
జనగామ : జనగామ మండలం చీటకోడూరులో అల్లుడిని మామ హత్య చేసిన ఘటన అనేక అనుమానాలు తావిస్తుంది. ఫోన్ సమాచారంతో అల్లుడిని ప్లాన్ ప్రకారమే పిలిపించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన గంధమల్ల ఎల్లయ్య కూతురు మౌనికను కొలనుపాకకు చెందిన ఉదయ్ ప్రేమించి వివాహం చేసుకోగా... రెండు రోజుల క్రితం అతను మామ చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
చీటకోడూరులో ఎల్లయ్య నివాసం ప్రధాన రహదారిపై ఉండడమే కాకుండా చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయి. ఉదయ్‌ను హ్యత్య చేసే ముందు ఇరువురి మధ్య పెనుగులాట.. గొడ్డలితో నరికే సమయంలో అరుపులు.. కేకలు వినిపించాలి. గ్రామంలో ఎవరిని అడిగినా.. గొడవ జరిగినట్లు అలజడి లేదంటున్నారు. ఉదయ్ ఇంటికి రాగానే.. బయటకు తీసుకువెళ్లి చంపేసి.. ఇక్కడ పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయమై ఎవరూ కూడా సరైన వివరణ ఇవ్వడం లేదు. ఉదయ్ మృతదేహం ఉన్న ప్రదేశంలో కారం పొడి ప్యాకెట్ కూడా ఉన్నట్లు మంగళవారం పలువురు గ్రామస్తులు గుర్తుపట్టినట్లు తెలుస్తుంది. పెనుగులాట సమయంలో ఉదయ్ మామా, బావమర్ధిని ఎదురించడంతో కళ్లలో కారం చల్లి హత్య చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అర్ధరాత్రి హత్య జరిగినప్పటికీ ఉ దయ్ కుటుంబసభ్యులకు మాత్రం తెల్లవారుజా ము 9గంటల తర్వాతనే సమాచారం అందించారు.
ఆలస్యం వెనక అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. అల్లుడిని మామనే హత్య చేసినట్లు పోలీ సులు నిర్ధారించగా బావమర్ధి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరేనా.. ఇంకెవరైనా హత్యలో పాలుపంచుకున్నారనే అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
8 మందిపై కేసు నమోదు..
అల్లుడు గంధమల్ల ఉదయ్‌ను గొడ్డలితో హత్య చేసిన ఘటనలో మామ ఎల్లయ్య, బావమర్ధి పవన్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క శ్రీనివాస్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు, నింధితులను త్వరలోనే రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment