ఎన్కౌంటర్లో వికారుద్దీన్ హతం!
వరంగల్ : కరుడుగట్టిన ఐఎస్ఐ ఏజెంట్ వికారుద్దీన్ హతమైనట్లు సమాచారం. వరంగల్ జిల్లా జనగామ సమీపంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో అతడు మృతి చెందాడు. వరంగల్ జిల్లాకు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఎస్ సదన్ వద్ద పోలీసులపై కాల్పులు జరిగిన కేసులో వికారుద్దీన్ నిందితుడు.
పోలీసులపై కాల్పులు జరపడంతోపాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. నిషిద్ధ సిమి సానుభూతిపరుడైన వికారుద్దీన్ వరంగల్ జైలులో ఉన్నాడు. అతడిని కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు హైదరాబాద్ తరలిస్తుండగా, పోలీసులపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.