
హైదరాబాద్: ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలయాంజ్ తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ’రెస్పెక్ట్ సీనియర్ కేర్’ రైడర్‌ను ప్రవేశపెట్టింది. మూడు ప్లాన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రీమియం రూ. 700 నుంచి రూ. 7,500 వరకూ (జీఎస్‌టీ కాకుండా) ఉంటుందని సంస్థ తెలిపింది.
ప్లాన్‌ను బట్టి ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ సర్వీస్, స్మార్ట్ వాచ్ ఫాల్ డిటెక్షన్, ఫిజియోథెరపి.. నర్సింగ్ కేర్ తహా హోమ్ కేర్ సర్వీసులు, మెడికల్ టెలీ–కన్సల్టేషన్ సర్వీసులు మొదలైనవి ఈ రైడర్‌తో పొందవచ్చని కంపెనీ ఎండీ తపన్ సింఘెల్ తెలిపారు. 50 ఏళ్లు పైబడి, కంపెనీ అందించే బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వారు ఈ రైడర్‌ను ఎంచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment