దేవరుప్పుల : జనగామను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మంగళవారం మండల కేంద్రంలోని జనగామ-సూర్యాపేట రహదారిపై అఖిలపక్ష నాయకులు రాస్తారోకో చేశారు. తొలుత మండల కేంద్రంలోని వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూయించి గంటపాటు రాస్తారోకో చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వలస వచ్చిన నేతలకు పదవులు కల్పించేందుకు ప్రజల మనోభావాలను పక్కకు పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
రాస్తారోకోలో మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉప్పల సురేష్‌బాబు, సీపీఐ మండల కార్యదర్శి బిల్లా తిరుపతిరెడ్డి, ఆటో యూనియన్ అధ్యక్షుడు నర్ర సోమసుందర్, పీఎసీఎస్ ైవె స్ చైర్మన్ గుంషావళి, పెద్ది కృష్ణమూర్తి, రవి, ముసిగుంపుల అంజయ్య, బస్వ సోమన్న, వంగ దశరథ,రతన్, మల్లాజీ, ప్రభాకర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.