జనగామ నుంచే టీఆర్‌ఎస్ పతనం
భయభ్రాంతులతో ఉద్యమాలను అడ్డుకోలేరు
తెలంగాణ పోరాటంలో తప్పుడు కేసులు లేవు
సబ్‌జైలులో జేఏసీ నాయకులను పరామర్శించిన పొన్నాల
జనగామ : ప్రజాస్వామ్యయుతంగా జనగామ జిల్లా కోసం చేస్తున్న ఉద్యమాలను అణచివేసే ధోరణిని ప్రభుత్వం మానుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించా రు. జిల్లా ఉద్యమంలో అరెస్ట్ అయి జనగామ సబ్‌జైలులో ఉన్న జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ నా యక్, ఆకుల వేణుగోపాల్‌రావును బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం పొన్నాల విలేకరుల తో మాట్లాడుతూ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్, జనగామలో అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పతనం వరంగల్ జిల్లా జనగామ నుంచి మొదలైం దని హెచ్చరించారు. కేసులు, పోలీసుల లాఠీలకు భయపడి వెన కంజ వేసే ప్రసక్తేలేదన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమాలు మరింతం ఎగిసిపడతాయన్నారు.
తెలంగాణ ఉద్యమం లో మంత్రులపై దాడులు చేస్తేనే ఆకాంక్షతో చేశారని ఊరుకున్నా మే తప్ప, ఒక్క కేసు, రిమాండ్ చేయలేదన్నారు. జనగామ జిల్లా కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే, రెచ్చగొట్టే విధం గా అక్ర మ కేసులను బనాయించి, 144 సెక్షన్ పేరుతో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల జాబి తాలో 11వ పేరు జనగామ అని ప్రకటించిన సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు. నాయకులు పీవీ శ్రీనివాస్, వెన్నెం వెంకటనర్సింహారెడ్డి, రంగరాజు ప్రవీణ్‌కుమార్, ఖాదర్ షరీఫ్, రంగు రవి, వనజారెడ్డి, జమాల్‌షరీప్, మేకల రాంప్రసాద్, బుచ్చిరెడ్డి, గౌస్, వేమెళ్ల పద్మ, వెన్నెం శ్రీలత, నజీర్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.