హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యులిప్‌లపై రాబడి 15–16 శాతం వరకూ ఉంటోందని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలియజేసింది. గడిచిన 15 ఏళ్లలో సగటున ఈ స్థాయి రాబడి వస్తోందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సంపత్ రెడ్డి మంగళవారమిక్కడ మీడియాతో చెప్పారు. ‘2016–17లో యులిప్‌ల మార్కెట్ భారత్‌లో రూ.4.1 లక్షల కోట్లుంది. 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో వృద్ధి ఉంటుందని అంచనా. జీవిత బీమా పాలసీల్లో యులిప్‌ల వాటా 60 శాతం దాకా ఉంటుంది. యులిప్‌ల వృద్ధి రేటు జీవిత బీమా పాలసీల కంటే అధికంగా నమోదు చేస్తోంది. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఆరు రకాల యులిప్‌లు అందుబాటులో ఉన్నాయి’ అని వెల్లడించారు.
కరెక్షన్ ఉండొచ్చు: స్టాక్ మార్కెట్‌లో కరెక్షన్ ఉండొచ్చని సంపత్ రెడ్డి తెలిపారు. ‘రానున్న రోజుల్లో ఐటీ రంగం బాగుంటుంది. ఫార్మా ఏడాదిన్నరగా ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రైవేటు బ్యాంకింగ్ రంగం మంచి పనితీరు కనబరుస్తోంది’ అని వివరించారు. కాగా, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా లైఫ్ గోల్ అష్యూర్ పేరుతో నూతన యులిప్ పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీ గడువు ముగిసిన తర్వాత 1.35%గా ఉన్న ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలను మినహాయించి మోర్టాలిటీ చార్జీలను వెనక్కి చెల్లిస్తారు. అది కూడా యూనిట్ల రూపంలో అందజేస్తారు. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు ఈ ఆన్‌లైన్ పాలసీ తీసుకోవచ్చు.
యులిప్‌లపై 15–16 శాతం రాబడి
Published Wed, Mar 7 2018 12:59 AM | Last Updated on Wed, Mar 7 2018 12:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment