‘రహనుమా’ చీఫ్ ఎడిటర్ వికారుద్దీన్‌కు ప్రమాదం | Chief editor Vikaruddin injured in road accident | Sakshi
Sakshi News home page

‘రహనుమా’ చీఫ్ ఎడిటర్ వికారుద్దీన్‌కు ప్రమాదం

Published Sun, Dec 28 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

Chief editor Vikaruddin injured in road accident

జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో ‘రహనుమా ఏ దక్కన్’ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ సయ్యద్ వికారుద్దీన్ ఖాద్రీ గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా హుమ్నాబాద్ సమీపంలో 65వ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది.  హైదరాబాద్‌కు చెందిన వికారుద్దీన్ కర్ణాటకలోని గుల్బర్గాలో జరుగనున్న ఇండో -అరబ్ సభకు హాజరయ్యేందుకు బయలుదేరారు.
 
అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం హుమ్నాబాద్ సమీపంలోకి వచ్చే సరికి టైరు పంక్చర్ కావడంతో పాటు ఎడమ వైపు ఉన్న రెండు చక్రాలు ఊడి  బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వికారుద్దీన్‌తో పాటు ఇండో -అరబ్ అధ్యక్షుడు షేక్ అబూబకర్‌లను జహీరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ ఆయన్ను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement