రీ పోస్టుమార్టానికి హైకోర్టు నో | high court says no for re postmartam of vikaruddin | Sakshi
Sakshi News home page

రీ పోస్టుమార్టానికి హైకోర్టు నో

Published Wed, Apr 29 2015 1:07 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

రీ పోస్టుమార్టానికి హైకోర్టు నో - Sakshi

రీ పోస్టుమార్టానికి హైకోర్టు నో

ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వికారుద్దీన్, మరో నలుగురి మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలంటూ వికారుద్దీన్ తం డ్రి, మరికొందరు చేసిన అభ్యర్థనలను హై కోర్టు తోసిపుచ్చింది.

వికారుద్దీన్ తండ్రి, మరికొందరి అనుబంధ పిటిషన్లు కొట్టివేత
 
 సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వికారుద్దీన్, మరో నలుగురి మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలంటూ వికారుద్దీన్ తం డ్రి, మరికొందరు చేసిన అభ్యర్థనలను హై కోర్టు తోసిపుచ్చింది. అటువంటి ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదంటూ, వారు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రధాన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

 

తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించడంతో పాటు, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వికారుద్దీన్ తండ్రి ఎం.డి.అహ్మద్‌తో పాటు మృతుల సంబంధీకులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇదే వ్యవహారానికి సంబంధించి మరో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నిం టినీ మంగళవారం న్యాయమూర్తి మరోసారి విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement