హైదరాబాద్: పోలీసులపై కాల్పులు అనగానే టక్కున గుర్తొచ్చేది వికారుద్దినే. అతడు పోలీసులనే టార్గెట్ చేసుకొని దాదాపు ఐదేళ్లపాటు దాడులు చేసి వారికి దొరకకుండా అరెస్టయ్యేవరకు ముప్పు తిప్పలు పెట్టాడు. అనేక సంచలనాలకు కేంద్ర బిందువయ్యాడు. 2008 డిసెంబర్ 3న తొలిసారి దాడి చేసి వికారుద్దీన్.. ఆ తర్వత వరుసగా 2009 మే 18న, 2010 మే 14న కాల్పులు జరిపాడు. ప్రతిసారి ఒకరిద్దరు పోలీసులను చంపేస్తూ వచ్చిన వికారుద్దీన్ చివరికి పోలీసులకు చిక్కాడు. అతడిని తొలుత చర్లపల్లి జైలులో వేయగా అక్కడ అతడి ఆగడాలు ఎక్కువయ్యాయి. దీంతో అక్కడ కంట్రోల్ చేయలేక ఆరు నెలల కిందట వరంగల్ జైలుకు పంపించారు.
అయితే, అక్కడ కూడా వికారుద్దీన్ అలాంటి పనులే చేస్తున్నాడని, విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను బెదిరిస్తున్నాడని తెలిసింది. అతడు జైలు సిబ్బందిని వ్యక్తిగతంగా బెదిరిస్తుంటే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి జైలు అధికారులు తీసుకొచ్చారు. దీనిపై సీసీఎస్ ఆరా తీసిన పోలీసులు హత్య, హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. దీంతో మరోసారి అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించిన పోలీసులు హైదరాబాద్ విచారణకు తరలిస్తుండగా పోలీసులపై దాడులకు పాల్పడి పారిపోయే యత్నం చేశాడు. దీంతో ఎన్కౌంటర్ జరగడంతో అతడ కథ ముగిసింది.
ఖాకీలకే ముచ్చెమటలు పట్టించాడు..
Published Tue, Apr 7 2015 11:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM
Advertisement