
ఐదుగురు ఐఎస్ఐ ఏజెంట్ల ఎన్ కౌంటర్
వరంగల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
వరంగల్: వరంగల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఐదుగురు ఐఎస్ఐ ఏజెంట్లు హతమయ్యారు. వీరిలోనే కరడు గట్టిన ఐఎస్ఐ ఏజెంట్, నిత్యం పోలీసులపై దాడులకు పాల్పడిన కర్కశుడు వికారుద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. అతడితోపాటు సహచరులు సులేమాన్, జకీర్, అంజాద్, అనీఫ్ కూడా హతమయ్యారు. గతంలో ఐఎస్ సదన్ వద్ద పోలీసులపై జరిపిన కాల్పుల్లో వికారుద్దీన్ ప్రధాన నిందితుడు. ఈ కేసులోనే వికారుద్దీన్ అతడి గ్యాంగ్ను తొలుత చర్లపల్లి జైలులో వేసిన పోలీసు అధికారులు అక్కడ అతడి ఆగడాలు భరించలేక వరంగల్ జైలుకు తరలించారు.
ఓ కేసు నేపథ్యంలో అతడి గ్యాంగ్ను విచారించేందుకు వరంగల్ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్న క్రమంలో జనగామ-ఆలేరు మధ్య పోలీస్ ఎస్కార్ట్ వాహనంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలోనే వారు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గతంలో కూడా పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ఈ గ్యాంగ్ ప్రయత్నించింది. 2008 డిసెంబర్లో సంతోష్నగర్, 2009 మేలో శాలిబండ, ఫలక్ నుమావద్ద పోలీసులపై వికారుద్దీన్ గ్యాంగ్ దాడికి పాల్పడింది.
ఫోటోలు; సాక్షి టీవీ రిపోర్టర్