జిల్లా కావాల్సిందే..
రోడ్డెక్కిన జనగామ ప్రజలు
హైవేపై మూడు చోట్ల రాస్తారోకో
అరెస్టులు, జర్నలిస్టుల ర్యాలీలు
నేడు జనగామ బంద్
జనగామ : జనగామ జిల్లా వద్దనడానికి ఒక్క కారణం చూపించండి.. తప్పుడు నివేదికలు పంపిన అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలి.. ఏడాదిగా జిల్లా కోసం శాంతియుతం గా ఉద్యమం చేస్తున్నాం.. అన్యాయం చేస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధం అంటూ ప్రజాసంఘాలతో కలిసి ఐకాస గురువారం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. ఐకాసా నాయకులు మం గళ్లపల్లి రాజు, అరుట్ల దశమంతరెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, రెడ్డి రత్నాకర్‌రెడ్డి, జేరిపోతుల కుమార్, పెద్దోజు జగదీష్, ధర్మపురి శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, మేడ శ్రీనివాస్, తిప్పారపు విజయ్, శివరాజ్, కేమిడి చంద్రశేఖర్, రంగరాజు ప్రవీణ్, సౌడ రమేష్, నాగారపు వెంకట్, వీరస్వామి, కాసుల శ్రీను తో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఆర్టీసీ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మంత్రులు కడి యం శ్రీహరి, చందూలాల్ వరంగల్ వెళుతున్నారని సమాచారం అందుకున్న ఉద్యమకారు లు పెద్ద ఎత్తునచౌరస్తాకు చేరుకున్నారు. హైవే ను దిగ్బంధం చేయడంతో ట్రాఫిక్ స్థంభించి పోయింది. జిల్లాకాని పక్షంలో హైవేపై వెళుతు న్న ప్రజాప్రతినిధులను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. జిల్లాకు అన్ని అర్హతలున్నా అధికారులు తప్పుడు రిపోర్టులు పంపి అన్యా యం చేయాలని చూస్తున్నారని నినాదాలు చే శారు. అవసరమైతే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీ డియా ప్రతినిధులు కాసాని ఉపేందర్, సురి గెల బిక్షపతి, పబ్బా వేణు, కేమిడి ఉపేందర్, యూసఫ్, రేవంత్, పన్నీరు భానుచందర్, ప్ర సాద్, బాబా, శ్రీనివాస్, చౌదరపల్లి ఉపేందర్, కోడెం కుమార్, ఓరుగంటి సంతోష్, కుమార్‌తో పాటు పలువురు ప్రతినిధులు ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడి నుంచి అంబేడ్కర్‌నగర్ మీదుగా రైల్వేస్టేషన్, నెహ్రూ పార్కు, ఆర్టీసీ బస్టాండు వరకు నినాదాలు చేస్తూ జిల్లా ఆకాంక్షను తెలిపారు.
నేడు బంద్‌కు పిలుపు
జిల్లా సాధన కోసం తలపెట్టిన ఉద్యమంలో అరెస్టులు, ప్రభుత్వ విధానంపై నిరసిస్తూ శుక్రవారం జనగామ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఐకాసా, అన్ని పార్టీల నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డి, మేడ శ్రీను, ఆకుల వేణుగోపాల్‌రావు, మంగళ్లపల్లి రాజు, కేమిడి చంద్రశేఖర్, నాగారపు వెంకట్, పెద్దోజు జగదీష్, సౌడ రమేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మద్దతు పలికి, బంద్‌ను సంపూర్ణంగా విజయవంతం చేసేం దుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.