అగ్రిగోల్డ్‌ ఆస్తులకు గరిష్టంగా ఎంత చెల్లిస్తారు? | High Court On Agri Gold Victims Compensation | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 5 2018 2:07 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

High Court On Agri Gold Victims Compensation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల కొనుగోలు విషయంలో గరిష్టంగా ఎంత మొత్తం చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎంత కాలంలోగా ఆ సొమ్ము చెల్లిస్తారు? ఏయే ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వెల్లడించాలని ఆదేశించింది. ఈ వివరాలను పరిశీలించిన తరువాత తదుపరి విచారణలో ఈ మొత్తం వ్యవహారంలో మీ భవితవ్యం ఏమిటో తేల్చేస్తామని సుభాష్‌ చంద్ర ఫౌండేష న్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఇది తామిచ్చే చివరి అవకాశమని పేర్కొంది. తదుపరి విచా రణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామ సుబ్రమణియన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిపాజిటర్లకు హైకోర్టు నేతృత్వంలోనే చెక్కుల పంపిణీ జరుగుతుం దని తెలిపింది. ఈ దశగా ఓ ప్రణాళికను రూపొందించాలని యోచిస్తున్నామని వివరిం చింది. డిపాజిటర్లు మండల, తాలుకా స్థాయి లో న్యాయ సేవాధికార సంస్థల ను ఆశ్రయిం చి, తమకు ఎంతెంత రావాలో చెబితే వివరా లను సరిపోల్చుకుని డిపాజిటర్లకు ఓ సర్టిఫికే ట్‌ ఇస్తారని, దాన్ని తమకు చూపితే చెక్కు జారీ చేస్తామని వెల్లడిం చింది. 

ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం.. 
విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీఐడీ అదనపు డీజీ అమిత్‌గార్గ్‌ సిద్ధం చేసిన అఫిడ విట్‌ను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణప్రకాశ్‌ ధర్మాసనం ముందుం చారు. సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ ప్రతిపాదన ఏ రకంగా తమకు ఆమోదయోగ్యం కాదని, దాన్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను ఆ ఫౌండేషన్‌ కనిష్టంగా రూ.1,600 కోట్లు, గరిష్టంగా రూ.2, 200 కోట్లుగా చెబుతోందని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ.4,000 కోట్లకు పెరుగుతాయన్న అంచనాతో సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ లెక్కలు వేస్తోందని, వీటిని ఆమోదిస్తే అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రూ.2,200 కోట్లుగా అంగీకరించినట్లు అవుతుందన్నారు. 

మా ప్రతిపాదనను అర్థం చేసుకోలేదు
తమ ప్రతిపాదనలను ప్రభుత్వం సరిగ్గా అర్థం చేసుకోలేదని, అందుకే వ్యతిరేకిస్తోందని సుభా ష్‌ చంద్ర ఫౌండేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయ వాది పి.శ్రీరఘురాం వాదనలు వినిపిం చారు. ఈ వ్యవహారంలో తమకు మరింతగా ఏపీ ప్రభుత్వ సహకారం కావాలని కోరారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement