
అది బూటకపు ఎన్‌కౌంటరే
ఆలేరు ఘటనపై విచారణకు ఎంఐఎం డిమాండ్
హైదరాబాద్: వరంగల్ జిల్లా ఆలేర్ వద్ద వికారుద్దీన్‌తోపాటు మరో నలుగురిపై పోలీసులు జరిపిన కాల్పులు కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటరేనని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. దీనిపై సీబీఐ లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం సాయంత్రం యునెటైడ్ ముస్లిం ఫోరం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహీం ఖురేషీ, ముస్లిం మతపెద్దలతో కలిసి సీఎం కేసీఆర్‌ను సచివాలయంలో ఒవైసీ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 17 మంది పోలీసులు ఉన్న వాహనంలో చేతులు కాళ్లు కట్టేసిన ఐదుగురు నిందితులు కాల్పులు జరిపారన్నది హాస్యాస్పదమన్నారు.