
వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
ఎమ్మెస్పీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
హన్మకొండ: ముస్లిం యువకులను హత్య చేయించిన హంతకుడు సీఎం కేసీఆర్ అని మహాజన సోషలిస్టు పార్టీ (ఎమ్మెస్పీ) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని, మక్కామసీదు అభివృద్ధికి నిధులు కేటాయించాలని, వికారుద్దీన్ సహా నలుగులు ముస్లిం యువకుల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ అధ్వర్యంలో ముస్లింలతో కలిసి శ నివారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో పోలీసులను హతమార్చినందుకు ప్రతీకారంగా వికారుద్దీన్‌తో పాటు నలుగురిని ఎన్‌కౌంటర్ చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చి హత్య చేయించిన హంతకుడు సీఎం కేసీఆర్ అని ధ్వజమెత్తారు.
కేటీఆర్‌ను తప్పించైనా ఆ ఇద్దరికి మంత్రి పదవులివ్వాలి
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా దళిత ఎమ్మెల్యేలైన కొప్పుల ఈశ్వర్, రసమరుు బాలకిషన్‌లకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. అవసరమైతే కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించైనా, ఈ నెల 20లోగా మంత్రివర్గ కూర్పు చేపట్టాలన్నారు.