నల్లగొండ : ఆలేరు మండలం టంగుటూరు శివారు ప్రాంతంలో గత నెల 7న జరిగిన వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ నిర్వహిస్తున్నట్లు నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లాకు చెందిన ఆర్‌ఎస్‌ఐ ఉదయ్ భాస్కర్ ఆలేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. ఘటన జరిగిన రోజు న ఆర్‌ఎస్‌ఐ ఉదయ్‌భాస్కర్ నేతృత్వంలో 16 మంది ఇతర పోలీసులతో కలిసి వరంగల్ సెంట్రల్ జైల్ నుంచి ఉదయం 7.55 గంటలకు 5 గురు రిమాండ్ ముద్దాయిలను నాంపల్లి 7వ మున్సిఫ్ సెషన్స్ జడ్జి సమక్షంలో హాజరుపర్చిందుకు తీసుకెళ్తున్నారు.
మార్గంమధ్యలో వికారుద్దీన్ అకస్మాత్తుగా పోలీసుల వద్ద ఉన్న ఇన్సస్ రైఫిల్ లాక్కొని ఆర్‌ఎస్‌ఐపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపామని, ఈ కాల్పుల్లో ఐదుగురు రిమాండ్ ఖైదీలు కూడా మృతిచెందినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై 7న ఆలేరు తహసీల్దారు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు బహిరంగ వి చారణ నిర్వహిస్తున్నందునా ఎవరైనా సమాచారం చెప్పాలనుకుంటే విచారణకు హాజరుకావాలని ఆర్డీవో ప్రకటనలో కోరారు.
రేపు వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ
Published Wed, May 6 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement