
నా భర్త మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్తా'
వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద అనీఫ్ భార్య, బంధువులు ఆందోళనకు దిగారు. ఎన్కౌంటర్లో హతమైన వికారుద్దీన్ గ్యాంగ్కు బుధవారం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అనీఫ్ మృతదేహాన్ని చూడటానికి పోలీసులు అనుమతించటం లేదని అనీఫ్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. సాక్ష్యాలు లేనందునే అనీఫ్ను ఎన్కౌంటర్ చేశారని, ఎన్కౌంటర్పై పూర్తి విచారణ జరిపించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆస్పత్రిలోకి రానివ్వకుండా పోలీసులు నెడుతున్నారని, తన భర్త మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్తానని ఆమె అన్నారు. కాగా ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, వారి నుంచి అనుమతి రాగానే బంధువులకు మృతదేహాలు అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.