ఒక్కొక్కరికి బూత్‌ల వారీగా నాయకులను సభలో నిలబెట్టి మీ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటూ అవమానపర్చారన్నారు. అదే క్రమంలో పాగాల సంపత్‌రెడ్డి గ్రామం రాజవరం గురించి మాట్లాడుతూ ‘నువ్వు చిల్పూరు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్‌గా ఉన్నావు, నీ గ్రామంలోనే ఓట్లు తక్కువ వచ్చాయి’ అని అవమానకరంగా మాట్లాడాడన్నారు.సంపత్‌రెడ్డి మనోవేదనతో సాయంత్రం మృతిచెందాడని, ఆయన చావుకు ముమ్మాటికీ కడియం కారణమన్నారు. చివరకు జనగామలో నిర్వహించిన సంతాపసభలో సైతం సంపత్‌రెడ్డి గురించి కాకుండా ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయాలు మాట్లాడిన చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు. -
గుండెపోటుతో బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ మృతి
సాక్షి, జనగామ: జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. హన్మకొండలోని చైతన్యపురిలోని నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సంపత్‌రెడ్డిని నగరంలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే సంపత్‌రెడ్డి మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో సంపత్‌రెడ్డి కుమారుడు మృతి చెందాడు. ఇటుక బట్టీల వ్యాపారం చేసే సంపత్‌రెడ్డి 2004లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో చిల్పూర్ మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. తర్వాత జెడ్పీ చైర్మన్ అయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా ఉంటూనే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంపత్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన రాజవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మృతదేహాన్ని స్వగ్రామం రాజవరానికి తీసుకెళ్లి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు నివాళులర్పించనున్న కేసీఆర్.. జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జిల్లా జెడ్పీచైర్మన్ సంపత్‌రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మంగళవారం కేసీఆర్ జనగామకు వెళ్లి సంపత్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. ఒకే ఏడాదిలో రెండో జెడ్పీచెర్మన్.. ఇదే ఏడాది జూన్‌లో ములుగు జిల్లా జెడ్పీచైర్మన్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి చెందారు. ఈయన కూడా బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో నడిచిన వారిలో ఒకరు. జగదీష్ మృతి చెందినపుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన నుంచి కోలుకోక ముందు తొలి నుంచి పార్టీలో ఉన్న మరో జెడ్పీచైర్మన్, జిల్లా అధ్యక్షుడిని సంపత్‌రెడ్డి రూపంలో కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీ వర్గాలను కలవర పరుస్తోంది. ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు -
'పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతు తెలుపుదాం..' జనగామ జడ్పీ ఛైర్మన్ ఆడియో లీక్..
జనగామ: తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయదలచిన నాయకులు అంతర్గతంగా కార్యాచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో బరిలో నిలబడటానికి నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనగామ నియోజక వర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతు తెలుపుదామని జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. పార్టీ జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి.. రెండు రోజుల క్రితం నర్మెట్ట జడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడారు. దాని సారాంశం ఏంటంటే.. జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలబడితే మద్దతు తెలుపుదామని సంపత్ రెడ్డి.. జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్‌తో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని స్థానికుడంటూ పేర్కొంటూ.. సపోర్టు చేద్దామని అనుకున్నారు. నియోజక వర్గంలో ఉన్న 8 మండలాల నుంచి జడ్పీటీసీ, ఎంపీపీలతో కలిసి ఓ రిప్రజెంటేషన్‌ని సీఎం కేసీఆర్‌కి పంపించాలని మాట్లాడుకున్నారు. చేర్యాల, మద్దురు, దులిమిట, కొమురవేల్లి నాలుగు మండలాల నుంచి అభ్యర్థులు రాకపోవచ్చని సంపత్ రెడ్డి ఫోన్లో శ్రీనివాస్‌కు చెప్పారు. 'ఒకవేళ జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాకుండా పోచంపల్లి శ్రీనివాస్‌కు సీటు ఇచ్చినా అభ్యంతరం లేదు. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డి సార్ కు ఇవ్వమని అడుగుదాం. నువు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ కు ఫోను చెయ్యి, మళ్ళీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు. సారు తోటి మంచిగా మాట్లాడు, మీకు అంతా అనుకూలంగా ఉంటది అందరూ ఒకే అంటారు అని చెప్పు. నేను నర్మెట ZPTC ఫోన్ చేస్తాడు అని చెప్పిన. మన తమ్ముడే, రాజేశ్వర్ రెడ్డి సార్ అంటే పడి చస్తాడు అని చెప్పిన, నువ్వు కూడా అదేవిధంగా మాట్లాడు' అని సంపత్ రెడ్డి నర్మెట్ట జడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్‌తో మాట్లాడారు. ఇదీ చదవండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు -
యులిప్‌లపై 15–16 శాతం రాబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యులిప్‌లపై రాబడి 15–16 శాతం వరకూ ఉంటోందని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలియజేసింది. గడిచిన 15 ఏళ్లలో సగటున ఈ స్థాయి రాబడి వస్తోందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సంపత్ రెడ్డి మంగళవారమిక్కడ మీడియాతో చెప్పారు. ‘2016–17లో యులిప్‌ల మార్కెట్ భారత్‌లో రూ.4.1 లక్షల కోట్లుంది. 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో వృద్ధి ఉంటుందని అంచనా. జీవిత బీమా పాలసీల్లో యులిప్‌ల వాటా 60 శాతం దాకా ఉంటుంది. యులిప్‌ల వృద్ధి రేటు జీవిత బీమా పాలసీల కంటే అధికంగా నమోదు చేస్తోంది. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఆరు రకాల యులిప్‌లు అందుబాటులో ఉన్నాయి’ అని వెల్లడించారు. కరెక్షన్ ఉండొచ్చు: స్టాక్ మార్కెట్లో కరెక్షన్ ఉండొచ్చని సంపత్ రెడ్డి తెలిపారు. ‘రానున్న రోజుల్లో ఐటీ రంగం బాగుంటుంది. ఫార్మా ఏడాదిన్నరగా ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రైవేటు బ్యాంకింగ్ రంగం మంచి పనితీరు కనబరుస్తోంది’ అని వివరించారు. కాగా, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా లైఫ్ గోల్ అష్యూర్ పేరుతో నూతన యులిప్ పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీ గడువు ముగిసిన తర్వాత 1.35%గా ఉన్న ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలను మినహాయించి మోర్టాలిటీ చార్జీలను వెనక్కి చెల్లిస్తారు. అది కూడా యూనిట్ల రూపంలో అందజేస్తారు. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు ఈ ఆన్లైన్ పాలసీ తీసుకోవచ్చు. -
రైతన్నను వెంటాడుతున్న అప్పులు
నంగునూరు/తూప్రాన్ : భూగర్భజలాలు ఎండి పంటలు దక్కక పోవడంతో చేసిన మయ అప్పులు ఎలా తీర్చాలో కలత చెంది ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహ త్యకు పాల్పగా.. మరో రైతు గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలు జిల్లాలోని నంగునూరు, తూప్రాన్ మండలాల్లో మంగళవారం చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. నం గునూరు మండలంలోని సిద్ధన్నపేటకు చెందిన బోడ సంపత్‌రెడ్డి (32) తనకున్న మూడెకరాల్లో వ్య వసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న పొలం పక్కనే వాగు ఉండడంతో రైతు మూ డు బోర్లు వేయించాడు. మూడింటిలో నీరు పడడంతో మొక్కజొన్నతో పాటు కూరగాయలను సాగు చేశాడు. ప్రతిరోజూ పండే కూరగాయలను సైకిల్‌పై తిరుగుతూ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో విక్రయించేవా డు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోయాయి. కోత కొచ్చిన పంటలకు తోడు మొక్కజొన్న పంటకు నీరందకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. ఇటీవల కా లంలో పంట పెట్టుబడులు, బోర్ల వేసేందుకు, కుటుంబ పోషణ తదితరాల కోసం సుమారు రూ. 3 లక్షల వరకు అప్పుచేశాడు. అయితే వీటి ఎలా తీ ర్చాలంటూ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉద యం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన సంపత్‌రెడ్డి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నా డు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగు పొరుగు పొ లాల రైతులు బాధిత కుటుంబ సభ్యులకు తెలిపి చి కిత్స నిమిత్తం సిద్దిపేటకు తరలించాడు. ఈ క్ర మం లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవా రం సంపత్‌రెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య మం గవ్వ, కుమారుడు రమణారెడ్డి, కుమార్తె అశ్వితలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మృతుడి భార్య మంగవ్వ ఫిర్యాదు మేరకు రాజ్‌గోపాల్‌పేట ఎస్ఐ గోపాల్‌రావు కేసు నమోదు చేసుకు ని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆగిన రైతు గుండె తూప్రాన్ : ఎండిన పంటలను చూసిన ఓ రైతన్న గుండె ఆగింది. ఈ సంఘటన మండలంలోని ఘనపూర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పసుల చంద్రయ్య (58)కు ఎకర పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. తన కున్న పొలంలో మూడు బోర్లు వేశాడు. కానీ వాటిల్లో నీరు పడలేదు. దీంతో ఖరీఫ్‌లో సాగుచేసిన వరి పంట కూడా చేతికందక ఎండిపోయింది. ఈ క్రమంలో పంటల పెట్టుబడు లు, కుమార్తె వివాహం, బోర్లు వేసేందుకు సుమారు రూ. 2 లక్షలకు పైగా అప్పు చేశాడు. ఏయేటికి ఆ యేడు పంటలు వస్తాయి.. అప్పులు తీరుద్దామనుకోవడంమే తప్ప తీర్చలేకపోతున్నాడు. ఈ క్రమం లో రుణదాతలు కూడా అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో అంతుపట్టక ఇదే విషయాన్ని కుటుంబ సభ్యుల వద్ద తరచూ ప్రస్తావిస్తూ కలత చెందే వాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుండెలో నొప్పి వస్తోందని కుటుం బీకులకు తెలిపాడు. వారు చంద్రయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. త మకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుం బాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.