Vikaruddin
-
‘మక్కా’ నుంచే మారాడు..
సాక్షి, సిటీబ్యూరో: వికారుద్దీన్ అహ్మద్... తెహరీక్–గల్బా–ఏ–ఇస్లాం (టీజీఐ) లోకల్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి... మరో నలుగురితో కలిసి మాడ్యుల్ తయారు చేసి... 2009–10 మధ్య ఏడాదిన్నర కాలంలో మూడుసార్లు పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఉగ్రవాది ఇతడు. హైదరాబాద్‌తో పాటు గుజరాత్‌లోనూ అనేక నేరాలు చేసిన వికార్... ఉగ్రవాద బాటపట్టడానికి ‘మక్కా కాల్పులే’ కారణం. 2006 మే 18న మక్కా మసీదులో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య తొమ్మిది అయినప్పటికీ... ఘటనాస్థలిలో చనిపోయింది ఐదుగురు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దర్స్గా జిహాద్ ఏ షెహదత్ (డీజేఎస్) అనే సంస్థలో పని చేస్తున్న వికారుద్దీన్ ఈ ఘటనతో పోలీసులపై కక్ష పెంచుకున్నాడు. ఓల్డ్ మలక్‌పేట ప్రాంతానికి చెందిన ఇతడు కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సులేమాన్ తదితరులతో కలిసి ముఠా కట్టి హఠాత్తుగా 2008 డిసెంబరు 3న సంతోష్‌నగర్‌లో ప్రత్యక్షమై నిఘా విభాగం అధికారులపై కాల్పులు జరిపాడు. ఆపై టీజీఐ పేరులో ఏకంగా సంస్థనే ఏర్పాటు చేసి 2009 మే 18న ఫలక్‌నుమాలో, మరికొన్ని రోజులకు శాలిబండలో హోంగార్డు బాలస్వామి, కానిస్టేబుల్ రమేష్‌లను పొట్టనపెట్టుకున్నాడు. ‘మక్కా కాల్పులకు’ ప్రతీకారంగా అంటూ పోలీసులను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ గ్యాంగ్‌ను 2010 జూలైలో అరెస్టు చేసిన పోలీసులు వరంగల్ కారాగారానికి తరలించారు. 2015 ఏప్రిల్‌లో విచారణ నిమిత్తం నగరానికి తీసుకువస్తుండగా పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించగా... పోలీసులు జరిపిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు హతమయ్యారు. ‘మక్కా’ కారణంగానే ఐఎం విధ్వంసం.. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్‌ను రెండుసార్లు టార్గెట్‌గా చేసుకుంది. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో, 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ల వద్ద విధ్వంసాలు సృష్టించింది. 2002 నుంచి ఐఎం దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడింది. ఈ సంస్థలో మీడియా సెల్ ఇన్చార్జ్గా వ్యవహరించిన పుణే వాసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన్సూర్ అస్ఫర్ పీర్భాయ్ బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో ఎథికల్ హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మక్కా పేలుడు జరిగినప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్న అతను మసీదు వద్దకు వెళ్ళి చూసి వచ్చాడు. ఆ తర్వాత ఐఎంకు చెందిన కీలక ఉగ్రవాదులు రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్ తదితరుతో పుణేలో సమావేశమై ‘భవిష్యత్తు కార్యాచరణ’పై చర్చించారు. ఇందులో పాల్గొన్న పీర్భాయ్ ‘మక్కా’ ఉదంతాన్ని వివరించడంతో రియాజ్ అందుకు ప్రతీకారంగా హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుందామని నిర్ణయించాడు. 2007 ఆగస్టులో సిటీకి వచ్చిన రియాజ్, అనీఖ్, అ క్బర్ అదే నెల 25న జంట పేలుళ్లకు పాల్పడి పారిపోయారు. ప్రస్తు తం ఈ కేసు విచారణ సైతం తుది దశకు చేరుకుంది. ఈ కేసునూ మక్కా పేలుడు కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థే ఇన్వెస్టిగేట్ చేయడం కొసమెరుపు. ఈ కేసు కూడా అనేక చేతులు మారిన తర్వాతే ఎన్ఐఏకే చేరింది. -
వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
ఎమ్మెస్పీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హన్మకొండ: ముస్లిం యువకులను హత్య చేయించిన హంతకుడు సీఎం కేసీఆర్ అని మహాజన సోషలిస్టు పార్టీ (ఎమ్మెస్పీ) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని, మక్కామసీదు అభివృద్ధికి నిధులు కేటాయించాలని, వికారుద్దీన్ సహా నలుగులు ముస్లిం యువకుల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ అధ్వర్యంలో ముస్లింలతో కలిసి శ నివారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో పోలీసులను హతమార్చినందుకు ప్రతీకారంగా వికారుద్దీన్‌తో పాటు నలుగురిని ఎన్కౌంటర్ చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చి హత్య చేయించిన హంతకుడు సీఎం కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కేటీఆర్‌ను తప్పించైనా ఆ ఇద్దరికి మంత్రి పదవులివ్వాలి కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా దళిత ఎమ్మెల్యేలైన కొప్పుల ఈశ్వర్, రసమరుు బాలకిషన్‌లకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. అవసరమైతే కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించైనా, ఈ నెల 20లోగా మంత్రివర్గ కూర్పు చేపట్టాలన్నారు. -
రేపు వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ
నల్లగొండ : ఆలేరు మండలం టంగుటూరు శివారు ప్రాంతంలో గత నెల 7న జరిగిన వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ నిర్వహిస్తున్నట్లు నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లాకు చెందిన ఆర్ఎస్ఐ ఉదయ్ భాస్కర్ ఆలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. ఘటన జరిగిన రోజు న ఆర్ఎస్ఐ ఉదయ్‌భాస్కర్ నేతృత్వంలో 16 మంది ఇతర పోలీసులతో కలిసి వరంగల్ సెంట్రల్ జైల్ నుంచి ఉదయం 7.55 గంటలకు 5 గురు రిమాండ్ ముద్దాయిలను నాంపల్లి 7వ మున్సిఫ్ సెషన్స్ జడ్జి సమక్షంలో హాజరుపర్చిందుకు తీసుకెళ్తున్నారు. మార్గంమధ్యలో వికారుద్దీన్ అకస్మాత్తుగా పోలీసుల వద్ద ఉన్న ఇన్సస్ రైఫిల్ లాక్కొని ఆర్ఎస్ఐపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపామని, ఈ కాల్పుల్లో ఐదుగురు రిమాండ్ ఖైదీలు కూడా మృతిచెందినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై 7న ఆలేరు తహసీల్దారు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు బహిరంగ వి చారణ నిర్వహిస్తున్నందునా ఎవరైనా సమాచారం చెప్పాలనుకుంటే విచారణకు హాజరుకావాలని ఆర్డీవో ప్రకటనలో కోరారు. -
రీ పోస్టుమార్టానికి హైకోర్టు నో
వికారుద్దీన్ తండ్రి, మరికొందరి అనుబంధ పిటిషన్లు కొట్టివేత సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన వికారుద్దీన్, మరో నలుగురి మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలంటూ వికారుద్దీన్ తం డ్రి, మరికొందరు చేసిన అభ్యర్థనలను హై కోర్టు తోసిపుచ్చింది. అటువంటి ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదంటూ, వారు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రధాన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించడంతో పాటు, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వికారుద్దీన్ తండ్రి ఎం.డి.అహ్మద్‌తో పాటు మృతుల సంబంధీకులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇదే వ్యవహారానికి సంబంధించి మరో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నిం టినీ మంగళవారం న్యాయమూర్తి మరోసారి విచారించారు. -
వికార్ ఎన్‌కౌంటర్‌పై నివేదికలివ్వండి
డీజీపీకి జాతీయ హక్కుల కమిషన్ ఆదేశం మెజిస్టీరియల్, పోస్ట్‌మార్టమ్, ఫోరెన్సిక్ వివరాలివ్వండి హైదరాబాద్: వికారుద్దీన్ ముఠా ఎన్కౌంటర్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ, పోస్ట్‌మార్టమ్, ఫోరెన్సిక్ నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ర్ట డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసులకూ గాయాలయ్యాయని చెబుతున్నందున, దానికి సంబంధించిన నివేదికను కూడా అందజేయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పేర్కొన్నారు. గురువారం ఇక్కడి ఎంసీఆర్ హెచ్ఆర్డీ భవనంలో బాలకృష్ణన్ అధ్యక్షతన సభ్యులు సైరియర్ జోసెఫ్, జస్టిస్ డి .మురుగేశన్, ఎస్పీ సిన్హాతో కూడిన పూర్తిస్థాయి కమిషన్ ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వాదనలను కమిషన్ ఆలకించింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, పక్కా ప్రణాళిక ప్రకారమే వికార్, అతని అనుచరులను కాల్చి చంపారని వికార్ తండ్రి ఎండీ అహ్మద్‌తోపాటు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కమిషన్ విచారణ సందర్భంగా వాదించారు. అయితే తమ ఆయుధాలు లాక్కొని దాడి చేసేందుకు ప్రయత్నించడం వల్లనే ఆత్మరక్షణకు కాల్పులు జరపాల్సి వచ్చిందని వరంగల్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారు ఎంతో ప్రమాదకారులని, గతంలో నలుగురు పోలీసులను హత్య చేశారని కమిషన్ దృష్టికి తెచ్చారు. కాగా, మృతుల్లో ఒకరైన విచారణ ఖైదీ జకీర్‌ను ఒక రోజు ముందుగానే హైదరాబాద్ నుంచి వరంగల్‌కు తరలించారని వికారుద్దీన్ తండ్రి పేర్కొనగా, దీని పూర్వాపరాలపై కమిషన్ ఆరా తీసింది. ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పరిధిలో దీని విచారణ కొనసాగుతున్నందున, మళ్లీ విచారణ అవసరం లేదని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆ కేసును కూడా తమకే బదిలీ చేయాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. పోలీసుల ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎన్కౌంటర్ చోటుచేసుకున్నదన్న వికార్ తండ్రి వాదనపై కమిషన్ స్పందిస్తూ.. ఏ ప్రాతిపదికన ఈ వాదన చేస్తున్నారని ప్రశ్నించింది. ఎన్కౌంటర్ హతుల ఫొటోలను చూస్తేనే అర్థమవుతోందని.. కాళ్లకు, చేతులకు బేడీలు వేసి సీటుకు తాళం వేశారని, అలాంటి పరిస్థితిలో 17 మంది పోలీసులుండగా ఆయుధాలు లాక్కోవడం అసాధ్యమని వికార్ తండ్రి పేర్కొన్నారు. తనను అంతమొందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ మూడేళ్ల క్రితమే వికారుద్దీన్ కోర్టుకు విన్నవించుకున్నట్లు వారి తరఫు న్యాయవాది చెప్పారు. తనను మరో జైలుకు తరలించాలని కూడా కోరినట్లు గుర్తుచేశారు. నేరస్తులు, స్మగ్లర్లు, టైస్టులు, నక్సలైట్లకు కూడా మానవహక్కులు ఉంటాయని, వాటిని కాలరాసి ఏకంగా అంతమొందించడం ఎంతమాత్రం సరికాదని పౌర హక్కుల సంఘం నేతలు రమా మెల్కొటే, జయవింధ్యాల, ఎస్. జీవన్‌కుమార్ తదితరులు కమిషన్ దృష్ఠికి తీసుకొచ్చారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రావాలని, అందుకు దారితీసిన కారణాలు తెలియాలని తాము కూడా కోరుకుంటున్నట్లు ఐజీ నవీన్‌చంద్ తెలిపారు. రైతు ఆత్మహత్యలపై కూడా.. రాష్ట్రంలో చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యలు, వారి కుటుంబాలకు అందిన సహాయం, పరిహారం తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. గురువారం బహిరంగ విచారణ సందర్భంగా మెదక్ జిల్లా గజ్వేలు, తొగుట, సిద్దిపేట, వరంగల్ జిల్లా జనగామ మండలం నుంచి ఆత్మహత్యలు చేసుకున్న ఏడు రైతుకుటుంబాల సభ్యులు కమిషన్ ఎదుట హాజరయ్యారు. రాష్ర్టంలో 748 మంది ైరె తులు ఆత్మహత్యలు చేసుకోగా వారి సంఖ్య 96 మాత్రమేనని అధికారులు పేర్కొనడం సరికాదని వివిధ పౌరహక్కుల నేతలు కమిషన్ ముందు అభ్యంతరాన్ని వ్యక్తంచేశారు. కాగా రైతు కుటుంబాల తరఫున ఎస్. ఆశాలత (రైతు స్వరాజ్యవేదిక), కె.సజయ (కేరింగ్ సిటి జన్స్ కలెక్టివ్), జీవన్‌కుమార్ (మానవ హక్కుల వేదిక), ఓపీడీఆర్, రైతు ఆత్మహత్య బాధితుల కుటుంబాల వేదిక, తెలంగాణ రైతు రక్షణ సమితి, మహిళా కిసాన్ అధికార్ మంచ్‌ల ప్రతినిధులు తమ వాదనను వినిపించారు. ఆయా అంశాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా వివరణనిచ్చారు. రైతులు పంట నష్టపోయినపుడు నిబంధనల ప్రకారం సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. హైకోర్టు విచారణ 28కి వాయిదా వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై విచారణను ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖ లు చేసేందుకు గడువు కావాలని రాష్ర్ట ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించడంతో పాటు, కేసు దర్యాప్తును సీబీ ఐకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వికార్ తండ్రి ఎండీ అహ్మద్‌తో పాటు మృతుల సంబంధీకులైన మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను గతవారం విచారించిన కోర్టు.. కౌం టర్ దాఖలు చేయాలంటూ రాష్ర్ట ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై పీఎస్‌లో ఫిర్యాదు
-
ఆలేరు పీఎస్ లో వికారుద్దీన్ తండ్రి ఫిర్యాదు
నల్లగొండ : వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై ఆలేరు పోలీస్ స్టేషన్లో అతని తల్లిదండ్రులు శనివారం ఫిర్యాదు చేశారు. వికారుద్దీన్ తండ్రి మహ్మమద్ అహ్మద్ తో పాటు ఎన్కౌంటర్లో మృతి చెందిన అనీఫ్ సోదరుడు కూడా పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, పోలీసులతో పాటు ఎస్కార్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వికారుద్దీన్ తండ్రి డిమాండ్ చేశారు. కాగా వరంగల్-నల్లగొండ జిల్లా సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ అయిన విషయం తెలిసిందే. డీజేఎస్ వ్యవస్థాపకుడు, సిమి తీవ్రవాది వికారుద్దీన్ (38) తో పాటు అతని అనుచరులు సయ్యద్ అమ్జద్, ఎండీ జకీర్, ఎండీ హనీఫ్, జొహర్‌ఖాన్‌లు హతమయ్యారు. వరంగల్ జిల్లా సెంట్రల్ జైలునుంచి ఓ కేసు నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
అది బూటకపు ఎన్‌కౌంటరే
ఆలేరు ఘటనపై విచారణకు ఎంఐఎం డిమాండ్ హైదరాబాద్: వరంగల్ జిల్లా ఆలేర్ వద్ద వికారుద్దీన్‌తోపాటు మరో నలుగురిపై పోలీసులు జరిపిన కాల్పులు కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటరేనని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. దీనిపై సీబీఐ లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం యునెటైడ్ ముస్లిం ఫోరం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహీం ఖురేషీ, ముస్లిం మతపెద్దలతో కలిసి సీఎం కేసీఆర్‌ను సచివాలయంలో ఒవైసీ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 17 మంది పోలీసులు ఉన్న వాహనంలో చేతులు కాళ్లు కట్టేసిన ఐదుగురు నిందితులు కాల్పులు జరిపారన్నది హాస్యాస్పదమన్నారు. -
వికార్ గ్యాంగ్‌కు అంత్యక్రియలు
హైదరాబాద్‌లో భారీ బందోబస్తు నలుగురి మృతదేహాలకు వేర్వేరు చోట్ల అంత్యక్రియలు భారీగా తరలివచ్చిన పాతబస్తీ ప్రజలు హైదరాబాద్: వరంగల్, నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలు బుధవారం సాయంత్రం పూర్తయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన వికారుద్దీన్, సయ్యద్ అమ్జద్, మహ్మద్ జకీర్, మహ్మద్ హనీఫ్ మృతదేహాలను అంబులెన్స్‌లో సాయంత్రం 4.45 గంటలకు వరంగల్ నుంచి ఓల్డ్‌మలక్‌పేటలోని వికారుద్దీన్ ఇంటికి భారీ బందోబస్తు మధ్య పోలీసులు తీసుకువచ్చారు. అనంతరం దాదాపు గంటన్నరపాటు బంధువుల సందర్శనార్థం మృతదేహాలను అక్కడే ఉంచారు. 6.30కి వాహెద్‌నగర్‌లోని నూర్మసీద్కు తరలించి ప్రార్థనలు జరిపారు. అక్కడి నుంచి 7.40కి యాత్రగా నగరంలోని వివిధ శ్మశాన వాటికలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. హనీఫ్ మృతదేహానికి కాస్త ఆలస్యంగా ముషీరాబాద్‌లో అంత్యక్రియలు చేశారు. అహ్మదాబాద్ నుంచి ఆయన తల్లి, సోదరులు వచ్చే వరకు ఆగారు. నగరంలో టెన్షన్.. టెన్షన్: వికారుద్దీన్ ఇంటి చుట్టూ దాదాపు వెయ్యి మంది పోలీసుల్ని మోహరించారు. మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల సూచనల మేరకు పోలీసులు రూట్‌మ్యాప్‌ను అనుసరించారు. అలాగే ఇతర ఉగ్రవాదుల ఇళ్ల వద్ద నుంచి కూడా శవయాత్రకు రూట్‌మ్యాప్‌ను ముందే నిర్దేశించారు. 2 జోన్ల పరిధిలోని ప్రాంతాలను పోలీసులు అడుగడుగునా పహారా కాశారు. మృతదేహాలను చూసేం దుకు బంధువులు, పాతబస్తీ ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ ఓల్డ్‌మలక్‌పేట నుంచి సంతోష్‌నగర్ వైపు, ఎంజీబీఎస్ నుంచి సుల్తాన్‌షాహీ వైపు రెండు మార్గాల్లో వేర్వేరు వాహనాల్లో మృతదేహాలను తరలించారు. బాధిత కుటుంబాలను మజ్లిస్ నేతలు పరామర్శించారు. కాగా, మహ్మద్ హనీఫ్ అంత్యక్రియలకు ముందు భౌతికకాయానికి మసీదులో ప్రార్థనలు చేయాల్సి ఉండగా అందుకు కొందరు ముస్లిం పెద్దలు నిరాకరించినట్లు సమాచారం. అలాగే మిగతావారి విషయంలో ఖననం చేయడానికి శ్మశాన వాటికల నిర్వాహకులు అభ్యంతరాలు చెప్పినా పోలీసుల జోక్యంతో ఆ ప్రక్రియ పూర్తయింది. కాగా, హనీఫ్ మృతదేహాన్ని నగరంలోని అతని అత్తగారింటికి తీసుకువచ్చిన పోలీసులపై, మీడియాపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఒక్కో మృతదేహం శరీరంలో 5 నుంచి 8 బుల్లెట్లు!
వరంగల్: వరంగల్-నల్లగొండ జిల్లా సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదుల శరీరాల్లో సగటున ఐదు నుంచి ఎనిమిది బుల్లెట్లు దిగాయి. పోలీసులకు మొదటి నుంచి కొరకరాని కొయ్యగా ఉన్న వికార్ అహ్మద్ దేహంలో ఎనిమిది బుల్లెట్లు ఉన్నాయి. వికారుద్దీన్ తలలో, ఛాతీలో బుల్లెట్లు దిగాయి. మిగిలిన నలుగురి దేహాల్లోనూ ఐదు చొప్పున బుల్లెట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. ఎన్కౌంటర్లో చనిపోయిన వికార్ అహ్మద్, సయద్ అమ్జద్, ఇజార్ ఖాన్, మహ్మద్ జకీర్, మహ్మద్ హనీఫ్ మృతదేహాలకు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇజార్‌ఖాన్ మృతదేహం ఎంజీఎంలోనే ఉంది. మిగిలిన నలుగురి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పకడ్బందీగా పోస్టుమార్టం బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కాకతీయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అధిపతి డాక్టర్ రాజు, ప్రొఫెసర్లు కృపాల్‌సింగ్, నాగమోహన్, ఇస్మాయిల్‌లో కూడిన 12 మంది వైద్య బృందం పోస్టుమార్టం ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టుమార్టం పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు. ఐదు మృతదేహాల పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. -
’నా భర్త మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్తా ’
-
నా భర్త మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్తా'
వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద అనీఫ్ భార్య, బంధువులు ఆందోళనకు దిగారు. ఎన్కౌంటర్లో హతమైన వికారుద్దీన్ గ్యాంగ్‌కు బుధవారం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అనీఫ్ మృతదేహాన్ని చూడటానికి పోలీసులు అనుమతించటం లేదని అనీఫ్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. సాక్ష్యాలు లేనందునే అనీఫ్‌ను ఎన్కౌంటర్ చేశారని, ఎన్‌కౌంటర్‌పై పూర్తి విచారణ జరిపించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆస్పత్రిలోకి రానివ్వకుండా పోలీసులు నెడుతున్నారని, తన భర్త మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్తానని ఆమె అన్నారు. కాగా ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, వారి నుంచి అనుమతి రాగానే బంధువులకు మృతదేహాలు అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
'వికార్ది.. గుజరాత్ నకిలీ ఎన్కౌంటర్లా ఉంది'
న్యూఢిల్లీ: వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వికారుద్దీన్ ఎన్కౌంటర్ గతంలో గుజరాత్లో చోటు చేసుకున్న నకిలీ ఎన్‌కౌంటర్‌ను పోలి ఉందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ బుధవారం న్యూఢిల్లీలో ఆరోపించారు. విచారణ జరిపితే కానీ నిజానిజాలు వెలుగులోకి రావని ఆయన అన్నారు. వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులోని టంగుటూరు శివారులో జాతీయ రహదారిపైనే మంగళవారం కాల్పు లు జరిగాయి. ఇందులో వికార్ అహ్మద్(29) అలియాస్ వికారుద్దీన్‌తోపాటు సయ్యద్ అమ్జద్(23), ఇజార్ ఖాన్(29), మహమ్మద్ జకీర్(32), మహమ్మద్ హనీఫ్(34) మృతి చెందా రు. పలు ఉగ్రవాద నేరాల్లో విచారణ ఖైదీలుగా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న వీరిని కోర్టు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని ఇప్పటికే వికారుద్దీన్ తండ్రి మహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎంజీఎంలో ప్రారంభమైన పోస్ట్‌మార్టం
వరంగల్ : వరంగల్ ఎన్కౌంటర్లో మృతి చెందిన వికారుద్దీన్ గ్యాంగ్‌కు ఎంజీఎంలో బుధవారం పోస్ట్‌మార్టం ప్రారంభమైంది. ఫోరెన్సిక్ నిపుణులు రాజు, కృపాల్ సింగ్, నాగమోహన్, ఇస్మాయిల్ బృందంతో పాటు, 8మంది వైద్యుల ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం జరుగుతోంది. ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. సుమారు పోస్ట్‌మార్టంకు అయిదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. పోస్ట్‌మార్టం నేపథ్యంలో ఎంజీఎం వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించనున్నారు. -
MGM వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు
-
పోలీసు..పంజా
పోలీసులు పంజా విసిరారు. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..ఐదుగురు కరుడుగట్టిన తీవ్రవాదులను మట్టుబెట్టారు. ప్రతి విషయానికి పోలీసులపై దూషణలు..అయినా వదిలేశారు. మరోమారు అదే తీరు..మూత్రవిసర్జనకు బస్సు ఆపడంతో ఎదురుతిరిగి పారిపోయే యత్నం.. అంతే తుపాకుల గర్జనతో ఆ ప్రాంతం మారుమోగింది. తీవ్రవాదులున్న బస్సు రక్తసిక్తమైంది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో టంగుటూరు గ్రామ రెవెన్యూ శివారులో మంగళవారం ఉదయం జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో డీజేఎస్ వ్యవస్థాపకుడు, సిమి తీవ్రవాది వికారుద్దీన్(38)తోపాటు అతని అనుచరులు సయ్యద్ అమ్జద్, ఎండీ జకీర్, ఎండీ.హనీఫ్, జొహర్‌ఖాన్‌లు హతమయ్యారు. వరంగల్ జిల్లా సెంట్రల్ జైలునుంచి ఓ కేసు నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి చెలరేగింది. - భువనగిరి/ ఆలేరు భువనగిరి/ ఆలేరు :ఆలేరు శివారులో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఐజీ నవీన్ చంద్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జైలులో ఉన్న డీజేఎస్ తీవ్రవాదులు వికారుద్దీన్, సిమి కార్యకర్తలు సయ్యద్ అమ్జద్, ఎండీ జకీర్, ఎండీ.అనీఫ్, జోహార్ఖాన్లను ఓ కేసు నిమిత్తం హైదరాబాద్‌లోని నాంపల్లి 7వ మెట్రోపాలిటన్ కోర్టుకు తీసుకెళ్లేందుకు ఉదయం 8.30 గంటల సమయంలో వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఎస్కార్ట్ వాహనంలో బయలుదేరారు. ఈ సమయంలో తీవ్రవాదులకు బందోబస్తుగా 18 మంది సిబ్బంది ఉన్నారు. వరంగల్ జిల్లా సరిహద్దు దాటి నాలుగు కిలోమీటర్లు రాగానే 09.20 గంటల సమయంలో తీవ్రవాదులు మూత్రవిసర్జన చేయాలంటూ పోలీసులను అడిగారు. ఇందుకు సమ్మతించిన పోలీసులు వారిని కిందికి దిగాలని కోరారు. అయితే ఈ సమయంలో పోలీసులపై తిరగబడ్డారు. అటు పోలీసులకు, ఇటు ఉగ్రవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 09.30 గంటల సమయంలో వికారుద్దీన్‌తో పాటు వెంటఉన్న వారు పోలీసుల వద్ద ఉన్న తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారికి ఆయుధాలు అందకుండా ప్రతిగా కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు తీవ్రవాదుల చనిపోయారని ఐజీ చెప్పారు. కాగా ఈ సంఘటనలో ఆర్ఎస్ఐ సోమన్న గాయపడినట్లు తెలిపారు. కాగా ఎన్కౌంటర్లో మృతిచెందిన వికారుద్దీన్‌కు సిమి, ఐఎస్ఐ, లష్కరేతోయిబాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వాహనంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు.. ఈ ఎన్కౌంటర్ వాహనంలో జరగడంతో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఐదుగురు తీవ్రవాదుల్లో ముగ్గురు కూర్చున్న సీట్లోనే కుప్పకూలగా.. ఇద్దరు సీట్ల మధ్య కిందపడిపోయారు. ఎస్కార్ట్ వాహనం రక్తపు మడుగుగా మారింది. బస్సు వెనుకభాగంలోనుంచి రక్తంధారగా కింద పడడంతో భూమిపై కొంతభాగం తడిసిపోయింది. వాహనం చాలాసేపు నిలిపి ఉంచడంతో మూడు చోట్ల రక్తం కిందికి కారింది. బయటపడిన బుల్లెట్లు ఎన్కౌంటర్ సందర్భంగా బుల్లెట్లు వాహనంలో నుంచి ఎగిరి బయటపడ్డాయి. పోలీసులు మృతదేహాలున్న వాహనాన్ని అక్కడినుంచి పోస్టుమార్టం కోసం తరలించిన తర్వాత అవి కిందపడి కనిపించాయి. అయితే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎస్కార్ట్ వాహనంలో పేలని బుల్లెట్లు కూడా పడి ఉన్నాయి. సంఘటన స్థలాన్ని సందర్శించిన అధికారులు ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని ఐజీ నవీన్‌చంద్, హైదరాబాద్, వరంగల్ రేంజ్ డీఐజీలు గంగాధర్, మల్లారెడ్డి, నల్లగొండ, వరంగల్ ఎస్పీలు కిషోర్, దుగ్గల్‌లు సందర్శించారు. అదే విధంగా భువనగిరి, డీఎస్పీ మోహన్‌రెడ్డి, ఆర్డీఓ ఎన్.మధుసూదన్‌లు కూడా అక్కడికి చేరుకుని పరిశీలించారు. మీడియాపై పోలీసుల ప్రతాపం ఎన్కౌంటర్ జరిగిన స్థలం జాతీయ రహదారిపై ఉండడంతో వరంగల్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున వచ్చారు. ఎన్కౌంటర్ జరిగిన వాహనం వద్దకు ఎవరినీ వెళ్ల నీయకుండా భారీ బందోబస్తు పెట్టారు. కనీసం ఫొటోలు తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. దీంతోపాటు రెండు జిల్లాల నుంచి పెద్దఎత్తున జనం వచ్చారు. ఎన్కౌంటర్ మృతులను చూసేందుకు పోటీపడ్డారు. ఈ దశలో పలుమార్లు పోలీస్‌లు లాఠీచార్జీ చేశారు. దీంతో పలువురు రోడ్డుకిందికి పరుగెత్తే క్రమంలో కిందపడి గాయాలపాలయ్యారు. దీంతో మీడియా ప్రతినిధులు పోలీస్ జులుం నశించాలని నినాదాలు చేశారు. ఎవరినీ అనుమతించకుండానే పోస్టుమార్టం కోసం మృతదేహాలను అదేవాహనంలో వరంగల్ జిల్లా జనగామకు తరలించారు. శవపంచనామా చేసిన ఆర్డీఓ భువనగిరి ఆర్డీఓ ఎన్. మధుసూదన్ తీవ్రవాదుల శవ పంచానామా నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ రామ్మూర్తి, సీనియర్ అసిస్టెంట్ భగత్, వీఆర్ఓ వెంకట్‌రెడ్డిలు ఉన్నారు. -
అన్యాయంగా చంపారు
వికార్ తండ్రి అహ్మద్.. శిక్షించేందుకు పోలీసులెవరంటూ ఆగ్రహం హైదరాబాద్: తన కుమారుడు వికారుద్దీన్‌ను పోలీసులు అన్యాయంగా ఎన్కౌంటర్ చేశారని అతని తండ్రి మహ్మద్ అహ్మద్ ఆరోపించారు. చేతులకు బేడీలున్నవాళ్లు ఎలా తప్పించుకోగలరు? నేరం చేస్తే కోర్టులు శిక్షించాలిగానీ పోలీసులు ఎన్కౌంటర్ చేయడమేంటి? ప్రభుత్వం, పోలీసులు నీచంగా నా కొడుకునుబలి తీసుకున్నారు’’ అంటూ ఆగ్రహించారు. వికార్పై కేసులను కొట్టేసే దశలో ఎన్కౌంటర్ చేయడం దుర్మార్గమని మంగళవారం తన నివాసంలో విలేకరులతో అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందని, ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అహ్మద్ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన వారిపై కేసులు పెట్టనిదే మృతదేహాన్ని తీసుకెళ్లబోమని హెచ్చరించారు. ‘‘నా కొడుకును పది రోజుల క్రితం వరంగల్ జైల్లో చూశాను. విచారణ 90 శాతం పూర్తయిందని, ఒకట్రెండు నెలల్లో బయటికొస్తానని చెప్పాడు. సిమీతో తనకు ఏ సంబంధమూ లేదు. నా ఐదుగురు సంతానంలో వికార్ నాలుగోవాడు. బి.కాం. మధ్యలో ఆపేశాడు. 2009లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 2011లో అరెస్టు చేసి జైల్లో పెట్టారు’’ అని చెప్పారు. ఇది పక్కా పోలీసు హత్య అని, కేసులను కొట్టేసే దశలో ఎన్కౌంటర్ చేయడంపై న్యాయ విచారణకు సిద్ధమవుతామని న్యాయవాదులు ఎం.ఎ.అజీమ్, ఎస్.కె.సైఫుల్లా అన్నారు. -
అహ్మదాబాద్ టు ముషీరాబాద్
ఇదీ డాక్టర్ అనీఫ్ ప్రస్థానం హైదరాబాద్: వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముషీరాబాద్‌కు చెందిన డాక్టర్ అనీఫ్ మృతి చెందాడన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసి ముగ్గురు పోలీసులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది వికారుద్దీన్‌కు ఆశ్రయం కల్పించాడనే అభియోగంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధముందని 2010 ఫిబ్రవరిలో అనీఫ్‌ను పోలీసులు అరెస్టుచేశారు. అప్పటినుంచి విడుదల కాకుండా జైల్లోనే మగ్గుతున్నాడు. అనీఫ్కు భార్య ఇర్షాద్ అలియాస్ బీబీ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. క్లినిక్ ముసుగులో ఉగ్రకార్యకలాపాలు..! అనీఫ్ది గుజరాత్‌లోని అహ్మదాబాద్. బీఏఎంఎస్ చదివిన అనీఫ్ 2007లో హైదరాబాద్‌కు వచ్చి వారాసిగూడలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ముషీరాబాద్‌లోని జంజం మసీదు సమీపంలో అతని పేరుతో ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటుచేశాడు. అయితే అందులో గుట్టుచప్పుడు కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతుండేవాడని ఆరోపణలు వచ్చాయి. అప్పటికే హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసులను చంపి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న వికారుద్దీన్‌కు వారాసిగూడలోని తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు వారాసిగూడాలో ఇంటిపై దాడి చేసి వికారుద్దీన్‌ను అరెస్టు చేశారు. తర్వాత ఆశ్రయం కల్పించినందుకు అనీఫ్‌ను కూడా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అనీఫ్ భార్య ముషీరాబాద్‌లోని తన తల్లిగారింట్లోనే ఉంటోంది. అప్పుడప్పుడూ జైలుకు వెళ్లి అనీఫ్‌ను కలిసి వస్తుండేది. అనీఫ్ మరణ వార్త తెలియగానే ఎంబీటీ నాయకులు ముషీరాబాద్‌లోని అతని అత్తగారింటికి వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇదిలా ఉండగా అనీఫ్ మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబసభ్యులెవరూ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అతని మృతదేహాన్ని ముషీరాబాద్‌కు తీసుకొస్తారా.. లేక గుజరాత్ తీసుకెళ్తారా? అనే విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. -
వికార్ గ్యాంగ్ హతం..
►వికారుద్దీన్ సహా ఐదుగురు ఉగ్రవాదులు మృతి ►జాతీయ రహదారిపై ఎస్కార్ట్ బస్సులోనే కాల్పులు ►వరంగల్ జైలునుంచి హైదరాబాద్ కోర్టుకు తీసుకెళ్తుండగా ఘటన ►పోలీసులపై దాడికి యత్నించిన వికార్ గ్యాంగ్ ►ఆయుధాలు లాక్కుని ఎదురుదాడి చేసే యత్నం.. ►నిందితులను కాల్చి చంపిన పోలీసులు ►వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నేడు పోస్ట్‌మార్టం ►అన్యాయంగా చంపారు.. సీబీఐ దర్యాప్తు జరపాలి: వికార్ తండ్రి ►ఇది పోలీసుల ప్రతీకార హత్య: అసదుద్దీన్ ఒవైసీ ►హైకోర్టు జడ్జితో విచారణకు హక్కుల సంఘాల డిమాండ్ నల్లగొండ-వరంగల్ జిల్లా సరిహద్దులో ఎన్కౌంటర్ వరంగల్: రాష్ట్రంలో మరో సంచలనం. ఇద్దరు సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ను మరువక ముందే మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈసారి కరడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌తోపాటు అతని గ్యాంగ్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులోని టంగుటూరు శివారులో జాతీయ రహదారిపైనే మంగళవారం కాల్పు లు జరిగాయి. ఇందులో వికార్ అహ్మద్(29) అలియాస్ వికారుద్దీన్‌తోపాటు సయ్యద్ అమ్జద్(23), ఇజార్ ఖాన్(29), మహమ్మద్ జకీర్(32), మహమ్మద్ హనీఫ్(34) మృతి చెందా రు. పలు ఉగ్రవాద నేరాల్లో విచారణ ఖైదీలుగా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న వీరిని కోర్టు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. మూత్రవిసర్జన కోసమంటూ వాహనాన్ని నిలిపేలా చేసి ఉగ్రవాదులు పోలీసులపైకి తిరగబడ్డారని పోలీ సులు తెలిపారు. ఆయుధాలను లాక్కునేం దుకు యత్నించడంతో పోలీసుల కాల్పుల్లో నిందితులంతా అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాలన్నీ ఎస్కార్ట్ వాహనంలోనే పడి ఉన్నాయి. చేతులకు బేడీలు అలానే ఉన్నాయి. ఓ నిందితుడి చేతిలో మాత్రం పోలీసుల ఆయుధం ఉంది. ఒకేసారి ఐదుగురు ఉగ్రవాదులు హతమవడం రాష్ర్టంలో సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇజార్‌ఖాన్ మినహా మిగతా వారంతా హైదరాబాద్ వాసులే. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు నిషేధిత సిమి, లష్కరేతొయిబా ఉగ్రవాద సంస్థలతో వికార్కు సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తన కుమారుడిని అన్యాయంగా చంపారని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వికారుద్దీన్ తండ్రి అహ్మద్ డిమాండ్ చేశారు. ఇవి పోలీసుల ప్రతీకార హత్యలని, దీనిపై మానవ హక్కుల సంఘంతో విచారణ జరిపించాలని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ ఎన్కౌంటర్ చట్ట విరుద్ధమని, హైకోర్టు జడ్జితో విచారణ చేయాలని హక్కుల సంఘాలు మండిపడ్డాయి. హైవేపైనే ఘటన.. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు ఆర్ముడ్ రిజర్వ్(ఏఆర్) సబ్ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలోని పోలీసుల బృందం మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఐదుగురు ఖైదీలను తీసుకుని వరంగల్ సెంట్రల్ జైలు నుంచి నీలం రంగు ఐషర్ వ్యానులో హైదరాబాద్‌కు బయలుదేరింది. పలు ఉగ్రవాద నేరాల్లో నిందితులుగా ఉన్న వికార్ గ్యాంగ్‌ను విచారణ నిమిత్తం నాంపల్లి ఏడో మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. బస్సులో వికారుద్దీన్, సయ్యద్ అమ్జద్, ఇజార్ ఖాన్, మహమ్మద్ జకీర్, మహమ్మద్ హనీఫ్తోపాటు వీరికి బందోబస్తుగా డ్రైవర్ సహా 13 మంది ఏఆర్ పోలీసులు ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ మీదుగా వరంగల్ జిల్లా సరిహద్దు దాటి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాక 10.20 గంటల సమయంలో నల్లగొండ జిల్లా ఆలేరు మండలం టంగుటూరు శివారుకు చేరుకోగానే మూత్రవిసర్జన చేస్తామని ఉగ్రవాదులు చెప్పారు. దీంతో పోలీసులు బస్సును నిలిపి వారిని కిందకు దిగమన్నారు. ఇదే సమయంలో పోలీసులపై వారు తిరగబడ్డారు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వికారుద్దీన్‌తో పాటు మిగతా నిందితులు పోలీసుల వద్ద ఉన్న తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారిపైకి కాల్పులు జరిపారు. 10.30 గంటల సమయంలో ఐదుగురు ఉగ్రవాదులూ చనిపోయారు. ఈ ఘటనలో ఆర్ఎస్ఐ సోమన్న గాయపడినట్లు ఐజీ నవీన్ చంద్ వివరించారు. అందరి కళ్లు ఇక్కడే.. సూర్యాపేట కాల్పులు, జానకీపురం ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు, ఉగ్రవాద నిరోధక బృందాల(ఏటీఎస్) అధికారులు టంగుటూరు ఎన్కౌంటర్ ప్రదేశానికి వచ్చారు. సెంట్రల్ కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూ రో, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, యాంటీ టైస్ట్ స్క్వాడ్ బృందాలు, ఫోరెన్సిక్ బృం దం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. పోలీసుల నుంచి వివరాలు సేకరించాయి. ఎన్కౌంటర్ జరిగిన వెంటనే స్పెషల్ పార్టీ పోలీసులు భారీగా చేరుకుని సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. మృతదేహాలను జనగామ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించడంతో జాతీయ రహదారిపై కల్వర్టులను బాంబ్స్క్వాడ్లు ముందుగా తనిఖీ చేశాయి. భారీగా ట్రాఫిక్ జామ్ జాతీయ రహదారిపైనే ఎన్కౌంటర్ జరగడంతో కొన్ని గంటలపాటు వరంగల్-హైదరాబాద్ మధ్య రాకపోకలన్నీ ఆగిపోయాయి. వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. భారీగా మోహరించిన పోలీసులకు తోడు సాధారణ జనం కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రహదారిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు హైదరాబాద్ మీదుగా వచ్చే వాహనాలను ఆలేరు వద్ద కొద్దిసేపు నిలిపివేశారు. ఎన్కౌంటర్ జరిగిన మూడు గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. మృతదేహాలను జనగామ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ కూడా ట్రాఫిక్ స్తంభించింది. జనగామ-సిద్ధిపేట రహదారిని ఆనుకుని ఈ ఆసుపత్రి ఉంది. జనం భారీగా ఆస్పత్రి వద్దకు వచ్చారు. పోలీసులు, అధికారులు, ఆస్పత్రికి వచ్చిపోయే రోగులతో ఆసుపత్రి ప్రాంగణం సాయంత్రం వరకు కిక్కిరిసిపోయింది. వ్యానులోనే మృతదేహాలు ఎన్‌కౌంటర్‌తో ఐదుగురి మృతదేహాలు వాహనంలోనే చెల్లాచెదురుగా పడ్డాయి. ముగ్గురు నిందితులు సీట్లలోనే కూర్చున్నట్లుగా ఉండగా.. ఇద్దరు సీట్ల మధ్యన కిందపడిపోయి ఉన్నారు. ఎస్కార్ట్ వాహనమంతా రక్తపు మడుగుగా మారిం ది. బస్సులోంచి రక్తం ధారగా కిందకు కారింది. వాహనం కింద నేల కూడా రక్తం తో తడిసిపోయింది. వాహనం నిలిపిన ప్రదేశంలో మూడు చోట్ల రక్తపు మరకలు కనిపించాయి. పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను జనగామ ప్రాంతీ య ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నల్లగొండ జిల్లా పరిధిలో ఉండటంతో పోస్టుమార్టం ఎక్కడ నిర్వహించాలనే విషయంలో పోలీసులు కొంత ఆలోచించారు. భువనగిరికి తీసుకెళ్లాలని మొదట భావించినప్పటికీ అది దూరం కావడంతో చివరకు జనగామకే మృతదేహాలను తరలించారు. అయితే అక్కడ కూ డా ఫ్రీజర్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. -
వరంగల్ ఎంజీఎంకు మృతదేహాలు
వరంగల్ : వరంగల్ జిల్లా జనగాం-ఆలేరు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు వికారుద్దీన్, అంజాద్, అనీఫ్, జకిర్, ఇజార్‌ఖాన్ హతమైన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్‌కౌంటర్‌ను వికారుద్దీన్ తండ్రి మహ్మద్ హైమద్ ఖండించారు. కేసు విచారణ ముగిసే సమయానికి పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తాము కోర్టుకు వెళతామని చెప్పారు. -
బూటకపు ఎన్కౌంటర్:వికారుద్దీన్ తండ్రి
-
వికారుద్ధీన్ సహా ఐదుగురు తీవ్రవాదులు హతం
-
ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
-
షాబాద్, శంషాబాద్, షాద్ నగర్లలో హై అలర్ట్
వరుస ఉద్రిక్త పరిస్థితులతో తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఏక్షణం ఏం జరుగుతుందా అని సామాన్య జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడోగానీ తమకు వినిపించని పోలీసుల బూట్ల చప్పుళ్లు ఇప్పుడు ప్రతిక్షణం.. ప్రతిచోట వినిపిస్తున్నాయి. అదే సమయంలో దొంగలు, దోపిడీ దారులు, ఉగ్రవాదులు మొత్తానికి రాష్ట్రేతరులు క్రూరపు ఆలోచనలతో అలజడులు సృష్టిస్తుండగా ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. మంగళవారం ఉదయం వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్ అనంతరం తెలంగాణలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర గాలింపులు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తుపాకులతో కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో షాబాద్, శంషాబాద్, షాద్ నగర్లలో హై అలర్ట్ ప్రకటించారు. వరంగల్‌లో ఎన్‌కౌంటర్‌కు ముందు గుర్తు తెలియని దుండగులు తమపై దాడులు చేయడంతో అది ముందస్తూ వ్యూహంతోనే జరిగిందా? తాము వెళుతున్న మార్గంలోనే ఉగ్రవాదులు అనుసరిస్తున్నారా అనే అనుమానం కూడా పోలీసులకు కలుగుతోంది. మొత్తానికి సూర్యపేట ఘటన కావచ్చు.. చిత్తూరు ఘటన కావచ్చు.. పోలీసుల మాత్రం ప్రస్తుతం డేగ కళ్లతో పనిచేస్తున్నారని చెప్పవచ్చు. -
ఐదుగురిని కాల్చి చంపిన పోలీసులు
-
ఇదంతా వ్యూహంలో భాగమేనా?
హైదరాబాద్: ఒకేరోజు.. కొన్ని గంటల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు భారీ ఎన్కౌంటర్లు..మొత్తం మీద 25మంది హతం. ఇందులో ఇరవై మంది ఎర్రచందనం స్మగర్లు కాగా ఐదుగురు ఐఏఎస్ ప్రేరేపిత తీవ్రవాదులు. తెలంగాణాలో గతం వారం రోజులుగా వరుస సంఘటనలు ఆందోళనకర వాతావరణానికి తెరలేపాయి. ముందుగా సూర్యపేట బస్టాండ్‌లో పోలీసులపై తీవ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసుల మరణం. రెండు రోజుల వ్యవధిలో నల్గొండ జిల్లాలోని అర్వపల్లిలో మరో ఎన్కౌంటర్. ఒక కానిస్టేబుల్, ఇద్దరు తీవ్రవవాదుల హతం. మంగళవారం ఉదయం వరంగల్ జిల్లాలోని జనగామ వద్ద ఎస్కార్ట్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బడా ఉగ్రవాది వికారుద్దీన్ సహా ఐదుగురు తీవ్రవాదుల హతమయ్యారు. ఈ వరుస సంఘనలు తెలంగాణాలో వేగంగా మారుతున్న పరిస్థితులకి అద్దం పడుతున్నాయా? ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒకేసారి వేడేక్కిందా? పరిస్థితులు అలాగే కనపడుతున్నాయి. సూర్యపేట బస్టాండ్‌లో కాల్పులు జరిపిన తర్వాత తీవ్రవాదులు నల్గొండ జిల్లాలోనే ఎందుకు ఉండిపోయారు. మళ్లీ పోలీసులను ఎందుకు ఢీకొన్నారు. వికారుద్దీన్‌ను తప్పించే వ్యూహంలో భాగంగానే ఇదంతా జరిగిందా...తమ పథకంలో భాగంగానే నల్గొండ జిల్లాలోనే ఉండిపోయారా? వికారుద్దీన్ తప్పించుకునే ప్రయత్నం ముందుగా పన్నిన వ్యూహంలో భాగమేనా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. సూర్యపేట ఘటన తర్వాత నల్గొండ జిల్లాలోనే దాదాపు 36 గంటలు తీవ్రవాదలు గడపడం కొంత ఆశ్యర్యాన్ని కలగజేసింది. రాష్ట్రాన్ని దాటడం కష్టమైనప్పటికీ అసాధ్యం కాదు. అయినా ఇద్దరు తీవ్రవాదుల కదలికలు జిల్లాలోనే కనిపించడం పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఏదైనా దాడికి కుట్ర పన్నారా అనే అనుమానాలు కలిగాయి. అందుకే పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. దాని పర్యవసానమే అర్వపల్లి ఎన్కౌంటర్ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు సాక్షి వెబ్‌సైట్‌కి చెప్పారు. మంగళవారం ఉదయం వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తరలిస్తుండగా వికారుద్దీన్ గ్యాంగ్ ఎస్కార్ట్ వాహనం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు ఐఏఎస్ ఏజెంట్లను పోలీసులు మట్టుబెట్టారు. తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపైకి దాడి చేయడం...తమ అనుమానాల్ని మరింత బలపరుస్తోందని ఆ అధికారి చెప్పారు. అయితే ఇంకొంతమంది తీవ్రవాదులు నల్గొండ, వరంగల్ జిల్లాలో తలదాచుకొని ఉండే అవకాశముందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల తర్వాత కొంతకాలం ప్రశాంతంగా ఉన్న వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. సిమీ, జీజేఎస్, ఇండియన్ ముజాహిదీన్ లాంటి మరికొన్ని సంస్థలు తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి. ఈ వరుస ఘటనలు మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్.. ఇరవైమంది స్మగ్లర్ల కాల్చివేతకు దారి తీసింది. పోలీసులను, అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల మెరుపుదాడితో ఒక్కసారిగా వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చింది. తిరుమల కొండల దిగువ భాగాన జరిగిన ఎన్కౌంటర్ కలకలం రేపింది. ఒకేసారి ఇరవైమంది స్మగ్లర్ల ఎన్కౌంటర్ అవడం ఇంతకు ముందెప్పుడూ లేదు. ఎన్ని దాడులు జరిగినా ఎర్రచందనం స్మగ్లర్లు మళ్లీ మళ్లీ ప్రత్యక్షమవడాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనబడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ వరుస సంఘటనలు ఇంకెన్ని మలుపులు తిరుగనున్నాయోననే భయాందోళనలు నెలకొన్నాయి. సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం -
ఎవరీ వికారుద్దీన్
-
ఎవరీ వికారుద్దీన్...
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వికారుద్దీన్ అసలెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. మారు వేషాలతో పోలీసులను బురిడీ కొట్టించటంలో దిట్ట. వికారుద్దీన్ అసలు పేరు వికార్ అహ్మద్. అయితే అందరికీ తెలిసిన పేరు అలీభాయ్. స్వస్థలం హైదరాబాద్‌లోని ఓల్డ్ మలక్ పేట్. వికారుద్దీన్ చిన్నప్పటి నుంచే మత సంబంధ కార్యక్రమాలపై మక్కువ పెంచుకున్నాడు. దర్స్ గా జిహాద్ ఏ షహదత్... సంస్థలో శిక్షణ పొందిన తరువాత ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ముసారాంబాగ్ కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాది బిలాల్ ను ఆదర్శంగా తీసుకున్నాడు. మే 18, 2007 లో మక్కా పేలుళ్లు జరిగిన తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళాడు. బంగ్లాదేశ్, ఖతర్, ఒమన్, దుబాయ్‌లో ఉగ్రవాదంపై వికారుద్దీన్ శిక్షణ పొందాడు. 2007 మే 18 మక్కా పేలుళ్లు జరిగింది. అప్పటి నుంచి ప్రతిఏటా అదే రోజున ఏదో ఒక అలజడి సృష్టించటం అలవాటుగా చేసుకున్నాడు.. 2008లో మే 18న సంతోష్ నగర్లో కౌంటర్ ఇంటలిజెన్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోయాడు. 2009 మే 18 న ఫలక్ నామాలో డ్యూటీలో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఆ సంఘటనలో బాలస్వామి అనే హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలంలో ప్రతి సంవత్సరం ఇలాగే పోలీసులపై దాడులు చేస్తానని తెహరిక్ గల్బా యే ఇస్లాం పేరుతో లెటర్ రాసిపెట్టిన వికారుద్దిన్ అనూహ్యంగా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. -
వరంగల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్
-
ఎన్కౌంటర్లో వికారుద్దీన్ హతం!
-
ఖాకీలకే ముచ్చెమటలు పట్టించాడు..
హైదరాబాద్: పోలీసులపై కాల్పులు అనగానే టక్కున గుర్తొచ్చేది వికారుద్దినే. అతడు పోలీసులనే టార్గెట్ చేసుకొని దాదాపు ఐదేళ్లపాటు దాడులు చేసి వారికి దొరకకుండా అరెస్టయ్యేవరకు ముప్పు తిప్పలు పెట్టాడు. అనేక సంచలనాలకు కేంద్ర బిందువయ్యాడు. 2008 డిసెంబర్ 3న తొలిసారి దాడి చేసి వికారుద్దీన్.. ఆ తర్వత వరుసగా 2009 మే 18న, 2010 మే 14న కాల్పులు జరిపాడు. ప్రతిసారి ఒకరిద్దరు పోలీసులను చంపేస్తూ వచ్చిన వికారుద్దీన్ చివరికి పోలీసులకు చిక్కాడు. అతడిని తొలుత చర్లపల్లి జైలులో వేయగా అక్కడ అతడి ఆగడాలు ఎక్కువయ్యాయి. దీంతో అక్కడ కంట్రోల్ చేయలేక ఆరు నెలల కిందట వరంగల్ జైలుకు పంపించారు. అయితే, అక్కడ కూడా వికారుద్దీన్ అలాంటి పనులే చేస్తున్నాడని, విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను బెదిరిస్తున్నాడని తెలిసింది. అతడు జైలు సిబ్బందిని వ్యక్తిగతంగా బెదిరిస్తుంటే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి జైలు అధికారులు తీసుకొచ్చారు. దీనిపై సీసీఎస్ ఆరా తీసిన పోలీసులు హత్య, హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. దీంతో మరోసారి అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించిన పోలీసులు హైదరాబాద్ విచారణకు తరలిస్తుండగా పోలీసులపై దాడులకు పాల్పడి పారిపోయే యత్నం చేశాడు. దీంతో ఎన్కౌంటర్ జరగడంతో అతడ కథ ముగిసింది. -
ఎన్కౌంటర్లో వికారుద్దీన్ హతం!
వరంగల్ : కరుడుగట్టిన ఐఎస్ఐ ఏజెంట్ వికారుద్దీన్ హతమైనట్లు సమాచారం. వరంగల్ జిల్లా జనగామ సమీపంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో అతడు మృతి చెందాడు. వరంగల్ జిల్లాకు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఎస్ సదన్ వద్ద పోలీసులపై కాల్పులు జరిగిన కేసులో వికారుద్దీన్ నిందితుడు. పోలీసులపై కాల్పులు జరపడంతోపాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. నిషిద్ధ సిమి సానుభూతిపరుడైన వికారుద్దీన్ వరంగల్ జైలులో ఉన్నాడు. అతడిని కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు హైదరాబాద్ తరలిస్తుండగా, పోలీసులపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
‘రహనుమా’ చీఫ్ ఎడిటర్ వికారుద్దీన్‌కు ప్రమాదం
జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో ‘రహనుమా ఏ దక్కన్’ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ సయ్యద్ వికారుద్దీన్ ఖాద్రీ గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా హుమ్నాబాద్ సమీపంలో 65వ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వికారుద్దీన్ కర్ణాటకలోని గుల్బర్గాలో జరుగనున్న ఇండో -అరబ్ సభకు హాజరయ్యేందుకు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం హుమ్నాబాద్ సమీపంలోకి వచ్చే సరికి టైరు పంక్చర్ కావడంతో పాటు ఎడమ వైపు ఉన్న రెండు చక్రాలు ఊడి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వికారుద్దీన్‌తో పాటు ఇండో -అరబ్ అధ్యక్షుడు షేక్ అబూబకర్లను జహీరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ ఆయన్ను పరామర్శించారు. -
బ్రెయిన్ లో బుల్లెట్
ఐదేళ్లుగా ప్రాణాలతో పోరాడుతున్న కానిస్టేబుల్ ఉగ్రవాది వికార్ చేతిలో గాయపడి.. బుల్లెట్ బాధను భరిస్తున్న రాజేంద్రప్రసాద్ అతను ఏ క్షణాన కుప్పకూలిపోతాడో... ఏ నిమిషాన మృత్యువు కబళిస్తుందో తెలియదు. కుటుంబ సభ్యులు అనుక్షణం అతణ్ణి ఓ కంట కనిపెట్టాల్సిందే. ఐదేళ్ల క్రితం ఉగ్రవాది వికార్ చేతిలో గాయపడ్డాడు. మెదడులోకి దూసుకెళ్లిన తూటాను భరిస్తున్నాడు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోన్న తరుణంలో తన కుటుంబం ఏమవుతుందోనన్న బెంగతో బతుకుపోరాటం చేస్తోన్న ఓ కానిస్టేబుల్ దీనగాథ ఇది. ఆ రోజు ఏమైందంటే... 2009 మే 18న ఫలక్‌నుమా ఠాణాకు చెందిన కానిస్టేబుల్ దాసరి రాజేంద్రప్రసాద్(44), హోంగార్డు బాలస్వామి (27) ఫలక్‌నుమా బస్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు వారిపై ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బాలస్వామి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా రాజేంద్రప్రసాద్ తలతోకి బుల్లెట్ (32) దూసుకుపోవడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. 2007 మే 18న జరిగిన మక్కా మసీదు బాంబు పేలుడు ఘటనకు ప్రతీకారంగా ఏటా పోలీసులను టార్గెట్ చేసుకుని వికారుద్దీన్ పంజా విసురుతూనే ఉన్నాడు. ఆ రోజు అతని టార్గెట్‌కు బాలస్వామి, రాజేంద్రప్రసాద్‌లు చిక్కారు. మెదడు నరాల మధ్యలో... గాయపడిన రాజేంద్రప్రసాద్‌ను కేర్ ఆసుపత్రికి త రలించారు. అతని తలలోని చిన్న-పెద్ద మెదడు మధ్యలోని నరాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లిందని, అక్కడ నరాలు కాలిపోయాయని వైద్యులు చెప్పారు. ఆ బుల్లెట్ తీస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమా దం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ చేయలేమంటూ నెల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం... అప్పటి నుంచి మెదడులో ఉన్న బుల్లెట్‌తో రాజేంద్రప్రసాద్ నరకయాతన అనుభవిస్తున్నాడు. బుల్లెట్ వెలికి తీయించేందుకు ఆయన తిరగని ఆసుపత్రి లేదు. చేయని ప్రయత్నంలేదు. నగరంలోని న్యూరోసర్జన్లను కలిసి నిరాశచెందిన రాజేంద్రప్రసాద్ జనవరి 2013న బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ ఆస్పత్రికి వెళ్లి అక్కడి న్యూరోసర్జన్ ఎస్.సంపత్‌ను కలిశాడు. బుల్లెట్ తీస్తే పక్షవా తం, ఫిట్స్‌తోపాటు జ్ఞాపక శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆపరేషన్ చేయడం కూడా చాలా క ష్టమని చెప్పడంతో నిరాశతో వెనుతిరిగాడు. ప్రస్తుతం ఆయన నగర సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. కోల్పోతున్న కంటి చూపు.. మెదడులో ఐదేళ్లుగా బుల్లెట్ మోస్తున్న రాజేంద్రప్రసాద్ తన కుడి కంటి చూపును 68 శాతం కోల్పోగా, ఎడమ కంటి చూపును 60 శాతం కోల్పోయాడు. బుల్లెట్ గాయంతో మెదడులో నరాలు దెబ్బతినడంతో దాని ప్రభావం కంటి చూపుపై పడింది. కంటి చూపు మెరుగు కోసం ఎన్ని ఆసుపత్రులు తిరిగినా లాభం లేకుండాపోయింది. బైక్ నడపడం, ఎత్తయిన ప్రదేశానికి వెళ్లడం, స్విమ్మింగ్ వంటి పనులు చేయరాదని డాక్టర్లు సలహా ఇచ్చారు. నిత్యం మూడు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు. ఈ ట్యాబ్లెట్లు వేసుకున్న వెంటనే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అయినా తన విధులకు బైక్‌పైనే వెళ్తున్నాడు. అందరి మాదిరిగానే డ్యూటీ చేస్తున్నాడు. డాక్టర్ల సలహాలకు విరుద్ధంగా పనిచేస్తుండటంతో ఏ క్షణాన ఏమవుతుందోనని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగం మానేసిన భార్య.. రాజేంద్రప్రసాద్ భార్య ధనలక్ష్మి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. ఈ ఘటన జరిగిన తరువాత ఆమె ఉద్యోగం మానేసి భర్తను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎక్కువ దూరం నడిచినా, ఎక్కువ సేపు టీవీ చూసినా, ఎక్కువ సమయం స్నానం చేసినా ఫిట్స్ వచ్చి కింద పడి పోతాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో అతను గతనెల 19 నుంచి సిక్ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక పిల్లలు అభినవ్ (11), చంద్రిక (9) నాలుగో తరగతి చదువుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం బతుకుతున్నామని, తమకు ఏదైన జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ దంపతులు అనుక్షణం భయపడుతున్నారు.